ఎవరీ నందమూరి చైతన్య.. ఇతని వెనుక ఉన్న కథ తెలుసా?

ఎవరీ నందమూరి చైతన్య.. ఇతని వెనుక ఉన్న కథ తెలుసా?

  • Author Soma Sekhar Published - 09:12 PM, Thu - 7 December 23

Nandamuri Chaitanya Krishna: నందమూరి తారక రామారావు మనవడు నందమూరి చైతన్య కృష్ణ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ 'బ్రీత్'. ఈ మూవీతో ఆయన ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు.

Nandamuri Chaitanya Krishna: నందమూరి తారక రామారావు మనవడు నందమూరి చైతన్య కృష్ణ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ 'బ్రీత్'. ఈ మూవీతో ఆయన ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు.

  • Author Soma Sekhar Published - 09:12 PM, Thu - 7 December 23

నందమూరి చైతన్య కృష్ణ.. దివంగత నటుడు నందమూరి తారక రామారావు కుటుంబం నుంచి వచ్చిన మరో నట వారసుడు. ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ కొడుకే ఈ చైతన్య కృష్ణ. ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నాడు. దానికి ఏకైక కారణం లేట్ వయసులో లేటెస్ట్ గా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వడమే. చైతన్య హీరోగా ‘బ్రీత్’ అనే మూవీ వచ్చింది. డిసెంబర్ 2న విడుదలైన మూవీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఇందులో చైతన్య నటనకు మంచి మార్కులే పడ్డాయి. మెడికల్ మాఫియా నేపథ్యంలో వచ్చిన ఈ థ్రిల్లర్ మూవీకి వంశీ కృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహించారు. ఇక ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత నెటిజన్లు ఎన్టీ రామారావు మనవడు చైతన్య గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అతడి గురించి తెలుసుకుందాం.

నందమూరి చైతన్య కృష్ణ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘బ్రీత్’. మెడికల్ మాఫియా నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రానికి వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహించాడు. డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే ఈ మూవీతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు నందమూరి వారసుడు. నందమూరి తారక రామారావు కొడుకు జయకృష్ణ కుమారుడే ఈ చైతన్య కృష్ణ. సినిమాలపై ఉన్న ప్రేమతో.. లేటు వయసులో లేటెస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు. అయితే 2003లో జగపతి బాబు హీరోగా వచ్చిన ‘ధమ్’లో ఓ పాత్రలో మెరిశాడు ఈ నందమూరి అబ్బాయి. ఇక ఆ తర్వాత అవకాశాలు రాక ఇండస్ట్రీకి దూరం అయ్యాడు. ఇన్ని సంవత్సరాలు అవుతున్నా గానీ.. నటపై అతడికి ప్రేమ తగ్గలేదని బ్రీత్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి నిరూపించుకున్నాడు. సాధారణంగా ఇండస్ట్రీకి రావడానికి ఏజ్ అంటూ ఉండదు.. అయితే హీరోగా, హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలంటే మాత్రం వయసు చూసుకోవాల్సిందే. కానీ ఇవన్నీ పట్టించుకోలేదు చైతన్య.

ఈ క్రమంలోనే తన డ్రీమ్ కోసం ఎవరెన్ని విమర్శలు చేసినా.. వాటిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చాడు. ఇదిలా ఉండగా 2020 డిసెంబర్ 18న చైతన్య కృష్ణ వివాహం జరిగింది. వీరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి. కాగా.. ధమ్ మూవీ తర్వాత ఇండస్ట్రీ వైపు చూడలేదు. మధ్యలో పాలిటిక్స్ లో కూడా కనిపించాడు ఈ హీరో. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. బ్రీత్ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి చైతన్యపై ఒక రకమైన కామెంట్స్ మెుదలైయ్యాయి. దానికి కారణం ఆయన కాస్త లేట్ గా ఇండస్ట్రీకి రావడమే. ఆ విమర్శలను సైతం చైతన్య పక్కనపెట్టి.. హీరోగా తొలి అడుగు వేశాడు. నటనపై తనకున్న ప్రేమే అతడిని ఇక్కడి దాకా తీసుకొచ్చిందనే చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ.. నటనపై ప్రేమను, ఇండస్ట్రీకి రావాలన్న బలమైన కోరికను నెరవేర్చుకున్న చైతన్యపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments