Holidays: ఉద్యోగులు- విద్యార్థులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండు రోజులు సెలవులు..!

ఉద్యోగులు- విద్యార్థులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండు రోజులు సెలవులు..!

వేసవి ముగిసిపోయింది. విద్యార్థులకు మళ్లీ స్కూల్స్ మొదలయ్యాయి. అంతలో రెండు సెలవులు వచ్చేశాయి. ఈ నెల 17, 25న రెండు సెలవులు రాబోతున్నాయి. కాగా, ఇప్పుడు వీటితో పాటు మరో సెలవు రాబోతుంది.

వేసవి ముగిసిపోయింది. విద్యార్థులకు మళ్లీ స్కూల్స్ మొదలయ్యాయి. అంతలో రెండు సెలవులు వచ్చేశాయి. ఈ నెల 17, 25న రెండు సెలవులు రాబోతున్నాయి. కాగా, ఇప్పుడు వీటితో పాటు మరో సెలవు రాబోతుంది.

శ్రీరామనవమి, హోలీతో పండుగల సీజన్‌కు తెర పడింది. మళ్లీ జూన్ తొలకరి మొదలైన నాటి నుండి ఫెస్టివల్ సీజన్ స్టారయ్యింది. ఇప్పుడిప్పుడే పిల్లలు బడికి పోవడం స్టార్ట్ చేశారు. అయితే అప్పుడే సెలవులు కూడా వచ్చేస్తున్నాయి. ఈ నెలలో రెండు సెలవులను ప్రకటించింది ప్రభుత్వం. జూన్ 17, 25 తేదీలను సెలవు దినాలుగా ప్రకటించింది తెలంగాణ సర్కార్. త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ జూన్ 17న వచ్చింది. దీంతో ఆదివారం, సోమవారం వరుసగా సెలవులు వచ్చాయి.అలాగే జూన్ 25న వచ్చే ఈద్ ఎ గదీర్‌కు తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించిన సంగతి విదితమే. ఈ రెండు రోజులు విద్యార్థులకు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ఉండనున్నాయి.

ఇప్పుడు మరో సెలవు ఉండనున్నట్లు తెలుస్తుంది. ఎప్పుడంటే.. జులై 27న. ఎందుకంటే.. బోనాల పండుగ సందర్భంగా ఈ సెలవు ఉండనుంది. ఆషాడ మాసం మొదలైందంటే.. తెలంగాణలో బోనాలు జరుపుకోవాల్సిందే. ఇక్కడ పెద్ద యెత్తున ఈ పండుగను చేసుకుంటారు. ఈ మాసంలో మహంకాళి దేవిని పూజిస్తారు. తల్లికి బోనం సమర్పించి.. మొక్కులు తీర్చి.. సందడి చేస్తుంటారు. ప్రతి పల్లె నుండి పట్నం వరకు ప్రతి గడపలో బోనాలు తీసుకెళ్లే అక్కా, చెల్లెమ్మల్లు కనిపిస్తుంటారు. దీంతో ప్రతి ఇంట్లో సందడి నెలకొంటుంది. హైదరబాద్ నగరంతో సహా ఇతర ప్రాంతాల్లోని మహిళలంతా బోనాలు పండుగను ప్రత్యేకంగా జరుపుకుంటారు. 2024 జూలై 7వ తేదీన గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించనున్నారు భక్తులు. హైదరాబాద్‌లో నెలరోజుల పాటు బోనాల పండుగను మూడు దశల్లో నిర్వహిస్తారు. గోల్కొండ బోనాలు అనంతరం సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో లష్కర్ బోనాలు నిర్వహిస్తారు.

పాతబస్తీలోని లాల్ దర్వాజాలోని శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో, హరిబౌలిలోని శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి ఆలయంలో ఉత్సవాలు జరుగుతాయి.  జులై 7 నుండి మొదలై.. శ్రావణ మాసం మొదలైన నాటికి ముగుస్తాయి. అంటే ఆగస్టు 4 వరకు ఈ బోనాల పండుగను జరుపుకుంటారు తెలంగాణ వాసులు. జూలై 11 గురువారం .. రెండవ పూజ, జూలై 14 ఆదివారం .. మూడవ పూజ, జూలై 18 గురువారం .. నాల్గవ పూజ నిర్వహిస్తారు. జూలై 21 ఆదివారం .. ఐదవ పూజ, జూలై 25 గురువారం .. ఆరోపూజ, జూలై 28 ఆదివారం .. ఏడవ పూజ కాగా.. ఆగస్ట్ 1 గురువారం.. ఎనిమిదవ పూజ అనంతరం.. ఆగస్టు 4 ఆదివారం .. తొమ్మిదవ పూజ చేస్తారు. కాగా, తెలంగాణ రాష్ట్ర పోర్టల్ క్యాలెండర్ 2024 ప్రకారం జూలై 27న శనివారం రోజున బోనాలు సెలవు దినం అని పేర్కొనబడి ఉంది. ఈ లెక్క ప్రకారం వరుసగా రెండు రోజులు రానున్నాయి. 150 సంవత్సరాల క్రితం పెద్ద కలరా వ్యాప్తించిన దగ్గరి నుండి బోనాలు పండుగను చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది.

Show comments