Bomb attack on MLA Shankar narayana car: బ్రేకింగ్ : MLA కారుపై బాంబు దాడి

బ్రేకింగ్ : MLA కారుపై బాంబు దాడి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ ఎమ్మెల్యేపై హత్యాయత్నం జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న కారుపై బాంబు దాడికి పాల్పడ్డారు. సత్యసాయి జిల్లాలో ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. సత్యసాయి జిల్లా పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణపై హతయాయత్నం జరిగింది. ఆయనను అంతమొందించాలని దుండగులు పథకం వేసినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయనపై నిఘా పెట్టిన దుండగులు శంకర్ నారాయణ ప్రయాణిస్తున్న కారుపై గుర్తు తెలియని దుండగుడు బాంబు విసిరాడు. అదృష్టావశాత్తు ఆ బాంబు పేలక పోవడంతో ప్రమాదం తప్పింది. పెను ప్రమాదం నుంచి శంకర్ నారాయణ ప్రాణాలతో బయటపడ్డారు. గోరంట్ల మండలం గడ్డం తండాలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా బాంబు దాడికి పాల్పడిన నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Show comments