Vishwambhara: మెగాస్టార్ ను ఢీ కొంటున్న బాలీవుడ్ స్టార్! డైరెక్టర్ పోస్ట్ వైరల్..

Vishwambhara: మెగాస్టార్ ను ఢీ కొంటున్న బాలీవుడ్ స్టార్! డైరెక్టర్ పోస్ట్ వైరల్..

'విశ్వంభర' మూవీలో మెగాస్టార్ చిరంజీవిని ఢీ కొట్టేందుకు బాలీవుడ్ స్టార్ రెడీ అయ్యాడు. ఇందుకు సంబంధించి డైరెక్టర్ వశిష్ఠ పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

'విశ్వంభర' మూవీలో మెగాస్టార్ చిరంజీవిని ఢీ కొట్టేందుకు బాలీవుడ్ స్టార్ రెడీ అయ్యాడు. ఇందుకు సంబంధించి డైరెక్టర్ వశిష్ఠ పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

సినిమాలో హీరో ఎంత స్ట్రాంగ్ గా ఉంటే.. విలన్ అంతకంటే బలంగా ఉండాలి. అప్పుడే ప్రేక్షకులకు హీరో, విలన్ ను ఎలా మట్టికరిపిస్తాడో అని ఆసక్తి ఏర్పడుతుంది. అందుకే దర్శకధీరుడు తన సినిమాల్లో హీరో కంటే విలన్ క్యారెక్టర్లను ఎక్కువగా ఎస్టాబ్లిస్ చేస్తుంటాడు. ఇక ఇప్పుడు ‘విశ్వంభర’ మూవీలో మెగాస్టార్ చిరంజీవిని ఢీ కొట్టేందుకు బాలీవుడ్ స్టార్ రెడీ అయ్యాడు. ఇందుకు సంబంధించి డైరెక్టర్ వశిష్ఠ పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. మరి చిరంజీవితో తలపడబోతున్న ఆ స్టార్ ఎవరు? తెలుసుకుందాం పదండి.

తన రెండో చిత్రంతోనే మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశం కొట్టేశాడు దర్శకుడు వశిష్ఠ. తొలి చిత్రం ‘బింబిసార’తో నందమూరి కళ్యాణ్ రామ్ కు ఊహించని సక్సెస్ ను అందించాడు. ఇక ఇప్పుడు మెగాస్టార్ తో ‘విశ్వంభర’ అంటూ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైయ్యాడు. సోషియో ఫాంటసీ జానర్ లో రూ. 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇక ఈ మూవీలో ఇప్పటి వరకు మెగాస్టార్ కనిపించని పాత్రలో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఇందులో భారీ యాక్షన్ సీన్స్ ఉన్నాయట. కాగా.. విశ్వంభర షూట్ లో ఎంట్రీ ఇచ్చాడు బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్. ఈ విషయాన్ని డైరెక్టర్ వశిష్ఠ తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా తెలియజేశాడు.

కొన్ని రోజులుగా ఈ మూవీలో విలన్ గా కునాల్ కపూర్ కనిపించబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ న్యూసే నిజమైంది. కానీ టీమ్ మాత్రం అతడు ఏ పాత్రలో కనిపించబోతున్నాడు అన్న విషయాన్ని మాత్రం తెలపలేదు. అయితే విశ్వంభరలో కునాల్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని, అతడు విలన్ అని తెలిసే ట్విస్ట్ సినిమాకే హైలెట్ అని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఈ బాలీవుడ్ స్టార్ పై ఇప్పటికే కొన్ని సీన్లు చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న షూటింగ్ లో ఇతడు కూడా పాల్గొంటున్నట్లు సమాచారం. జూలై చివరి నాటికి షూటింగ్ పూర్తిచేయాలని మూవీ టీమ్ భావిస్తోంది. ఎందుకంటే? విజువల్ ఎఫెక్ట్స్ కు ఎక్కువ ప్రాధాన్యం ఉన్ననేపథ్యంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులపై ఎక్కువ దృష్టి పెట్టనుంది.

Show comments