NTR 31: ఎన్టీఆర్ తో మూవీ.. యానిమల్ విలన్ ను దించుతున్న ప్రశాంత్ నీల్!

NTR 31: ఎన్టీఆర్ తో మూవీ.. యానిమల్ విలన్ ను దించుతున్న ప్రశాంత్ నీల్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కబోతుందన్న విషయం తెలిసిందే. ఇక ఈ మూవీ కోసం ప్రశాంత్ నీల్ యానిమల్ విలన్ బాబీ డియోల్ ను దించుతున్నాడట. ఆ వివరాల్లోకి వెళితే..

యంగ్ టైగర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కబోతుందన్న విషయం తెలిసిందే. ఇక ఈ మూవీ కోసం ప్రశాంత్ నీల్ యానిమల్ విలన్ బాబీ డియోల్ ను దించుతున్నాడట. ఆ వివరాల్లోకి వెళితే..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస ప్రాజెక్ట్ లతో ఫుల్ బిజీగా ఉన్నానడు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సెప్టెంబర్ 27న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక తాజాగా గోవాలో యాక్షన్ షెడ్యూల్ పూర్తి చేసుకుని హైదరాబాద్ చేసుకున్నాడు ఎన్టీఆర్. దేవర మూవీ తర్వాత తన నెక్ట్స్ మూవీ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో చేస్తున్నట్లు తారక్ ప్రకటించిన విషయం తెలిసిందే. NTR 31 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ గురించిన ఓ న్యూస్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ దేవర త్వరలోనే రిలీజ్ కు రెడీగా ఉంది. ఇక ఈ చిత్రం షూటింగ్ పూర్తి కాగానే కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ లో ఓ చిత్రం చేయనున్నాడు తారక్. ఎన్టీఆర్ 31 వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ ప్రారంభం కానుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఆగస్టు నుంచి షూటింగ్ స్టార్ట్ అవ్వబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ పరిశ్రమలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే?

ఎన్టీఆర్ 31 మూవీలో విలన్ గా యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ నటిస్తున్నాడని గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ న్యూస్ పై మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు గానీ.. త్వరలోనే వచ్చే అవకాశాలు మాత్రం ఉన్నాయంటున్నారు. కాగా.. యానిమల్ తో ఇండియా వైడ్ గా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు బాబీ డియోల్. బాలీవుడ్ లో నటుడిగా మంచి గుర్తింపు అప్పటికే ఉన్నప్పటికీ.. యానిమల్ తో అతడి రేంజ్ మరింత పెరిగింది.

Show comments