Kangana Ranaut: రాజకీయాలకంటే సినిమాలే మేలు.. MP కంగనా సంచలన కామెంట్స్!

Kangana Ranaut: రాజకీయాలకంటే సినిమాలే మేలు.. MP కంగనా సంచలన కామెంట్స్!

సినీ నటి,  బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనేక సినిమాలతో అందం, అభినయంతో బాలీవుడ్ లో  మంచి క్రేజ్ సంపాదించుకుంది. తాజాగా రాజకీయాలపై ఆమె షాకింగ్ కామెంట్స్ చేశారు.

సినీ నటి,  బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనేక సినిమాలతో అందం, అభినయంతో బాలీవుడ్ లో  మంచి క్రేజ్ సంపాదించుకుంది. తాజాగా రాజకీయాలపై ఆమె షాకింగ్ కామెంట్స్ చేశారు.

సినీ రంగానికి చెందిన ఎంతో మంది రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంతో మంది అలా  పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి..తమదైన పాలనతో ప్రజల్లో మంచి గుర్తింపు సంపాదిస్తున్నారు.  ఇప్పటికే చాలా మంది రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వగా..మరికొందరు సెలబ్రిటీలు అదే బాట పడుతున్నారు. సౌత్ లోనే కాకుండా నార్త్ లో సైతం  పలువురు హీరో, హీరోయిన్లు పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల ద్వారా పలువురు సెలబ్రిటీలు చట్టసభల్లోకి అడుగుపెట్టారు. అలాంటి వారిలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కూడా ఎంపీగా గెల్చి పార్లమెంట్ లోకి అడుగుపెట్టారు. ఇది ఇలా ఉంటే రాజకీయాలపై ఆమె సంచలన కామెంట్స్ చేశారు. మరి..ఆమె చేసిన వ్యాఖ్యలు ఏమిటి, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…ట

సినీ నటి,  బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనేక సినిమాలతో అందం, అభినయంతో బాలీవుడ్ లో  మంచి క్రేజ్ సంపాదించుకుంది. కేవలం సినిమాలతోనే కాకుండా అనేక రకాల వివాదలతో ఆమె వార్తల్లో నిలుస్తుంటారు. బీజేపీ మద్దతుగా మాట్లాడుతూ.. అనేక వ్యాఖ్యలు చేసింది. ఇది ఇలా ఉంటే..  ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండి నియోజవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి.. విజయం సాధించింది. అనంతరం ఎయిర్ పోర్టులో ఓ మహిళ జవాన్ కంగనాను చెంపదెబ్బ కొట్టింది. దీంతో ఈ ఇష్యూ గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇలాంటి సమయంలోనే తాజాగా రాజకీయాలపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసి..మరోసారి వార్తల్లో నిలిచింది. రాజకీయాలకన్నా సినిమాలు మేలు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న ఆమె ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఎంపీగా గెలిచిన తరువాత ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మండి లోక్ సభ నియోజకవర్గం నుండి పోటీచేసిన ఆమె మంచి మెజారిటీతో విజయం సాధించారు. ఈ క్రమంలోనే త్వరలో ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలను  పూర్తి చేస్తానని తెలిపింది. అంతేకాక ఇకనుండి తన సమయమంతా ప్రజలకు సేవ చేసేందుకే వినియోగిస్తాని చెప్పుకొచ్చారు. ఇది ఇలా ఉంటే ఈ మధ్యే ఆమె ఓ పాడ్ కాస్ట్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి రమ్మని తనకు పిలుపు రావడం కొత్తేమీ కాదని, తన తొలి సినిమా నుంచి ఇలాంటి ఆహ్వానాలు వచ్చాయని ఆమె తెలిపింది. అయితే పాలిటిక్స్ పై ఆసక్తి ఉంది కాబట్టి కష్టపడి ఇక్కడి వరకు వచ్చాని లేకుంటే.. ఈ స్థాయికి వచ్చేదాన్ని కాదని తెలిపారు. అయితే రాజకీలాయంటే అంత ఈజీ కాదని లీడర్ అంటే వైద్యుడిలా ప్రజలకు ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉండి రక్షించాలని తెలిపింది. అందుకే రాజకీయాలకంటే సినిమాలు ఉత్తమని, అక్కడ ఒక సినిమా పూర్తవగానే విశ్రాంతి  తీసుకోవచ్చిని తెలిపింది. కానీ, రాజకీయాల్లో అలా కాదు.. ప్రతీక్షణం ప్రజలకోసం ఆలోచేస్తునే ఉండాలంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రస్తుతం కంగనా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.

Show comments