అట్టహాసంగా పిల్లల బర్త్ డే ప్లాన్ చేస్తున్నారా? ఒక్కసారి ఈ వీడియో చూడండి..

అట్టహాసంగా పిల్లల బర్త్ డే ప్లాన్ చేస్తున్నారా? ఒక్కసారి ఈ వీడియో చూడండి..

ప్రస్తుతం ఎక్కడ చూసిన ఫోటో షూట్ ట్రెండ్ అనేది జోరుగా కొనసాగుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో చాలామంది ఈ ఫోటో షూట్ పేరుతో కొత్త ప్రయోగాలు చేస్తుంటారు. కానీ, ఆ ప్రయాత్నాలే ప్రమాదాలను తెచ్చి పెడుతుంది. ఇక అందుకు నిదర్శనమే ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఓ వీడియో.

ప్రస్తుతం ఎక్కడ చూసిన ఫోటో షూట్ ట్రెండ్ అనేది జోరుగా కొనసాగుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో చాలామంది ఈ ఫోటో షూట్ పేరుతో కొత్త ప్రయోగాలు చేస్తుంటారు. కానీ, ఆ ప్రయాత్నాలే ప్రమాదాలను తెచ్చి పెడుతుంది. ఇక అందుకు నిదర్శనమే ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఓ వీడియో.

ప్రస్తుతం సమాజంలో ప్రతి విషయం ఒక ట్రెండ్ గానే నడుస్తోంది. ఈ క్రమంలోనే.. ఏదైనా కొత్త కొత్త పనులు, విషయాలు జరిగితే.. ఇక రాను రాను అదే ట్రెండ్ గా కొనసాగిపోతుంది. అయితే ఈ మధ్య కాలంలో కూడా ఓ కొత్త ట్రెండ్ అనేది కొనసాగుతుంది. అదే ఫోటో షూట్.. ఇది లేనిదో ప్రస్తుతం ఏ కార్యక్రమం కూడా పూర్తి కాదు.ముఖ్యంగా బర్త్ డే దగ్గర నుంచి ఎంగేజ్ మెంట్, ప్రీ వెడ్డింగ్, మ్యారెజ్, బేబి షవర్ వంటి వివిధ కార్యక్రమాలకు ఈ ఫోటో షూట్ అనేది కచ్చితంగా ఉండాల్సిందే. అంతలా ఈ ఫోటో షూట్స్ ట్రెండ్ కు అందరూ బానిసలు అయిపోయరు. అయితే అది ఎలా అంటే.. కొన్ని సార్లు జనాలకు చిరాకుతెప్పించేలా కూడా ఉంటాయి. అలాగే కొంతమంది ప్రాణాలు పోయే పరిస్థితిలో కూడా ఉంటాయి. కానీ, ఏదీ ఏమైనా ట్రెండ్ అనేది ఇప్పటిలో అగేది కాదు. ఎప్పుడు కొత్తదనని కోరుకున్న ప్రజలు ఈ ఫోటో షూట్స్ అనేవి ఒక అందమైన మెమోరీగా గుర్తుండిపోవాలని చాలా వినూతంగా ఫ్లాన్ చేస్తుంటారు.

కానీ, ఇలా ఫ్లాన్ చేసిన సమయంలో అనుకోకుండా.. కొన్ని ప్రమాదకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఇక అందుకు తగ్గట్టుగానే.. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది.  అయితే ఈ వీడియోలో తమ కూతురి పుట్టిన రోజు సందర్భంగా ఆ తల్లిదండ్రులు ఎంతో అంగరంగ వైభంగా ఫోటో షూట్ నిర్వహిస్తున్నారు. కానీ, అనుకోకుండా.. ఈ ఫోటో షూట్స్ లో భాగంగా.. మరి కొంత ఆకర్షిణీయంగా ఫోటో షూట్ జరగాలని క్రాకర్స్ ను వెలిగిస్తారు. కానీ, ఒక్కసారిగా పేలి ఆ నిప్పు రవ్వలు ఆ చిన్నారికి, చిన్నారి తల్లికి తాకుతాయి. అయితే ఈ ఘటనలో జరిగిన ప్రమాదం చిన్నదే కావచ్చు. కానీ, ఇలాంటి ఘటనలో కొన్ని సార్లు చాల పెద్దవి అవుతాయి. ముఖ్యంగా ఇలాంటి అట్టహాసమైన ప్రయోగాల వలన ప్రాణాలు రిస్క్ లో పెట్టినట్లు అవుతుంది. ప్రస్తుతం ఆ చిన్నారి బర్త్ డే కు సంబంధించి ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. చాలామంది తమకు సంబంధించిన ఈవెంట్స్ ను ఒక అందమైన మెమోరీగా గుర్తుండిపోవలని వేలకు వేలు డబ్బులు పోసి ఈ ఫోటో షూట్స్ చేసుకుంటారు. అయితే ఏదైనా వినూతంగా ఉండేలనే నేపథ్యంలో చాలామంది కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటారు. కానీ, ఫోటో షూట్స్ పేరుతో కొత్తగా ప్రయోగాలు చేస్తే ఎంతటి ప్రమాదాలకు దారి తీస్తుందో ఈ చిన్న వీడియోనే నిదర్శనం. కనుకు ఇక మీదట ఫోటో షూట్స్ చేసినప్పుడు అందుకు తగ్గట్టు జాగ్రత్తాలు వహిస్తే చాలా మంచింది. ముఖ్యంగా మీ పిల్లలు బర్త్ డే లు అట్టహాసంగా చేస్తున్నప్పుడు  కొత్తగా రిస్క్ చేసి ఫోటో షూట్స్ చేయాలనే ఆలోచన విరమించుకుంటే మంచిదని చాలామంది నిపుణులు సూచిస్తున్నారు.

Show comments