Bigg Boss Telugu Season 8 Contestants- Adireddy: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8.. కంటెస్టెంట్స్ ఎవరో చెప్పేసిన ఆదిరెడ్డి!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8.. కంటెస్టెంట్స్ ఎవరో చెప్పేసిన ఆదిరెడ్డి!

Bigg Boss Adireddy- Bigg Boss Telugu Season 8 Contestants: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి సంబంధించి అప్పుడే బజ్ స్టార్ట్ అయిపోయింది. ఈ షోకి ఎవరెవరు కంటెస్టెంట్స్ గా వెళ్తారో.. రివ్యూవర్ ఆదిరెడ్డి తనకు ఉన్న సమాచారం ప్రకారం కొన్ని పేర్లు చెప్పుకొచ్చాడు.

Bigg Boss Adireddy- Bigg Boss Telugu Season 8 Contestants: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి సంబంధించి అప్పుడే బజ్ స్టార్ట్ అయిపోయింది. ఈ షోకి ఎవరెవరు కంటెస్టెంట్స్ గా వెళ్తారో.. రివ్యూవర్ ఆదిరెడ్డి తనకు ఉన్న సమాచారం ప్రకారం కొన్ని పేర్లు చెప్పుకొచ్చాడు.

మోస్ట్ పాపులర్.. తెలుగు రియాలిటీ షో అనగానే అందరూ బిగ్ బాస్ అనేస్తారు. అలాంటి బిగ్ బాస్ ఇప్పటికే తెలుగులో ఏకంగా 7 సీజన్స్ కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు ప్రేక్షకులు అంతా 8వ సీజన్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇంకా ఎవరికీ 8వ సీజన్ కి సంబంధించి ఎలాంటి లీకులు, హింట్లు రాలేదు. కానీ, బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 కంటెస్టెంట్, య్యూబర్ ఆదిరెడ్డి మాత్రం సీజన్ 8కి సంబంధించి కంటెస్టెంట్స్ ఎవరు అనే దానిపై క్లారిటీ ఇచ్చాడు. తనకు ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం ఒక వీడియో చేశాడు. అందులో చాలానే పేర్లు రివీల్ చేశాడు. వాటిలో దాదాపుగా వచ్చే పేర్లే కనిపిస్తున్నాయి. అంతేకాకుండా.. బిగ్ బాస్ సీజన్ 8 ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా చెప్పేశాడు.

తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ కి సంబంధించి రివ్యూవర్ ఆదిరెడ్డి క్రేజీ న్యూస్ చెప్పేశాడు. సీజన్ 8 కంటెస్టెంట్స్ ఎవరు ఉండబోతున్నారు? ఎవరు వస్తే బాగుంటుంది? ఎవరు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? అనే విషయాలు వివరిస్తూ ఒక పెద్ద వీడియో విడుదల చేశాడు. ఆ వీడియోలో తనకు ఉన్న ఇన్ సైడ్ సోర్సెస్, తనకు ఉన్న పరిచయాలతో వచ్చిన సమాచారం ప్రకారం కొన్ని పేర్లను రివీల్ చేశాడు. ఆ పేర్లలో అంతా వస్తారా అంటే? కష్టం అనే చెప్పాలి. కానీ, దాదాపుగా వచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆదిరెడ్డి తనకు ఉన్న సమాచారం ప్రకారం ఆ పేర్లు చెప్పుకొచ్చాడు.

ఆల్రెడీ ఆదిరెడ్డి బిగ్ బాస్ కి వెళ్లి వచ్చాడు. బిగ్ బాస్ మీద రివ్యూలు చేస్తూ ఉంటాడు. కాబట్టి అతనికి దాదాపుగా పక్కా సమాచారమే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే ఆదిరెడ్డి చెప్పిన పేర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవతున్నాయి. ఆదిరెడ్డి అంచనా ప్రకారం వచ్చే కంటెస్టెంట్స్ ఎవరంటే.. బంచిక్ బబ్లు, రాజ్ తరుణ్, సోనియా సింగ్, హేమ, ఫార్మింగ్ నేత్ర, నేత్ర మాజీ భర్త వంశీ. వీరిలో ఇద్దరూ రావచ్చు. ఒకరైతే నేత్ర వచ్చే ఛాన్స్ ఉంది. జబర్దస్త్ నరేశ్ లేదంటే రియాజ్ వచ్చే అవకాశం ఉంది. రీతూ చౌదరి, సురేఖా వాణి లేదంటే ఆమె కుమార్తె సుప్రీత, కిరాక్ ఆర్పీ వచ్చే అవకాశాలు కూడా బాగా ఉన్నాయి. కుమారీ ఆంటీ, బర్రెలక్క, హీరోయిన్ కుషీత కల్లపు, బుల్లెట్ భాస్కర్ లేదంటే చమ్మక్ చంద్ర, అమృత ప్రణయ్ వచ్చే అవకాశం ఉంది.

నీతోనే డాన్స్ 2.0 కార్యక్రమంలో పాల్గొన్న జంటల్లో ఒకరు లేదా ఒక జంట వచ్చే ఛాన్స్ ఉంది. అంజలి పావనీ, పాత కంటెస్టెంట్స్ లో యాంకర్ శివకు ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. నయని పావనీకి కూడా ఛాన్స్ ఉంది. స్రవంతి చొక్కారపు, సోహెల్ కి కూడా అవకాశాలు ఉన్నాయి. మాస్టర్ షెఫ్ సంజయ్ తుమ్మా, రైతుబడి రాజేంద్ర రెడ్డి, ఫారెన్ లో సెటిల్ అయిన వ్లాగర్స్ నుంచి ఒకరు రావచ్చు. ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇంక షో విషయానికి వస్తే.. ఇది సెప్టెంబర్ 1 సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది అంటూ ఆదిరెడ్డి తనకు ఉన్న సమాచారాన్ని ఆ వీడియోలో షేర్ చేశాడు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లోకి ఎవరు వస్తే బాగుంటుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments