నెల రోజుల మందుగానే.. OTTలోకి భజే వాయు వేగం

నెల రోజుల మందుగానే.. OTTలోకి భజే వాయు వేగం

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ ఇటీవలే భజే వాయు వేగం సినిమాతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ గత కొన్ని రోజులుగా ఓటీటీలోకి వస్తుందనే టాక్ వినిపిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ సంబంధించి మరోసారి అందరి అంచనాలు తలకిందులు చేసింది.

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ ఇటీవలే భజే వాయు వేగం సినిమాతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ గత కొన్ని రోజులుగా ఓటీటీలోకి వస్తుందనే టాక్ వినిపిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ సంబంధించి మరోసారి అందరి అంచనాలు తలకిందులు చేసింది.

యంగ్ హీరో కార్తికేయ ఇటీవలే ‘భజే వాయు వేగం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. కాగా, ఈ మూవీని కొత్త దర్శకుడు ప్రశాంత్ రెడ్డితెరకెక్కించిగా..  యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. ఇక ఇందులో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించింది. అయితే అయితే ఫాథర్ సన్ ఎమోషనల్ అండ్ క్రైం థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమాపై అందరూ మంచి అంచనాలను పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే సినిమాను గతనెల మే 31న థియేటర్లలో విడుదలైంది. ఇక థియేటర్లలో విడుదలైన భజవాయు వేగం సినిమా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ కూడా రాబట్టింది. కానీ, ఈ సినిమా సడెన్ గా ఓటీటీలో రిలీజ్ అవుతుందనే టాక్ వినిపిస్తుంది. అయితే ఈమూవీని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ హక్కులను సొంతం చేసుకున్న విషయం తెలసిందే. ఈ క్రమంలోనే ఈ మూవీ జూన్ చివరివారంలో ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని టాక్ వినిపించింది.

దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ప్రేక్షకులంతా తెగ ఎదురు చూశారు. కానీ, ఊహించని విధంగా భజే వాయు వేగం సినిమా ప్రేక్షకుల అంచనాలను తలకిందులు చేసింది. ఇప్పటి వరకు జూన్ నెలలో ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వస్తుందని టాక్ వినిపించడంతో.. అందరికి ఈ సినిమాపై మంచి క్యూరియాసిటీ కలిగింది. కానీ,ఇప్పుడు ఈ మూవీ జూన్ నెల చివరివారంలో కూడా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చే దాఖలు కనిపించడంలేదట. పైగా భజే వాయు వేగం సినిమా జూలై మొదటి వారంలోని ఓటీటీలో డిజిటల్ ప్రీమియర్ కు రానుందని టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. ఇక ఈ విషయం తెలిసిన మూవీ లవర్స్ కు నిరాశ తప్పడం లేదు. మరి ఈ సినిమా ఇంతకి జూన్ చివరి వారంలో వస్తుందో మొదటి వారంలో వస్తుందో అనే విషయం అధికారికంగా ప్రకటించే వరకు ఎదురు చూడాల్సిందే.

ఇక భజేవాయు వేగం సినిమా విషయానికొస్తే..ఈ సినిమాలో హీరో ఓ క్రికెటర్ కావాలని అనుకుంటూ ఉంటాడు. ఇక ఆ హీరోకు మంచి ఇల్లు కుటుంబం అంతా బాగానే ఉన్నా కూడా.. అకస్మాత్తుగా ఇంట్లో పెరిగిన అప్పుల భాధ వలన  అతని తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకుంటారు. దీనితో ఒక్కసారిగా అతని జీవితం అంతా మారిపోతుంది. ఈ క్రమంలోనే అతని తండ్రి స్నేహితుని కుటుంబం హీరోని ఆదరిస్తుంది. ఇక అప్పటికే వారి ఇంట్లో ఓ కొడుకు ఉంటాడు, కానీ, ఇద్దరినీ ఆ కుటుంబం సమానంగానే పెంచుతారు.  కట్ చేస్తే మరొక సీన్ లో హైదరాబాద్ మేయర్ కొడుకుతో.. ఈ ఇద్దరి అన్నదమ్ములకు ఓ గొడవ జరుగుతుంది. అనుకోకుండా.. ఓ రోజు ఆ మేయర్ కొడుకు శవం తన తమ్ముడి కార్ లో దొరుకుతుంది. ఇక అసలు కథ అక్కడ స్టార్ట్ అవుతుంది. హీరో కు ఆ హత్యకు ఎమన్నా సంబంధం ఉందా..? అసలు మేయర్ కొడుకు ఎలా చనిపోయాడు..? ఈ హత్య కేసు నుంచి బయట పడ్డారా లేదా, చివరికి  ఏం జరుగుతుంది. అనే అంశలపై సినిమా కథంతా తిరుగుతుంది. మరి ఈ విషయాలన్ని తెలియాలంటే వెంటనే ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యేంత వరకు వేచి ఉండాల్సిందే. మరి, భజే వాయు వేగం మూవీ జూలై మొదటి వారంలోనే ఓటీటీలోకి వస్తుందనే వార్తపై  మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

Show comments