ఆ జట్టుపై ప్రతీకారం తీర్చుకునేందుకు రోహిత్‌ సేనకు ఇదే సరైన టైమ్‌!

ఆ జట్టుపై ప్రతీకారం తీర్చుకునేందుకు రోహిత్‌ సేనకు ఇదే సరైన టైమ్‌!

IND vs AUS, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియాకు ఓ జట్టుపై ప్రతీకారం తీర్చుకునేందుకు మంచి ఛాన్స్‌ వచ్చింది. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

IND vs AUS, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియాకు ఓ జట్టుపై ప్రతీకారం తీర్చుకునేందుకు మంచి ఛాన్స్‌ వచ్చింది. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో టీమిండియా వరుసగా మూడో విజయం సాధించి సగర్వంగా సూపర్‌ 8కు అర్హత సాధించింది. గ్రూప్‌ స్టేజ్‌లో మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే క్వాలిఫై అయిపోయింది. బుధవారం న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో యూఎస్‌ఏతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ సేన 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ విజయంతో సూపర్‌ 8కు వెళ్లిన టీమిండియా.. ఓ జట్టుపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చింది. గతేడాది వంద కోట్ల మందికి పైగా భాతర క్రికెట్‌ అభిమానుల హృదయాలను ముక్కలు చేసిన మ్యాచ్‌ ఏదో అందరికీ తెలిసే ఉంటుంది.

మన దేశంలో జరిగిన వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో టీమిండియా ఎంత అద్భుతంగా ఆడిందో మనం చూశాడు. వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచి.. ఓటమి ఎరుగని టీమ్‌గా ఫైనల్‌ వరకు దూసుకెళ్లింది. కానీ, ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది రోహిత్‌ సేన. ఆ ఓటమితో భారత క్రికెట్‌ లోకం కన్నీళ్లు పెట్టుకుంది. టీమిండియాకు రెండు కళ్లలాంటి రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ సైతం ఏడ్చేశారు. ఆ బాధ నుంచి బయటపడేందుకు టీమిండియాకు, టీమిండియా అభిమానులకు చాలా సమయమే పట్టింది. అయితే.. ఆ ఓటమికి బదులుతీర్చుకునేందుకు టీమిండియా మంచి ఛాన్స్‌ వచ్చింది.

ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్‌ కప్‌లో టీమిండియా గ్రూప్‌-ఏ నుంచి, ఆస్ట్రేలియా గ్రూప్‌-బీ నుంచి ఇప్పటికే సూపర్‌ 8కు అర్హత సాధించాయి. ఈ రెండు జట్ల మధ్య జూన్‌ 24న సెయింట్‌ లుసికాలోని డారెన్‌ సామి నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ ఓటమికి ప్రతీకారంగా ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను టీమిండియా ఓడించాలని భారత క్రికెట్‌ అభిమానులు భావిస్తున్నారు. బౌలింగ్‌లో సూపర్‌ స్ట్రాంగ్‌ ఉన్న టీమిండియాకు.. ఆసీస్‌ను ఓడించడానికి ఇదే సరైన సమయం అంటున్నారు. విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ ఫామ్‌లోకి వచ్చేస్తే.. ఇక టీమిండియా నుంచి ఆసీస్‌ను ఎవరూ కాపాడలేరంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments