Bengaluru Rave Party: నటి హేమ చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు! తాజాగా మరోసారి నోటీసులు!

నటి హేమ చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు! తాజాగా మరోసారి నోటీసులు!

Bengaluru Rave Party: ఇటీవల బెంగుళూర్ రేవ్ పార్టీలో టాలీవుడ్ నటి హేమతో పాటు మరో 86 మంది రక్త నమూనాల్లో డ్రగ్స్ షాంపిల్ ఉందని నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.

Bengaluru Rave Party: ఇటీవల బెంగుళూర్ రేవ్ పార్టీలో టాలీవుడ్ నటి హేమతో పాటు మరో 86 మంది రక్త నమూనాల్లో డ్రగ్స్ షాంపిల్ ఉందని నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇటీవల బెంగుళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జీఆర్ ఫామ్ హౌజ్ లో పుట్టిన రోజు పేరుతో రేవ్ పార్టీ జరిగింది. పోలీసులు పక్కా సమాచారంతో రేవ్ పార్టీపై రైడ్ చేశారు. ఈ క్రమంలో ఐదుగురిని అరెస్ట్ చేయగా 86 మంది రక్త నమూనాల్లో డ్రగ్స్ షాంపిల్ ఉన్నట్లు తేల్చారు. ఈ పార్టీకి రాజకీయ, సినీ రంగానికి చెందినవారు హాజరయ్యారు. ప్రస్తుతం బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఇదిలా ఉంటే రేవ్ పార్టీలో సినీ నటి హేమ ను కూడా అదుపులోకి తీసుకొని బ్లెడ్ షాంపిల్స్ తీసుకొని టెస్ట్ చేయడా రక్త నమూనాలో డ్రగ్స్ ఉన్నట్లు తేలిందని పోలీసులు తెలిపారు. కానీ తనకు రేవ్ పార్టీకి సంబంధం లేదని హేమ చెబుతూ వచ్చాయి. తాజాగా మరోసారి నటి హేమకు బెంగుళూరు పోలీసులు నోటీసులు పంపించారు.

బెంగుళూరు రేవ్ పార్టీలో 86 మందికి బ్లెడ్ టెస్ట్ చేయగా.. అందులో నటి హేమతో రక్త నమూనాలో డ్రగ్స్ ఉన్నట్లు పోలీసులు తేల్చారు. ఈ క్రమంలోనే ఆమెకు ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపించారు. కానీ తన ఆరోగ్యం బాగా లేదు.. తీవ్ర జ్వరం కారణంగా తాను విచారణకు హాజరు కాలేనని హేమ లేఖ పంపింది. కానీ పోలీసులు ఈ లేఖను తిరస్కరించినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి నోటీసులు పంపించారు. జూన్ 1న తప్పకుండా విచారణకు హాజరు కావాలని నోటీసులో పొందుపరిచారు. ఒకవేళ ఈసారి కూడా నటి హేమ విచారణకు హాజరు కాకపోతే కఠిన చర్యలు తప్పవని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మొత్తానికి బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమ చుట్లు ఉచ్చు బిగుస్తున్నట్లు కనిపిస్తుందని మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. జూన్ 1 న ఏం జరుగుతుందో అని అందరూ ఎదురు చూస్తున్నారు.

ఇటీవల హైదరాబాద్ లో రేవ్ పార్టీలపై పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది రేవ్ పార్టీలు బెంగుళూరు పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. బెంగుళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జీఆర్ ఫామ్ హౌజ్ లో జరిగిన రేవ్ పార్టీ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ పార్టీలో సినీ తారలు, రాజకీయ నేలు, మోడల్స్ పాల్గొన్నారు. ఈ రేవ్ పార్టీ నిర్వహణలో కీలక సూత్రదారి విజయవాడకు చెందిన లంకపల్లి వాసు గా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఇప్పడు నటి హేమకు రెండు సార్లు నోటీసులు పంపించడం హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసులో ముందు ముందు ఎన్ని ట్విస్టులు ఉండబోతున్నాయో చూడాలి.

Show comments