Ben Duckett On MS Dhoni Wife Sakshi: ఇంగ్లండ్ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్.. ధోని భార్య అని కూడా చూడకుండా..!

Ben Duckett: ఇంగ్లండ్ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్.. ధోని భార్య అని కూడా చూడకుండా..!

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని భార్య సాక్షిపై ఓ ఇంగ్లండ్ క్రికెటర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీంతో అతడ్ని సోషల్ మీడియాలో నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని భార్య సాక్షిపై ఓ ఇంగ్లండ్ క్రికెటర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీంతో అతడ్ని సోషల్ మీడియాలో నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.

భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ ఆసక్తికరంగా సాగుతోంది. ఉప్పల్ ఆతిథ్యం ఇచ్చిన మొదటి టెస్టులో ఇంగ్లండ్ నెగ్గగా.. వైజాగ్​లో జరిగిన రెండో మ్యాచులో విజయం భారత్​ను వరించింది. బజ్​బాల్​ క్రికెట్​తో అపోజిషన్ టీమ్ భయపెడుతున్నప్పటికీ రోహిత్ సేన మాత్రం తమదైన శైలిలో ఆడుతోంది. ప్రత్యర్థి జట్టును అవకాశం దొరికినప్పుడల్లా దెబ్బతీస్తూ బజ్​బాల్​ బెండు తీస్తోంది. రెండో టెస్టులో అటు బ్యాటింగ్​తో పాటు ఇటు బౌలింగ్​లోనూ డామినేషన్ ప్రదర్శించి విక్టరీ కొట్టింది. ఇదే తరహా గేమ్​ను మిగిలిన మూడు టెస్టుల్లోనూ కంటిన్యూ చేసి సిరీస్​ను పట్టేయాలని చూస్తోంది. ఇదిలా ఉంటే.. ఓ ఇంగ్లండ్ క్రికెటర్ భారత లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని భార్యపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీంతో అతడిపై నెట్టింట భారీగా ట్రోలింగ్ జరుగుతోంది.

ధోని భార్య సాక్షిపై ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ బెన్ డకెట్ షాకింగ్ ట్వీట్ చేశాడు. ఆమె ధోని గర్ల్​ఫ్రెండా? లేదా భార్యా? అని ట్విట్టర్​లో ఒక పోస్ట్ పెట్టాడు ఇంగ్లీష్ క్రికెటర్. అలాగే ఆ పోస్ట్​లో అభ్యంతరకరంగా ఇంకో పదాన్ని వాడాడు. దీంతో భారత ఫ్యాన్స్, నెటిజన్స్ సోషల్ మీడియాలో డకెట్​ను ఆడేసుకుంటున్నారు. ధోని భార్య ఎవరో నిజంగా తెలియదా? నీకు మతి లేదా? కావాలనే ఇలా అడుగుతున్నావా? అంటూ ట్రోల్ చేస్తున్నారు. ధోని వైఫ్​ మీద కామెంట్ చేసే స్థాయి అతడికి లేదని ఫైర్ అవుతున్నారు. అయితే డకెట్ చేసిన ట్వీట్ ఇప్పటిది కాదు. అతడు 2013 ఏప్రిల్ 7న ఈ పోస్ట్ పెట్టాడు. కానీ తాజాగా ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్ డకెట్​ మీద సీరియస్ అవుతున్నారు. ధోని భార్య అని చూడకుండా ఇలా ట్వీట్ చేయడం ఏంటని.. సాక్షి గురించి అలా ఎలా అంటాడంటూ మండిపడుతున్నారు.

ఇక, రెండేళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత ధోని-సాక్షిలు 2010లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ స్టార్ కపుల్​కు ఓ కూతురు ఉంది. ఆమె పేరు జీవా. 2015లో తను జన్మించింది. సోషల్ మీడియాలో యాక్టివ్​గా ఉండే సాక్షి అప్పుడప్పుడూ ధోనీతో పాటు జీవాతో కలసి దిగిన ఫొటోలను ఫ్యాన్స్​తో పంచుకుంటుంది. ఐపీఎల్​తో పాటు వ్యాపారాలు, యాడ్ షూటింగ్స్, ఇతరత్రా పనులతో బిజీగా ఉండే ధోని ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా జీవాతో గడిపేందుకు ఇష్టపడతాడు. కాగా, ధోని భార్యపై వివాదాస్పద వ్యాఖ్యలతో ట్రోలింగ్​కు గురవుతున్న బెన్ డకెట్ భారత్​తో రెండో టెస్టులో ఫెయిలయ్యాడు. ఆ మ్యాచ్​లో తొలి ఇన్నింగ్స్​లో 21 పరుగులు చేసిన అతడు.. రెండో ఇన్నింగ్స్​లో 28 పరుగులు చేసి పెవిలియన్​కు చేరుకున్నాడు. రెండుసార్లు స్పిన్నర్ల బౌలింగ్​లోనే ఔటయ్యాడు. మరి.. డకెట్ కాంట్రవర్సీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Rachin Ravindra: కేన్‌ మామకి రచిన్ షాక్.. పుసుక్కున అంత మాట అనేశాడేంటి?

Show comments