వీడియో: పాడె వదిలేసి పరుగులు పెట్టిన జనం.. ఏం జరిగిందంటే?

వీడియో: పాడె వదిలేసి పరుగులు పెట్టిన జనం.. ఏం జరిగిందంటే?

ఓ కుటుంబంలో వ్యక్తి చనిపోగా.. ఆయన అంతిమయాత్ర బంధువులు ప్రారంభించారు. అయితే ఇలా సాగుతున్నఆయన అంతిమయాత్రలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. దీంతో పాడెను వదిలేసి జనం పరుగులు తీశారు.

ఓ కుటుంబంలో వ్యక్తి చనిపోగా.. ఆయన అంతిమయాత్ర బంధువులు ప్రారంభించారు. అయితే ఇలా సాగుతున్నఆయన అంతిమయాత్రలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. దీంతో పాడెను వదిలేసి జనం పరుగులు తీశారు.

మనిషికి మరణం అనేది తప్పదు. అయితే కొందరు చనిపోయిన వారిని చూసి భయపడుతుంటారు. అందుకే అంతిమయాత్రలో పాల్గొనకుండా దూరంగా ఉంటారు. అయితే చాలామంది మాత్రం చనిపోయిన వారి కుటుంబాన్ని ఓదారుస్తూ.. అంత్యక్రియల్లో పాల్గొంటారు. అలానే ఓ వృద్ధుడు చనిపోతే.. స్థానికులు అందరూ అక్కడి చేరారు. కుటుంబ సభ్యులు కన్నీటి దారల మధ్య ఆ వ్యక్తి అంతిమయాత్ర ప్రారంభించారు. అయితే ఇలా సాగుతున్న అంతిమయాత్రలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. దీంతో జనాలు పాడేను వదిలేసి.. ఒక్కసారిగా పరులుగు తీశారు. ఇంతకి ఏం జరిగింది. ఎక్కడ జరిగింది అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ విచిత్ర ఘటన తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఎంచగూడలో జరిగింది. ఆ గ్రామానికి చెందిన రుద్రారపు వీరాస్వామి(70) అనే వృద్ధుడు తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇటీవల కొంతకాలం నుంచి అనారోగ్యంతో ఆయన బాధపడుతున్నాడు. వృద్దాప్యం కారణంగా బాధపడుతుంటారు. అలా అనారోగ్యంతో ఉన్న వీరాస్వామి జూన్ 11వ తేదీ మంగళవారం మరణించాడు.

ఇక కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇక వీరాస్వామిని కడసారి చూసుకునేందుకు బంధువులు, స్నేహితులు అందరూ ఎంచగూడానికి వచ్చారు. అదేవిధంగా కుటుంబ సభ్యులు ఆయన అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. తప్పెట్లు, పూల మధ్యలో ఆయన అంతిమయాత్ర సాగింది. మార్గం మధ్యలో క్రాకర్స్ కాలుస్తూ ముందుగు సాగింది. ఇదే సమయంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. పాడేని అక్కడే వదిలేసి..స్థానికులందరూ పరుగులు తీశారు. వీరాస్వామి అంతిమయాత్రలో టాపాసులు కాల్చారు.  అందులోనే ఓ  క్రాకర్ వెళ్లి సమీపంలోని చెట్ల పొదల్లో ఉన్న తేనెపుట్టను తగిలింది.

దీంతో అక్కడ ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా అక్కడున్నవారిపై దాడి చేశాయి. ఇక ఈ హఠాత్పరిణామంతో అందరూ ఒక్కసారిగా షాక్ గురయ్యారు. తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేయడంతో పాడె మోస్తున్న వారు సైతం శవాన్ని రోడ్డుపైనే వదిలేసి పరుగులు తీశారు. అందరూ తలో దిక్కుకు పరుగులు పెట్టారు. అయినప్పటికీ తేనెటీగలు కొందరిని వెంబడించి కుట్టాయి. ఇక తేనెటీగల దాడిలో గాయపడిన వారిని నర్సంపేట లోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చాలా గంటల తరువాత  తేనెటీగలు వెళ్లిపోవడంతో కొద్ది మంది బంధువులు తిరిగొచ్చి అంత్యక్రియలు పూర్తి చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో తేనేటిగల దాడిలో పలువురు మృతి చెందిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. అంతేకాక మరెందరో తీవ్రంగా గాయపడ్డారు. ఇలాంటి ఘటనలు తరచూ ఏదో  ఒక ప్రాంతంలో జరుగుతూనే ఉంటాయి.తాజాగా మహబూబాబాద్ లో చోటుచేసుకుంది.

Show comments