BCCI Is Set To Announce Gautam Gambhir As Coach: భారత హెడ్ కోచ్​గా గంభీర్ రాకకు ముహూర్తం ఫిక్స్.. అధికారిక ప్రకటన అప్పుడే!

భారత హెడ్ కోచ్​గా గంభీర్ రాకకు ముహూర్తం ఫిక్స్.. అధికారిక ప్రకటన అప్పుడే!

టీమిండియా కొత్త హెడ్ కోచ్ నియామకం మీద గత కొన్ని వారాలుగా అనేక రూమర్స్ వస్తున్నాయి. అయితే ఎట్టకేలకు కోచ్​ రాకకు ముమూర్తం ఫిక్స్ అయిందని తెలుస్తోంది.

టీమిండియా కొత్త హెడ్ కోచ్ నియామకం మీద గత కొన్ని వారాలుగా అనేక రూమర్స్ వస్తున్నాయి. అయితే ఎట్టకేలకు కోచ్​ రాకకు ముమూర్తం ఫిక్స్ అయిందని తెలుస్తోంది.

భారత క్రికెట్​కు సంబంధించి ఇటీవల బాగా చర్చనీయాంశంగా మారిన అంశాల్లో ఒకటి హెడ్ కోచ్ నియామకం. ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ముగియడంతో టీమ్​ను వీడనున్నాడు. ఇంకొన్నాళ్లు జట్టుతో ట్రావెల్ చేయడాల్సిందిగా భారత క్రికెట్ బోర్డు కోరినా ద్రవిడ్ తిరస్కరించాడు. దీంతో అతడి ప్లేస్​లో సమర్థవంతమైన కోచ్​ కోసం బీసీసీఐ వెతుకులాట మొదలుపెట్టింది. దీంట్లో భాగంగా హెడ్ కోచ్ పోస్ట్​కు దరఖాస్తు చేసుకోవాలంటూ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. దీనికి ఎవరెవరు అప్లై చేసుకున్నారో తెలియదు. కానీ ఆస్ట్రేలియా దిగ్గజాలు రికీ పాంటింగ్, జస్టిన్ లాంగర్​తో పాటు న్యూజిలాండ్ లెజెండ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పేర్లు మాత్రం గట్టిగా వినిపించాయి. వీళ్ల కంటే కూడా టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ పేరు బాగా వైరల్ అయింది.

ఐపీఎల్-2024లో కోల్​కతా నైట్ రైడర్స్​ మెంటార్​గా గంభీర్ సక్సెస్ అవడం తెలిసిందే. కేకేఆర్ కప్పు కొట్టడంతో అతడి పేరు మరోమారు మార్మోగింది. క్యాష్​ రిచ్ లీగ్ ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత గౌతీతో బీసీసీఐ సెక్రెటరీ జైషా చాలా సేపు సంభాషించడం, ఇద్దరూ నవ్వుతూ కనిపించడంతో టీమిండియా హెడ్ కోచ్​గా గంభీర్ నియామకం ఖరారైనట్లేనని వార్తలు వచ్చాయి. అయితే దానిపై ఎలాంటి స్పష్టత రాలేదు. గత కొన్ని వారాలుగా అందరూ టీ20 వరల్డ్ కప్​తో బిజీ అయిపోవడంతో కోచ్ సెలెక్షన్ గురించి అందరూ మర్చిపోయారు. ఈ తరుణంలో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం భారత కోచ్​గా గంభీర్​ను బోర్డు ఫైనలైజ్ చేసిందని తెలుస్తోంది. జూన్ నెల చివరి వారంలో గౌతీ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

కోచ్​గా గంభీర్ రాకకు ముమూర్తం ఫిక్స్ అయిందని.. ఈ నెల చివర్లో అతడి పేరును బీసీసీఐ అఫీషియల్​గా అనౌన్స్ చేయనుందని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. టీ20 వరల్డ్ కప్ ముగిసిన వెంటనే భారత జట్టు కోచింగ్ బాధ్యతల్ని అతడు చేపడతాడని టాక్ నడుస్తోంది. టీమ్​ను నడిపించడంలో అవసరమైన సపోర్ట్ స్టాఫ్​, బౌలింగ్ కోచ్​తో పాటు బ్యాటింగ్, ఫీల్డింగ్ కోచ్​లను కూడా సెలెక్ట్ చేసే బాధ్యతల్ని గంభీర్​కు అప్పగించారని తెలుస్తోంది. టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడానికి అతడు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాడని కొందరు అనలిస్ట్​లు అంటున్నారు. నేషనల్ టీమ్​కు సేవలు అందించాలనే ఉద్దేశంతో కేకేఆర్​ను గంభీర్ వీడాడని.. ఆ ఫ్రాంచైజీ ఓనర్ షారుఖ్ ఖాన్ ఇచ్చిన భారీ ఆఫర్​ను అతడు వద్దన్నాడని చెబుతున్నారు. అయితే గంభీర్ నియామకంపై బోర్డు నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఏదీ చెప్పలేం.

Show comments