టెస్ట్‌ క్రికెట్‌ కోసం BCCI గొప్ప నిర్ణయం! ఆటగాళ్లపై కాసుల వర్షం!

టెస్ట్‌ క్రికెట్‌ కోసం BCCI గొప్ప నిర్ణయం! ఆటగాళ్లపై కాసుల వర్షం!

BCCI, Test Cricket: ఇంగ్లండ్‌పై ఐదు టెస్టుల సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకున్న టీమిండియా ఆటగాళ్లను మరింత ఖుషీ చేస్తూ.. బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. భారీ స్థాయిలో బోనస్‌ స్కీమ్‌ను ప్రకటించింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

BCCI, Test Cricket: ఇంగ్లండ్‌పై ఐదు టెస్టుల సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకున్న టీమిండియా ఆటగాళ్లను మరింత ఖుషీ చేస్తూ.. బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. భారీ స్థాయిలో బోనస్‌ స్కీమ్‌ను ప్రకటించింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌ను టీమిండియా విజయంతో ముగించింది. ధర్మశాల వేదికగా జరిగిన చివరి టెస్టులో రోహిత్‌ సేన ఇన్నింగ్స్‌ 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కేవలం రెండున్నర రోజుల్లే ఈ మ్యాచ్‌ను ముగించి.. ఐదు టెస్టుల సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది. హైదరాబాద్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓటమి పాలైనప్పటికీ.. తర్వాత పుంజుకుని వరుసగా నాలుగు టెస్టుల్లో విజయ ఢంకా మోగించింది. అయితే.. సిరీస్‌ విజయం అనంతరం బీసీసీఐ సెక్రటరీ జైషా ఒక కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. టెస్టు క్రికెట్‌కు మరింత ఆధారణ పెంచేందుకు ఆటగాళ్లుకు ఇచ్చే మ్యాచ్‌ ఫీజులపై బోనస్‌ ప్రకటించారు. ఆ వివరాలను ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..

ప్రస్తుతం టెస్ట్‌ మ్యాచ్‌ ఆడిన ప్లేయర్‌కు ఒక మ్యాచ్‌ ఫీజు కింద రూ.15 లక్షలు చెల్లిస్తోంది బీసీసీఐ. ప్లేయింగ్‌ ఎలెవన్‌లో ఉంటే రూ.15 లక్షలు, బెంచ్‌కి పరిమితం అయితే రూ.7.5 లక్షలు. అయితే.. ఈ ఫీజ్‌ చెల్లిపులో ఇప్పుడు సరికొత్త స్కీమ్‌ను తీసుకొచ్చింది. దాని పేరే టెస్ట్‌ ‘క్రికెట్‌ క్రికెట్‌ ఇన్సెంటివ్‌ స్కీమ్‌’. టెస్టును ఆడాలనే కసిని ఆటగాళ్లలో పెంచేందుకు, టెస్టు క్రికెట్‌ ఆడుతున్న ఆటగాళ్లను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు జైషా. ఈ స్కీమ్‌లో భాగంగా.. ఒక సీజన్‌లో అంటే.. ఒక ఏడాదిలో టెస్టు మ్యాచ్‌లు ఆడిన సంఖ్యను బట్టి మ్యాచ్‌ ఫీజును నిర్ణయించనున్నారు.

ఒక సెషన్‌లో అంటే ఉదాహరణకు 2023-24 సెషల్‌లో టీమిండియా ఆడే టెస్టు మ్యాచ్‌ల్లో 75 శాతం, అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడే ప్లేయర్లకు ఒక టెస్ట్‌కు రూ.45 లక్షలు చెల్లిస్తారు. ఒక సెషన్‌లో 9 మ్యాచ్‌లుగా నిర్ణయించారు. అలాగే 50 శాతం మ్యాచ్‌లు ఆడే ప్లేయర్లకు రూ.30 లక్షలు ఫీజు కింద చెల్లిస్తారు. 50 శాతం కంటే తక్కువ మ్యాచ్‌లు ఆడే ప్లేయర్లు ఈ స్కీమ్‌కి ఎలిజిబుల్‌ కారు. వారిని సాధారణంగా చెల్లించే రూ.15 లక్షలు చెల్లిస్తారు. ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే.. ఒక సెషన్‌లో 9 టెస్టులు జరిగాయి అనుకుంటే.. అందులో 7 నుంచి 9 టెస్టుల ఆడిన వారికి రూ.45 లక్షలు(ప్లేయింగ్‌ ఎలెవన్‌లో ఉంటే) రూ.22.5 లక్షలు(బెంచ్‌పై ఉంటే). అలాగే 5 నుంచి 6 మ్యాచ్‌లు ఆడితే రూ.30 లక్షలు(ప్లేయింగ్‌ ఎలెవన్‌లో ఉంటే) రూ.15 లక్షలు(బెంచ్‌పై ఉంటే) చెల్లిస్తారు. బీసీసీఐ ప్రకటించిన ఈ నిర్ణయంతో టెస్టు క్రికెట్‌ ఎక్కువగా ఆడే ఆటగాళ్లపై కోట్ల వర్షం కురువనుంది.

ఒక విధంగా ఇది టెస్టు క్రికెట్‌ను ఎక్కువగా ఆడుతున్న వారికి చెల్లించే బోనస్‌లా భావించవచ్చు. ఎందుకంటే.. ఈ మధ్యకాలంలో కొంతమంది ఆటగాళ్లు టెస్టు క్రికెట్‌ను లైట్‌ తీసుకుంటున్నారు. ఐపీఎల్‌ లాంటి రిచ్‌ క్యాష్‌ లీగ్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దాంతో దేశవాళి క్రికెట్‌లో జరిగే ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీల్లో కూడా వారు పాల్గొనడం లేదు. ఈ కారణంతోనే ఇటీవల ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌లను బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ నుంచి తప్పించింది. ఇలాంటి ధోరణి పెరగకుండా.. టెస్ట్‌ క్రికెట్‌పై కూడా క్రికెటర్లు ఆసక్తి చూపించాలనే ఉద్దేశంతో బీసీసీఐ ఈ మ్యాచ్‌ ఫీజులను పెంచింది. మరి ఆటగాళ్లకు చెల్లించే ఈ ఫీజులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments