Kannappa Movie: కన్నప్పలో కీ రోల్ కోసం బాలకృష్ణ..!

కన్నప్పలో కీ రోల్ కోసం బాలకృష్ణ..!

మంచు విష్ణు కెరీర్ లో భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కుతున్న చిత్రం కన్నప్ప. ఇందులో భారీ తారాగణం నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరో స్టార్ కోసం చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

మంచు విష్ణు కెరీర్ లో భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కుతున్న చిత్రం కన్నప్ప. ఇందులో భారీ తారాగణం నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరో స్టార్ కోసం చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

మంచు విష్ణు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న ప్రాజెక్ట్.. కన్నప్ప. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీకి అన్ని ఇండస్ట్రీలకు చెందిన స్టార్, టెక్నీషియన్లు వర్క్ చేస్తున్నారు. మంచు విష్ణు పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి విదితమే. అత్యంత భారీ వ్యయంతో ఈ సినిమా తెరకెక్కబోతుంది. అవా ఎంటర్ టైన్ మెంట్, 24 ఎంటర్ టైన్ మెంట్ పతాకాలపై విష్ణు తండ్రి, నటుడు మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు. సుమారు 150 కోట్లతో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

కన్నప్ప మూవీలో భారీ కాస్టింగ్ కూడా ఉంది. తొలుత ఈ సినిమాలో హీరోయిన్‌గా కృతి సనన్ సోదరి నుపూర్ సనన్ ఫిక్స్ అవ్వగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె తప్పుకుంది. ఆమె స్థానంలోకి మోడల్.. ప్రీతి ముకుందన్ వచ్చి చేరింది. ప్రభాస్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మనందం, మధుబాల వంటి స్టార్ నటిస్తున్నారు. ఇందులో ప్రభాస్ శివుడి పాత్రలో కనిపించబోతున్నట్లు టాక్ నడుస్తోంది. అలాగే పార్వతి స్థానంలో తొలుత నయన తార పేరు వినిపించగా.. ఇప్పుడు ఆమె ప్లేసులో కంగనా రనౌత్ వచ్చి చేరింది. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నంత సేపు ఏదో ఒక రూమర్ చక్కర్లు కొడుతూనే ఉంది. కాగా, ఇప్పుడు ఓ ఇంట్రస్టింగ్ అప్డేట్ వచ్చింది.

ఇందులో మరో స్టార్ హీరో నటించబోతున్నాడని తెలుస్తోంది. ఓ స్పెషల్ రోల్ లో ఆ నటుడ్ని యాక్ట్ చేయించాలన్న ఆలోచనలో ఉందట చిత్ర యూనిట్. ఇంతకు అతడు ఎవరంటే.. నందమూరి నట సింహం బాలకృష్ణ. ఓ కీలకమైన పాత్రలో బాలయ్య బాబుని తీసుకునేందుకు అతడితో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇది కన్ఫమ్ అయితే.. ఈ సినిమాకు ఉండే ఎక్స్ పెక్టేషన్స్ మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఈ సినిమా ఎక్కువ శాతం న్యూజిలాండ్‌లో జరుగుతుంది. ఇటీవలే కొంత షెడ్యూల్ పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగి వచ్చింది చిత్ర యూనిట్. ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ స్టార్ అయినట్లు సమాచారం. ఈ మూవీతోనే ఎంట్రీ ఇవ్వబోతున్నాడు మంచు వారసుడు..అవ్రామ్ కూడా.

కాగా, గతంలో మంచు మనోజ్ నటించిన ఊ కొడతారా , ఉలిక్కి పడతారా అనే మూవీలో గెస్ట్ రోల్ ప్లే చేశారు బాలకృష్ణ. ఆ పిక్చర్ ఆశించినంత విజయం సాధించలేదు.  మరీ ఇప్పుడు కన్నప్ప చిత్రం కోసం ఆయన్ను సంప్రదిస్తున్నారన్న వార్త హల్ చల్ చేస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా, ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్లుగా స్టీఫెన్ దేవస్సీ, మణి శర్మ వర్క్ చేస్తున్నారు.  ఈ చిత్రాన్ని.. ఈ ఏడాది చివరిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్.

Show comments