Bajaj CNG Bike Release Date: ప్రపంచంలోనే మొట్టమొదటి CNG బైక్.. విడుదల ఎప్పుడంటే?

ప్రపంచంలోనే మొట్టమొదటి CNG బైక్.. విడుదల ఎప్పుడంటే?

Bajaj CNG Bike Release Date: ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైకుని తయారు చేస్తుంది బజాజ్ ఆటో కంపెనీ. ఈ బైక్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు సీఎన్జీ ప్రియులు. ఎందుకంటే పెట్రోల్ తో పోలిస్తే సీఎన్జీ ధర తక్కువ ఉంటుంది కాబట్టి పెట్రోల్ భారం నుంచి బయటపడచ్చునని అనుకుంటున్నారు. ఎట్టకేలకు ఈ సీఎన్జీ బైక్ విడుదలకు సిద్ధమవుతోంది.

Bajaj CNG Bike Release Date: ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైకుని తయారు చేస్తుంది బజాజ్ ఆటో కంపెనీ. ఈ బైక్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు సీఎన్జీ ప్రియులు. ఎందుకంటే పెట్రోల్ తో పోలిస్తే సీఎన్జీ ధర తక్కువ ఉంటుంది కాబట్టి పెట్రోల్ భారం నుంచి బయటపడచ్చునని అనుకుంటున్నారు. ఎట్టకేలకు ఈ సీఎన్జీ బైక్ విడుదలకు సిద్ధమవుతోంది.

పెట్రోల్ తో నడిచే బైకులు, స్కూటీలు వచ్చాయి కానీ సీఎన్జీతో నడిచే టూవీలర్స్ ఇప్పటి వరకూ రాలేదు. ప్రపంచంలోనే తొలిసారిగా సీఎన్జీ బైకుల తయారీకి పూనుకుంది బజాజ్ ఆటో కంపెనీ. సీఎన్జీతో నడిచే కార్లను మనం చూసాం. ఇప్పటికే పలు కార్ల తయారీ కంపెనీలు ఈ విభాగంలో అడుగుపెట్టేశాయి. అయితే సీఎన్జీతో నడిచే బైక్ ని చూడాలని బైక్ ప్రియులు ఎప్పటి నుంచే ఎదురుచూస్తున్నారు. బజాజ్ కంపెనీ సీఎన్జీ బైక్ ని తీసుకొస్తున్నాం అని చెప్పగానే చాలా మంది ఎగిరిగంతులేశారు. ప్రస్తుతం మండిపోతున్న పెట్రోల్ ధరలకు ప్రత్యామ్నాయంగా ఈ సీఎన్జీ బైక్ వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నారు. పెట్రోల్ కంటే సీఎన్జీ ఖర్చు తక్కువగా ఉంటుంది కాబట్టి జనాలు కూడా ఈ బైకులపై ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.

జూన్ 18న సీఎన్జీ బైక్ ని ఆవిష్కరించనున్నట్లు గతంలో బజాజ్ ఆటో కంపెనీ వెల్లడించింది. అయితే ఇప్పుడు బజాజ్ ఆటో కంపెనీ ఆ విడుదల తేదీని జూలై 17కి మార్చింది. దీంతో సీఎన్జీ బైక్ కోసం ఎదురుచూసే వారి ఆశలు అడియాశలు అయ్యాయి. జూలై 17న ఆవిష్కరిస్తున్నట్లు కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. సీఎన్జీ, ఫ్లెక్స్ ఇంధనంతో నడిచే టూవీలర్ వాహనాలపై వస్తువు, సేవల పన్నుని తగ్గించాలని తాజాగా ప్రభుత్వాన్ని కోరింది. ఇది జరిగిన తర్వాత రోజే బజాజ్ ఆటో ఈ ప్రకటన చేయడం గమనార్హం. జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాలని భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం.. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖను కోరింది. ప్రత్యేకంగా ద్విచక్ర వాహనాలపై జీఎస్టీ తగ్గించాలని కోరింది.

మరోవైపు ఉత్పత్తి వ్యయం కారణంగా సీఎన్జీతో నడిచే బైకులు.. పెట్రోల్ బైకులతో పోలిస్తే ధర ఎక్కువగా ఉంటుందని కంపెనీ ఈడీ రాకేష్ శర్మ గతంలో వెల్లడించారు. ఆ సమయంలో సీఎన్జీ వాహనాలపై ఉన్న జీఎస్టీని 12 శాతానికి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కాగా బజాజ్ నుంచి వస్తున్న తొలి సీఎన్జీ బైక్.. బ్రూజర్ 125 పేరుతో రానున్నట్లు సమాచారం. ఈ సీఎన్జీ బైకుని తొలుత మహారాష్ట్రలో లాంఛ్ చేయనున్నారు. ఆ తర్వాత మిగతా రాష్ట్రాల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. అయితే ఈ సీఎన్జీ బైకుల కోసం ఎదురుచూసేవాళ్ళు.. ఇంకో నెల రోజులు ఎదురుచూడక తప్పదు. 

Show comments