Baby Girl Sale: అమ్మకానికి ఆడశిశువు.. బయటపడ్డ సంచలన నిజాలు!

అమ్మకానికి ఆడశిశువు.. బయటపడ్డ సంచలన నిజాలు!

Baby Girl Sale: హిందు సంప్రదాయాల్లో ఆడవారిని దేవతల్లా పూజిస్తుంటారు. నేటి ఆధునిక కాలంలో అన్ని రంగాల్లో మహిళలు ముందంజలో ఉన్నారు. కానీ కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ ఆడపిల్లు అంటే భారంగా భావించేవారు ఉన్నారు.

Baby Girl Sale: హిందు సంప్రదాయాల్లో ఆడవారిని దేవతల్లా పూజిస్తుంటారు. నేటి ఆధునిక కాలంలో అన్ని రంగాల్లో మహిళలు ముందంజలో ఉన్నారు. కానీ కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ ఆడపిల్లు అంటే భారంగా భావించేవారు ఉన్నారు.

దేశంలో ఇప్పుడు అన్ని రంగాల్లో మహిళలు తమ సత్తా చాటుతున్నారు. విద్య, వైద్య, సాంకేతిక, రాజకీయ రంగాల్లో మగవారితో సమానంగా ముందుకు సాగుతున్నారు. అయినా కూడా ఇప్పటికే దేశంలో కొంతమందికి ఆడవాళ్లు అంటే చులకనభావమే. కొన్ని ప్రాంతాల్లో ఆడపిల్ల పుట్టిందంటే ఇబ్బందిగా భావిస్తుంటారు. మగ పిల్లలు అయితే తమ వంశాన్ని నిలబెడతారు అన్న అభిప్రాయంలో ఆడపిల్లల విషయంలో వివక్షత చూపిస్తుంటారు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఆడపిల్లలను పుట్టగానే చంపేస్తున్నారు.. అంగట్లో సరుకుల్లా అమ్మేస్తున్నారు. మూడు నెలకూడా నిండని ఆడపిల్లను అమ్మకానికి ప్రయత్నించిన ఓ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ నిర్వాహకురాలి గుట్టు రట్టు చేశారు పోలీసులు. వివరాల్లోకి వెళితే..

ఆడ పిల్లల పట్ల ఇప్పటికీ ఎన్నో అమానుష సంఘటనలు జరుగుతున్నాయి. ముక్కుపచ్చలారని మూడు నెలల పసికందు అమ్మకానికి పెట్టి సొమ్ము చేసుకోవాలని ప్రయత్నించిన అమానవీయ ఘటన మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..పిర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో రామకృష్ణా నగర్ కాలనీలో ఐతే శోభరాణి ఆర్ఎంపీగా ఓ క్లీనిక్ నడిపిస్తుంది. ఇటీవల శోభారాణికి బోడుప్పల్ కి చెందిన శైలజ తో పరిచయం ఏర్పడింది. వీరిద్దరు పిల్లల క్రయ విక్రయాలు చేస్తున్నట్లు ఓ స్వచ్ఛంద సంస్థ మహిళలకు తెలిసింది. ఉప్పల్ కి చెందిన స్వప్ప, షేక్ సలీం పాషాతో కలిసి విజయవాడ తదితర ప్రాంతాల్లో నివసించే పేద కుటుంబాలకు చెందిన ఆడపిల్లల ఆచూకీ తెలుసుకొని తల్లిదండ్రులకు డబ్బు ఆశ చూపించి కొనుక్కోని వస్తారు. ఈ వ్యవహారం పై ఆ సంస్థ స్ట్రీమింగ్ ఆపరేషన్ నిర్వహించింది.

తమకు నెలలు నిండిన ఆడపిల్ల కావాలని నిర్వాహకులను కోరారు. మొదట తమకు అలాంటి వ్యవహారాలు తెలియవని బుకాయించినా. ఇందు కోసం 3 చిన్నారిని రూ.4.5 లక్షలకు వరకు బేరం కుదుర్చుకున్నారు ఇరు సభ్యులు. ముందుగా 10 వేలు అడ్వాన్స్ ఇచ్చారు. రెండు రోజుల తర్వాత మంగళవారం పాప సిద్దంగా ఉండి మొత్తం అమౌంట్ తీసుకురావాలని ఫోన్ వచ్చింది. పాప వయసు మూడు నెలలు, మంచి రంగు ఉందని చెప్పారు. వారి తల్లిదండ్రులకు ఆర్థిక కష్టాల వల్ల తప్పని సరి పరిస్థితుల్లో అమ్ముతున్నారని నమ్మబలికారు. ఈ క్రమంలోనే ఫౌండేషన్ వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇరువురు రంగంలోకి దిగారు. శోభారాణి, శైలజ ను అదుపులోకి తీసుకొని స్టేషన్ కి తరలించారు.వీరికి సంహరించిన స్వప్న, సలీం లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.ఆ చిన్నారిని శిశు విహార్ కి పంపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Show comments