Baak Movie OTT: బ్లాక్ బస్టర్ హర్రర్ సస్పెన్స్ మూవీ.. OTT స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ !

Baak Movie OTT: బ్లాక్ బస్టర్ హర్రర్ సస్పెన్స్ మూవీ.. OTT స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ !

థియేటర్ లో రిలీజ్ అయినా కొన్ని సినిమాలు ఓటీటీ లోకి రాడానికి చాలా సమయం తీసుకుంటాయి. అదిగో ఇదిగో అని ఊరించాడమే కానీ స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడు అనే విషయం మాత్రం చాలా ఆలస్యంగా బయటకు వస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఎప్పటినుంచో ఊరిస్తున్న ఓ మూవీ గురించి ఓటీటీ అప్ డేట్ వచ్చేసింది.

థియేటర్ లో రిలీజ్ అయినా కొన్ని సినిమాలు ఓటీటీ లోకి రాడానికి చాలా సమయం తీసుకుంటాయి. అదిగో ఇదిగో అని ఊరించాడమే కానీ స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడు అనే విషయం మాత్రం చాలా ఆలస్యంగా బయటకు వస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఎప్పటినుంచో ఊరిస్తున్న ఓ మూవీ గురించి ఓటీటీ అప్ డేట్ వచ్చేసింది.

మరికొద్ది రోజుల్లో ఓటీటీ లోకి ఓ బ్లాక్ బస్టర్ చిత్రం రాబోతుంది. తమన్నా, రాశి ఖన్నా ప్రధాన పాత్రలలో నటించిన సినిమా “అరణ్మనై 4”. తెలుగులో ఈ సినిమా “బాక్” అనే పేరుతో వచ్చింది. ఈ సినిమా మే 3 న థియేటర్ లో రిలీజ్ అయింది. గ్లామరస్ గర్ల్స్ చేసిన ఈ చిత్రం అందరికి ఎన్నో అంచనాలను పెంచేసింది. ఈ సినిమాలో గ్లామర్ తో పాటు భయపెట్టే ఎన్నో సస్పెన్స్ సీన్స్ కూడా ఉన్నాయి. ఎంతైనా హర్రర్ సినిమాలకు ఉండే క్రేజ్ ఏ వేరు.. అందులోను గ్లామరస్ గర్ల్స్ తో వచ్చిన హర్రర్ కంటెంట్ అంటే ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. దీనితో బాక్ సినిమాను థియేటర్ లో మిస్ అయినా ప్రేక్షకులు ఈ సినిమాను ఎప్పుడెప్పుడు ఓటీటీ లో చూద్దామా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ కు సంబంధించిన అప్ డేట్ వచ్చేసింది.

హర్రర్ కామెడీ చిత్రాల ఫ్రాంచైజీ లో అరణ్మనై సిరీస్ ఎంతో అద్భుతంగా అందరిని ఆకట్టుకుంది. ఈ ఫ్రాంచీజిలో భాగంగా వచ్చినదే.. ఈ అరణ్మణై 4, తెలుగులో బాక్. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ డిస్నీ+ హాట్‍స్టార్ సొంతం చేసుకుంది. తమిళంలో ఈ సినిమా బాగానే హిట్ టాక్ సంపాదించుకున్నా కానీ .. ఎందుకో తెలుగులో మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. దింతో ఇక్కడ ఈ సినిమా ప్లాప్ అయింది. అయితే కొన్ని సినిమాలు థియేటర్ లో ప్లాప్ అయినా కానీ ఓటీటీ లో మాత్రం బాగా సక్సెస్ అవుతాయి. ఈ సినిమా ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఇక ఈ సినిమాను జూన్ 21 నుంచి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఓటీటీ లో స్ట్రీమింగ్ చేయనున్నారు. మరి ఈ సినిమా ఓటీటీ లో ఎటువంటి టాక్ సంపాదించుకుంటుందో వేచి చూడాలి.

ఇక ఈ బాక్ సినిమా కథ విషయానికొస్తే.. శివశంకర్ అనే వ్యక్తి ఓ లాయర్. అతని చెల్లి శివానీ ఓ రోజు ఆత్మహత్యకు పాల్పడుతుంది. ఆమె భర్త కూడా చనిపోతాడు. అయితే అతని చెల్లి ఆత్మహత్య చేసుకోలేదని శివశంకర్ బలంగా నమ్ముతాడు. దాని వెనుక జరిగిన కథను తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. అసలు శివానీ విషయంలో ఏం జరిగింది? ఆమెది హత్యా ! ఆత్మహత్యా ? ఈ మరణాల వెనుక దాగి ఉన్న మిస్టరీ ఏంటి ? అనేది ఈ సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే. కాబట్టి థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయినా ప్రేక్షకులు ఎంచక్కా ఓటీటీ లో చూసేయండి.

Show comments