Avika Gor: అలాంటి సీన్స్ చేయడం చాలా బోరింగ్ గా ఉంటుంది: అవికా గోర్

Avika Gor: అలాంటి సీన్స్ చేయడం చాలా బోరింగ్ గా ఉంటుంది: అవికా గోర్

బుల్లి తెర చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ఫేమ్ అవికా ఘోర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వెండి తెరపైన కూడా ఈ అమ్మడు పలు చిత్రాలలో నటించింది. ఈ క్రమంలో తాజాగా అవికా ఘోర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బుల్లి తెర చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ఫేమ్ అవికా ఘోర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వెండి తెరపైన కూడా ఈ అమ్మడు పలు చిత్రాలలో నటించింది. ఈ క్రమంలో తాజాగా అవికా ఘోర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బుల్లి తెరపై ప్రసారం అయినా చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో ఈ సీరియల్ నటి అవికా గోర్ అందరికి సుపరిచితురాలే. సీరియల్ లో నటించిన తర్వాత.. ఈ అమ్మడు వెండితెరపై కూడా ఎంట్రీ ఇచ్చింది. వెండి తెరపై కొన్ని సినిమాలలో నటించిన తనదైన మార్క్ ను సెట్ చేసుకుంది ఈ బ్యూటీ. మొదట్లో ఎంతో పద్దతిగా ఉన్న ఆమె కొన్ని సినిమాలలో మాత్రం రెచ్చిపోయి నటించింది. ఈ క్రమంలో సినిమాలలోని కిస్సింగ్ సీన్లు.. సె*క్స్ సీన్ల గురించి అవికా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. దీనితో అవి కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

ఇటీవల అవికా ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో సినిమాలలోని ఇంటిమేట్ సీన్స్ తో పాటు.. తన ప్రియుడు మిలింద్ చాంద్వానీతో ఉన్న రిలేషన్ గురించి కూడా ముచ్చటించింది. అయితే గత ఏడాది 1920 అనే ఓ హర్రర్ సినిమాలో ఆమె చాలానే హాట్ సీన్స్ చేసింది. ఆ సినిమా గురించి ప్రశ్నించగా.. ఆమె కొన్ని ఇంట్రెస్టింగ్ సమాధానాలు ఇచ్చింది.. ” సె*క్స్ సీన్స్ చేయడం సరదాగా ఉంటుందని భావిస్తారు కానీ.. అవి చాలా బోరింగ్ గా ఉంటాయి. అయితే ఇలాంటి సీన్స్ తనతో పాటు.. మిగతా వారు కూడా ఫ్రీ గా చేయడానికి కారణం.. కోఆర్డినేటర్ కృష్ణా భట్. కృష్ణా భట్ చాలా ప్రొఫెషనల్.. ఆమె ఇమ్రాన్ హష్మి సినిమాలకూ పని చేసిన అనుభవంతోనే .. సెట్స్ లో చాలా మంది యాక్టర్స్ ఫ్రీ గా ఇలాంటి సీన్స్ చేస్తారు.” అంటూ చెప్పుకొచ్చింది అవికా.

ఇక డైరెక్టర్ విక్రమ్ భట్ గురించి మాట్లాడుతూ.. తమకంటే ఎక్కువగా ఆయనే సిగ్గు పడతారని మాట్లాడుతూ.. “విక్రమ్ సర్ ఓ ప్రొఫెషనల్. సెట్స్ లో ఎవరైనా ఎక్కువగా సిగ్గు పడతారంటే అది మా కంటే ఆయనే ఎక్కువ. చాలాసార్లు ఆయన ఇలాంటి సీన్లతో కాస్త ఇబ్బందిగా ఫీలవుతారు. అలాంటి టీమ్ తో కలిసి పని చేసినప్పుడు ఇలాంటి సీన్లు చేయడం కూడా సులువు అవుతుంది. ఏది అవసరమో అది చేస్తున్నామనే ఫీలింగ్ తప్ప మరొకటి ఉండదు. ఇక లవ్ మేకింగ్ సీన్లలాంటివి అన్నీ ఉంటాయి. కానీ చాలా వరకు నా శరీరం ఎక్కడా బయటకు కనిపించదు. డైరెక్టర్లు అలా చూపిస్తారు. దీనికి సంబంధించిన చర్చ ఎంతో ముందుగానే జరిగిపోతుంది” అంటూ అవికా గోర్ చెప్పుకొచ్చింది. మరి ఇంటిమేట్ సీన్స్ పై అవికా స్పందించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments