iDreamPost

శోభనానికి ముహూర్తం ఎందుకు పెడతారో తెలుసా? ఇది ఎలా మొదలైందంటే?

గృహప్రవేశాలు, పెళ్లిళ్లు వంటి వాటికి ముహూర్తాలు పెడుతుంటారు. శోభనానికి కూడా ముహూర్తం పెడతారు. ఏ ముహూర్తం పెట్టకపోతే కొంపలు మునిగిపోతాయా అనేవారు కూడా ఉంటారు. అయితే ముహూర్తం పెట్టకపోతే చాలా అనర్ధాలే జరుగుతాయని చెబుతున్నారు.

గృహప్రవేశాలు, పెళ్లిళ్లు వంటి వాటికి ముహూర్తాలు పెడుతుంటారు. శోభనానికి కూడా ముహూర్తం పెడతారు. ఏ ముహూర్తం పెట్టకపోతే కొంపలు మునిగిపోతాయా అనేవారు కూడా ఉంటారు. అయితే ముహూర్తం పెట్టకపోతే చాలా అనర్ధాలే జరుగుతాయని చెబుతున్నారు.

శోభనానికి ముహూర్తం ఎందుకు పెడతారో తెలుసా? ఇది ఎలా మొదలైందంటే?

పెళ్లిళ్లు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలకు ముహూర్తం అనేది పెడుతుంటారు. పిల్లలకు పేరు పెట్టినా, అక్షరాభ్యాసం చేయించినా ఇలా ఏ మంచి కార్యం చేయించినా ముహూర్తం చూసుకుంటారు. ఒకప్పుడు ఏ పని చేయాలన్నా ముహూర్తం చూసుకునేవారు. ఇప్పుడంటే కాలం మారింది కాబట్టి ముఖ్యమైన వాటికి మాత్రమే ముహూర్తం పెట్టించుకుంటున్నారు. ముహూర్తం, జాతకాలు వంటివి నమ్మేవారు ఇప్పటికీ ఉన్నారు. అయితే అసలు ఈ ముహూర్తాలు పెట్టడం అన్న కాన్సెప్ట్ ఎలా వచ్చింది? ఎప్పుడు వచ్చింది? పెళ్ళికే కాకుండా నూతన వధూవరులిద్దరూ కలవడానికి కూడా ముహూర్తం పెడుతుంటారు. ఓ శుభ ముహూర్తాన దంపతులిద్దరూ ఒకటైతే మంచిదని చెబుతారు. నిజంగా ఆ శుభ ముహూర్తంలో భార్యాభర్తలు ఒకటవుతారా అంటే అందరికీ ఆ అదృష్టం ఉండదు. అది వేరే విషయం అనుకోండి. అయితే ఈ ముహూర్తం అనే కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చింది? ఎందుకు దీన్ని తీసుకొచ్చారు? దేనికి ముహూర్తం లేకున్నా శోభనానికి ఖచ్చితంగా ముహూర్తం ఎందుకు ఉండాలి?   

జాతకాలు, ముహూర్తాలు, వాస్తు అనేవి సైన్స్. వీటిని అంత ఎఫెక్టివ్ గా చెప్పేవాళ్లు లేక కమర్షియలైజ్ అయిపోయి విరక్తి కలిగింది. ఒక వ్యక్తి ఒక మూలన కూర్చుని పంచాంగం రాస్తూ.. 5 సంవత్సరాల తర్వాత పలానా రోజు పలానా సమయానికి చంద్రగ్రహణం వస్తుందని చెబుతాడు. చూస్తే నిజంగానే కరెక్ట్ అవుతుంది. దాని వెనుక సైన్స్ ఉంది కాబట్టే అతను చెప్పగలిగాడు. కానీ కొంతమంది మిస్ యూజ్ చేయడం వల్ల సమాజం దృష్టిలో జాతకాలు అంటే ఒక దురభిప్రాయం ఏర్పడిపోయింది. జాతకాలు, ముహూర్తాలు వెనుక సైన్స్ ఉంది. సృష్టి అనేది ఒక యజ్ఞం. స్త్రీ అనేది ఒక క్షేత్రం. పురుషుడు అనేది ఒక బీజం. క్షేత్రంలో పడే ఆ బీజం సరైన వాతావరణంలో పడితే కనుక పుట్టబోయే బిడ్డ చెడ్డవాడు కాకుండా మంచివాడు పుడతాడు.

హిరణ్య కశ్యపుడి కథలో కశ్యప ప్రజాపతి తపస్సు చేసుకుంటే ఆయన భార్య సాయంత్ర సమయంలో వచ్చి కలుద్దాం అని అంటుంది. అయితే ఇది నిషిద్ధ సమయం అని ఆమెకు చెప్తాడు. కానీ ఆవిడ మాట వినదు. ఇబ్బంది పెట్టేసరికి కశ్యప ప్రజాపతి సరే అని ఆమెతో కలుస్తాడు. ఫలితంగా హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు పుడతారు. వీరిద్దరూ లోక నాశకులు అవుతారు. అందుకే సరైన సమయంలో పనులు చేయాలని.. సరైన సమయం చూసి ఏ పని ఎప్పుడు చేయాలి అనేది నిర్ధారించడానికి ముహూర్తాలు పెడతారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నండూరి శ్రీనివాస్ వెల్లడించారు. ఇక చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేయడానికి కూడా కారణం ఉంది. ఒకప్పుడు వెయ్యి విడాకుల కేసులు వస్తే అందులో 998 కేసులు సాల్వ్ అయిపోతే.. ఇద్దరు విడాకులు తీసుకునేవారు. ఇప్పుడు లక్ష విడాకుల కేసులు వస్తుంటే.. సాల్వ్ అవ్వకపోవడం వల్ల చాలా మంది విడాకులు తీసుకుంటున్నట్టు స్టాటిస్టిక్స్ చెబుతున్నాయని అన్నారు.

బాల్య వివాహాల గురించి కూడా ఆయన చెప్పుకొచ్చారు. చిన్న వయసులో పెళ్లిళ్లు చేయడం వల్ల ఆ వయసులో కామం అంటే ఏంటో తెలియదు కాబట్టి భార్యాభర్తలు ఇద్దరూ స్నేహితులుగా ఉంటారని.. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఆ వయసు బాగా ఉపయోగపడుతుందని అన్నారు. ఇప్పటి జనరేషన్ వాళ్ళు ఇబ్బందులు పడడానికి కారణం ఉమ్మడి కుటుంబాలు లేకపోవడమే అని అన్నారు. ఉమ్మడి కుటుంబాలు ఉంటే చిన్న చిన్న సమస్యలు ఉంటే సర్దిచెప్తారని.. ఇప్పుడు అలా చెప్పేవారే లేరని అన్నారు. ఊర్లో అమ్మానాన్నలు, ఊరొదిలి వెళ్లిన కొడుకు, కోడలు ఇలానే ఉంది పరిస్థితి. ఇక పిల్లలకు నాన్నమ్మ చెప్పే నీతి కథలు కరువయ్యాయి. ఫోన్ లు దగ్గరయ్యాయి. చెడిపోవడానికి ఇంతకంటే కారణం ఇంకేం కావాలి. మరి ముహూర్తం కాన్సెప్ట్ ఎలా వచ్చిందో.. ఎందుకు వచ్చిందో తెలిసింది కదా.. శోభనానికి ముహూర్తం ఎందుకు పెడతారో తెలిసింది కదా. ఈ కథనం మీకు నచ్చితే షేర్ చేయండి. అలానే ముహూర్తాలు, జాతకాలు, వాస్తు వంటి వాటిపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి