iDreamPost

CSK అభిమాని తల పగలగొట్టిన రోహిత్ ఫ్యాన్స్.. అసలు ఏం జరిగిందంటే..!

  • Published Mar 29, 2024 | 11:10 AMUpdated Mar 29, 2024 | 11:10 AM

ఫ్యాన్స్ మధ్య గొడవలు కామనే. కానీ అభిమానం హద్దులు దాటి గొడవలకు దారితీయడం ఆందోళనకరమనే చెప్పాలి. ఓ సీఎస్​కే అభిమానిపై రోహిత్ శర్మ అభిమానులు దాడి చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు ఏం జరిగింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఫిల్మ్ స్టార్స్, క్రికెటర్స్, పొలిటీషియన్స్​కు భారీ సంఖ్యలో అభిమాన గణం ఉంటారు. ముఖ్యంగా క్రికెట్​ను ఓ మతంగా కొలిచే మన దేశంలో ఆటగాళ్లకు ఓ రేంజ్​లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అందుకే క్రికెటర్లకు సంబంధించిన చిన్న విషయం ఏదైనా బయటకు వచ్చినా వెంటనే వైరల్ అయిపోతుంది. ప్లేయర్ల ప్రొఫెషనల్ లైఫ్​తో పాటు పర్సనల్ లైఫ్​కు సంబంధించిన విశేషాలు ఏమైనా ఉన్నా తెలుసుకునేందుకు ఫ్యాన్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. తాము ఆరాధించే ఆటగాళ్లను ఎవరైనా ఏమైనా అంటే మాత్రం అస్సలు తట్టుకోలేరు. ఈ క్రమంలో దాడులు చేసేందుకు కొందరు వెనుకాడరు. ఫ్యాన్స్ మధ్య గొడవలు కామనే. కానీ అభిమానం హద్దులు దాటి గొడవలకు వెళ్లడం ఆందోళనకరమనే చెప్పాలి. ఓ సీఎస్​కే అభిమానిపై రోహిత్ శర్మ ఫ్యాన్స్ దాడి చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు ఏం జరిగింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

రోహిత్ ఫ్యాన్స్ దాడిలో ఓ చెన్నై సూపర్ కింగ్స్ అభిమాని తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని కొల్హాపూర్​లో చోటుచేసుకుంది. బుధవారం రాత్రి సన్​రైజర్స్​ హైదరాబాద్​తో మ్యాచ్​లో హిట్​మ్యాన్ ఔట్ కావడంతో సీఎస్​కే అభిమాని బండోపంత్ టిబిలే (63).. ‘రోహిత్ ఔట్ అయ్యాడు. ఇప్పుడు ముంబై ఇండియన్స్ ఎలా నెగ్గుతుంది’ అంటూ హేళన చేశాడు. అంతే హిట్​మ్యాన్ అభిమానులు బల్వంత్, సాగర్ పట్టరాని కోపంతో టిబిలే తల మీద కర్రతో బలంగా కొట్టారు. దీంతో ఆ వృద్ధుడు అక్కడికక్కడే కుప్పకూలాడు. ప్రస్తుతం టిబిలే పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. నిందితులు ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. అభిమానం మంచిదే గానీ అది గొడవలకు, దాడులకు దారి తీయొద్దని కామెంట్స్ చేస్తున్నారు.

ఇదీ చదవండి: MS Dhoni: ధోని ముసలోడే కదా.. సెహ్వాగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి