iDreamPost

Travis Head: హెడ్ మాటలకు అందని విధ్వంసం.. ఇదేం పిచ్చి కొట్టుడు సామి!

  • Published Apr 20, 2024 | 7:58 PMUpdated Apr 20, 2024 | 7:58 PM

సన్​రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ మరోసారి చెలరేగిపోయాడు. మాటలకు అందని విధ్వంసంతో ఢిల్లీ క్యాపిటల్స్​ బౌలర్లను బెంబేలెత్తించాడు.

ఐపీఎల్-2024లో సన్​రైజర్స్ హైదరాబాద్ డామినేషన్ నడుస్తోంది. గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రతి జట్టును తమ గేమ్​తో భయపెడుతూ పోతోంది కమిన్స్ సేన. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, ఆర్సీబీ లాంటి బడా జట్లను వణికించిన ఆరెంజ్ ఆర్మీ ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్​తో ఆడుకుంటోంది. ఈ టీమ్​తో జరుగుతున్న మ్యాచ్​లో ఎస్​ఆర్​హెచ్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. ఓపెనర్ ట్రావిస్ హెడ్ మాటలకు అందని విధ్వంసంతో రెచ్చిపోతున్నాడు. 16 బంతుల్లోనే ఫిఫ్టీ మార్క్​ను చేరుకున్నాడు హెడ్. ఇందులో 7 ఫోర్లతో పాటు 4 భారీ సిక్సులు ఉన్నాయి.

డీసీ పేసర్లు నోకియా, ఖలీల్​తో పాటు లలిత్ యాదవ్​ను అతడు ఊచకోత కోశాడు. పిచ్చి కొట్టుడుతో స్టేడియాన్ని షేక్ చేశాడు. ఎస్​ఆర్​హెచ్ తరఫున ఫాస్టెస్ట్ ఫిఫ్టీ (16 బంతుల్లో) రికార్డులో మరో ఓపెనర్ అభిషేక్ శర్మతో సమానంగా నిలిచాడు హెడ్. ఈ మ్యాచ్​లో హెడ్​తో పాటు అభిషేక్ కూడా చెలరేగి ఆడుతున్నాడు. అతడు 10 బంతుల్లోనే 2 ఫోర్లు, 5 సిక్సులతో 40 పరుగులు బాదేశాడు. ప్రస్తుతం ఎస్​ఆర్​హెచ్ స్కోరు 5 ఓవర్లకు 107. హెడ్ 70 పరుగులు, అభిషేక్ 40 పరుగులతో క్రీజులో ఉన్నారు. మరి.. హెడ్ బ్యాటింగ్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి