iDreamPost

వరంగల్‌లో భారీ అగ్నిప్రమాదం.. పరుగులు పెట్టిన జనం

  • Published Mar 28, 2024 | 10:16 PMUpdated Mar 28, 2024 | 10:16 PM

Fire Accident: ఇటీవల పలు చోట్ల అగ్ని ప్రమాదాలు భయాందోళన కలిగిస్తున్నాయి. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటాయని అధికారులు అంటున్నారు.

ఈ మద్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో వరుసగా అగ్ని ప్రమాదాలు తీవ్ర భయాందోళన సృష్టిస్తున్నాయి. ఇందులో చాలా వరకు షార్ట్ సర్క్యూట్, మానవ తప్పిదాల వల్ల జరుగుతున్నాయి. మరికొన్ని చోట్ల గ్యాస్ సిలిండర్లు పేలడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. బానాసంచ, ప్లాస్టీక్ గోదాం, కెమికల్ ఫ్యాక్టీరీలు, వస్త్ర సముదాయాలు.. కాటన్ నిల్వ చేసే గోదాములు వద్ద తప్పకుండా ఫైర్ సేఫ్టీ ఉండాలని అంటారు. కానీ కొంతమంది యాజమానులు ఫైర్ సేఫ్టీ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే తమను తాము రక్షించుకోలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి.  తాజాగా వరంగల్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

వరంగల్ లోని పోచమ్మ మైదాన్ జకోటియా షాపింగ్ కాంప్లెక్స్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.కాంప్లెక్స్ లో మంటలు రావడంతో వెంటనే ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేశారు స్థానికులు. సమాచారం అందుకున్న ఫైర్ స్టేషన్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం మంటలు అర్పే ప్రయత్నం చేస్తున్నారు. మంటల కారణంగా దట్టమైన పొగ రావడతంతో చుట్టు పక్కల వాళ్లకు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బందులు పడుతున్నట్లు బాధపడుతున్నారు. ఘటనా స్థలానికి మంత్రి కొండా సురేఖ చేరుకొని పరిస్థితి గురించి అధికారులతో మాట్లాడుతున్నారు. వరంగల్ సెంటర్ పాయింట్లో ఈ ఘటన చోటు చేసుకోవడంతో స్థానికులు భయపడ్డారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి