iDreamPost

OTT లోకి ఇవాళ ఒక్కరోజే 11 సినిమాలు.. వాటిలో ఈ క్రైమ్, కామెడీ థ్రిల్లర్స్ మిస్ కాకండి..

  • Published Apr 19, 2024 | 12:00 PMUpdated Apr 19, 2024 | 12:00 PM

Today Releases: శుక్రవారం అంటే థియేటర్స్ లోనే కాదు.. ఓటీటీ లలోను సినిమాల జాతరే. ఈ క్రమంలో మరొక శుక్రవారం వచ్చేసింది, ఈ వారం ఏకంగా 18 చిత్రాలకు పైగా ఓటీటీ లో విడులయ్యాయి. మరి వాటి వివరాలేంటో చూసేద్దాం.

Today Releases: శుక్రవారం అంటే థియేటర్స్ లోనే కాదు.. ఓటీటీ లలోను సినిమాల జాతరే. ఈ క్రమంలో మరొక శుక్రవారం వచ్చేసింది, ఈ వారం ఏకంగా 18 చిత్రాలకు పైగా ఓటీటీ లో విడులయ్యాయి. మరి వాటి వివరాలేంటో చూసేద్దాం.

  • Published Apr 19, 2024 | 12:00 PMUpdated Apr 19, 2024 | 12:00 PM
OTT లోకి ఇవాళ ఒక్కరోజే 11 సినిమాలు.. వాటిలో ఈ క్రైమ్, కామెడీ థ్రిల్లర్స్ మిస్ కాకండి..

చూస్తుండగానే మరొక శుక్రవారం వచ్చేసింది. వీకెండ్ ఎప్పుడు వస్తుందా ఎప్పడూ రిలాక్స్ అవుదామా అని చూసేవారికి.. శుక్రవారం అంటే మూవీస్ ఏ గుర్తొస్తూ ఉంటాయి. ఒకప్పుడు ప్రతి శుక్రవారం థియేటర్ లో ఎదో ఒక సినిమా రిలీజ్ అయ్యేది. ఇప్పుడు ఆ ట్రెండ్ ఓటీటీ లకు కొనసాగుతుంది. మొదట్లో వారానికి రెండు లేదా మూడు సినిమాలను మాత్రమే ఓటీటీ లో రిలీజ్ చేసిన మేకర్స్. ఇప్పుడు ఆయా సినిమాలకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని.. వారానికి పదికి పైగా సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ వారం ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లోకి 18 సినిమాలకు పైగానే రిలీజ్ అయ్యాయి. అందులోను కేవలం ఈరోజు ఒక్కరోజే అంటే ఏప్రిల్ 19న మాత్రమే ఏకంగా 11 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అవేంటో చూసేద్దాం.

జోనర్, లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా ఎన్నో సినిమాలు, సిరీస్ లు వస్తున్న సంగతి తెలిసిందే. వారం మొదటిలోనే ఈ వారం ఏ ఏ సినిమాలు రిలీజ్ అవ్వబోతున్నాయన్న విషయాలను కూడా చూస్తూనే ఉన్నా సరే.. ప్రేక్షకులకు ఇంకా ఏవైనా తెలియని సినిమాలు కూడా ఉన్నాయేమో తెలియజేసేందుకు ఈ వీకెండ్ రిమైండర్. అందులోను ఏప్రిల్ 19 న మాత్రమే ఏకంగా 11 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి కాబట్టి.. మీరు చూడాలనుకుంటున్న సినిమా ఏ ప్లాట్ ఫార్మ్ లో అందుబాటులో ఉందో చూసెయ్యండి, వాటితో పాటు ఏ ఏ సినిమాలు ఏ ఏ ప్లాట్ ఫార్మ్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసుకుందాం.

ఏప్రిల్ 19 న రిలీజ్ అయినా 11 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్ ఇదే..

1. చీఫ్ డిటెక్టివ్ 1958 (కొరియన్ వెబ్ సిరీస్) : డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

2. సైరన్ (తెలుగు డబ్బింగ్ మూవీ) : డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

3. రెబల్ మూన్ ది స్కార్గివర్ పార్ట్-2 : నెట్‌ఫ్లిక్స్

4. ఆర్టికల్ 370 : నెట్ ఫ్లిక్స్ ఓటీటీ

5. డిమోన్స్ : జీ5

6. కమ్ చాలు హై : జీ5

7. ఒర్లాండో బ్లూమ్: టూ ది ఎడ్జ్ ( వెబ్ సిరీస్) : జియో సినిమా

8. రణం అరమ్ తవరేళ్ : అమెజాన్ ప్రైమ్ వీడియో

9. డ్రీమ్ సినారియో : లయన్స్ గేట్ ప్లే ఓటీటీ

10. ది టూరిస్ట్ సీజన్ 2 ( వెబ్ సిరీస్) : లయన్స్ గేట్ ప్లే ఓటీటీ

11. మై డియర్ దొంగ : ఆహా

తెలుగుతో పాటు అన్ని భాషల చిత్రాలు అందుబాటులోకి వచ్చేశాయి. కాబట్టి ఈ వీకెండ్ కు మంచి ఎంటర్టైన్మెంట్ దొరికేసినట్లే. వీటిలో రణం , మై డియర్ దొంగ, ఆర్టికల్ 370 లాంటి సినిమాలు అసలు మిస్ చేయకుండా చూడాల్సినవి. అసలే బయట ఎండలు మండిపోతున్నాయి కాబట్టి.. ఎంచక్కా సినిమాలు చూస్తూ రిలాక్స్ అయిపోడానికి.. ఈ సినిమాలన్నీ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో అందుబాటులోకి వచ్చేశాయి. మరి ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి