iDreamPost

రిటైర్డ్ IAS ను బురిడీ కొట్టించిన మహిళ.. ఏకంగా రూ. 1.89 కోట్లు స్వాహా

  • Published Apr 24, 2024 | 12:46 PMUpdated Apr 24, 2024 | 12:46 PM

ప్రస్తుత కాలంలో రోజుకో కొత్త తరహా సైబర్ మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఈ కేటుగాళ్లు అమాయక ప్రజలనే టార్గెట్ చేస్తూ చాలా ఈజీగా బురిడీ కొట్టిస్తున్నారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో పరిచయం చేసుకున్న ఓ మహిళ ఏకంగా రిటైర్డ్ అధికారికి వల వేసి మోసం చేసింది. ఈ క్రమంలో ఏకంగా అన్నీ కోట్లను కాజేసింది. ఇంతకి ఎక్కడంటే..

ప్రస్తుత కాలంలో రోజుకో కొత్త తరహా సైబర్ మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఈ కేటుగాళ్లు అమాయక ప్రజలనే టార్గెట్ చేస్తూ చాలా ఈజీగా బురిడీ కొట్టిస్తున్నారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో పరిచయం చేసుకున్న ఓ మహిళ ఏకంగా రిటైర్డ్ అధికారికి వల వేసి మోసం చేసింది. ఈ క్రమంలో ఏకంగా అన్నీ కోట్లను కాజేసింది. ఇంతకి ఎక్కడంటే..

  • Published Apr 24, 2024 | 12:46 PMUpdated Apr 24, 2024 | 12:46 PM
రిటైర్డ్ IAS ను బురిడీ కొట్టించిన మహిళ.. ఏకంగా రూ. 1.89 కోట్లు స్వాహా

దేశంలో సైబర్ నేరగాళ్ల మోసాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. తరచూ ఏదో ఒక రూపంలో అమాయక ప్రజలను మోసం చేస్తూ.. వారి దగ్గర భారీ మొత్తంలో నగదును కాజేసుకుంటున్నారు. అయితే ఈ సైబర్ నేరగాళ్ల వలలో సామాన్య ప్రజలు, సెలబ్రిటీస్ కూడా చిక్కుకుంటున్నారు. ఇక ఈ విషయంలో.. అధికారులు ప్రజలను ఎంత అప్రమత్తంగా ఉండమని హెచ్చరిస్తున్నా.. జాగ్రత్త అనే మాట తప్ప, మోసపోయే వారి సంఖ్య క్రమంగా పెరిగిపోతుంది.ఈ మధ్య కాలంలో అయితే ఈ సైబర్ కేటుగాళ్లు కొత్తరకం సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఇలా కొత్త కొత్త ఐడియాలతో ప్రజలకు మోసం చేస్తూ లక్షల రూపాయల నగదును కొల్లగొడుతున్నారు. అయితే ఈ సైబర్ నేరగాళ్ల వలలో ఈ మధ్య ఎక్కువగా రిటైర్డ్ ఆఫీసర్స్ కూడా చిక్కుకొని లక్షల రూపాలయలను పొగొట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజగా సైబర్ నేరగాళ్లకు ఓ విశ్రాంతి ఐఏఎస్ అధికారి చిక్కి నిండా మునిగిపోయాడు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ప్రస్తుత కాలంలో రోజుకో కొత్త తరహా సైబర్ మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఈ కేటుగాళ్లు అమాయక ప్రజలనే టార్గెట్ చేస్తూ చాలా ఈజీగా బురిడీ కొట్టిస్తున్నారు. అయితు ఇప్పుడు అందరూ సంపాదిస్తున్నా కొలది.. ఇంక తక్కువ సమయంలో ఎక్కువ డబ్బను  సంపాదించాలనే  యాతనలో పడుతున్నారు. ఈ క్రమంలోనే.. కొందరు మోసగాళ్లను నమ్మి నిండా లక్షలు పొగొట్టుకొని నిండా మునిగిపోతున్నారు. ఇక ఈ సైబర్ మోసాల పట్ల పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా.. ప్రజల్లో ఏ మాత్రం చైతన్యం కలగడం లేదు. ఇక విచిత్రమైన విషయమేటంటే.. ఈ సైబర్ కేటుగాళ్ల వలలో చదువుకొని మంచి ఉన్నత స్థాయిలో ఉన్నవారు కూడా వీరి ఉచ్చులో చిక్కుకోవటం ఆశ్చర్యన్ని కలిగిస్తుంది. తాజాగా హైదరాబాద్ లో నివాసం ఉంటున్న ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కూడా ఈ సైబర్ మోసం బారినపడ్డారు. అయితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి రిటైర్ అయిన ఆయన.. ఓ మహిళ మాటలు నమ్మి రూ.1.89 కోట్లు పొగొట్టుకున్నాడు.

IAS who lost 1

కాగా, సోషల్ మీడియాలో పరిచయమైన సదరు మహిళ ట్రేడింగ్ పేరుతో విశ్రాంత ఉన్నతాధికారిని బురిడీ కొట్టించింది.  ఇక గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఆ రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి నగరంలో నివాసముంటున్నారు. కాగా, ఆయనకు ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో సోషల్ మీడియాలో ఓ మేసెజ్ వచ్చింది.  ఇక ఆ మేసేజ్ చూసిన అధికారి ఆ మహిళను ఎవరని ప్రశ్నించగా.. తన పేరు ప్రతిభారావు అని, ఇక తాను బెంగళూరులో ఉంటానని ఫారెక్స్‌ ట్రేడింగ్‌ చేస్తున్నట్లు పరిచయం చేసుకుంది. అలాగే ఫ్యూచర్ గ్లోబల్‌ ద్వారా ట్రేడింగ్‌ చేస్తున్నానని.. ఇందులో పెట్టుబడులు పెడితే తక్కువ కాలంలో ఎక్కువ రిటర్న్స్ వస్తాయని ఆ ఐఏఎస్ అధికారిని నమ్మించింది.  అయితే ఆమె మాటలు నమ్మిన ఆ అధికారి నిజంగా తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని ఆశపడ్డాడు. ఈ క్రమంలోనే సదరు మహిళ టెలిగ్రామ్‌ ద్వారా ఓ లింకు పంపించింది. అందులో కస్టమర్‌ సేవను సంప్రదించగా ఓ బ్యాంకు అకౌంట్ ఇచ్చారు.

దీంతో సదరు విశాంత్ర అధికారి ఏప్రిల్‌ మూడోవారంలో ఆ ఖాతాలో రూ.50 వేలు జమ చేశారు. ఆ తర్వాత రూ.5 లక్షలు, మరోసారి రూ.50 లక్షలు డిపాజిట్‌ చేశారు. ఇక కొన్నిరోజుల తర్వాత పెట్టుబడికి లాభం కలిపి రూ.67 లక్షలు వచ్చినట్లు ఆన్‌లైన్‌లో చూపించింది. అయితే ఫ్యూచర్‌ గ్లోబల్‌ ద్వారా డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా అది సాధ్యపడలేదు. ఇలా మొత్తం 40 విడతల్లో రూ.1.89 కోట్లు పోగొట్టుకున్నారు. దీంతో డబ్బులు తిరిగి రాకపోవటంతో చేసేదేం లేక సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మరి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సోషల్ మీడియా ఫేక్ న్యూస్ ద్వారా కోట్ల రూపాయాలు పొగొట్టున ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలిజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి