iDreamPost

పాక్ యువతికి భారతీయుడి గుండె..ఇది కదా మానవత్వం అంటే..

ఇటీవల తాము కన్నుమూసినా.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి అవయవదానం చేస్తూ వారి జీవితాల్లో కొత్త వెలుగు నింపుతున్నారు.

ఇటీవల తాము కన్నుమూసినా.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి అవయవదానం చేస్తూ వారి జీవితాల్లో కొత్త వెలుగు నింపుతున్నారు.

పాక్ యువతికి భారతీయుడి గుండె..ఇది కదా మానవత్వం అంటే..

మనిషిగా పుట్టిన తర్వాత ఏదో ఒకటి సాధించాలని అంటారు. ప్రతి మనిషి మానవత్వంతో మెలగాలి.. ఇతరుల పట్ల సానుభూతి చూపించాలని పెద్దలు అంటారు. మనకు చేతనైన సాయం చేస్తే ఆ దేవుడు మనకూ.. మన కుటుంబానికి మంచి చేస్తారని అంటారు. మానవత్వంతో మెలగడం వల్ల సమాజంలో గొప్ప గౌరవం దక్కుతుంది. ఇటీవల బ్రేయిన్ స్ట్రోక్ తో కన్నుమూసిన వారి కుటుంబం సభ్యులు మానవత్వంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి అవయవదానం చేసి వారికి కొత్త జీవితాలు అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మానవత్వం సరిహద్దులు దాటింది.. భారతీయుడి గుండె దానంతో పాకిస్థాన్ యువతికి కొత్త జీవితం లభించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త నెట్టింట వైరల్ అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

మానవత్వానికి సరిహద్దులు లేవని మరోసారి రుజువైంది. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓ పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను అమర్చి ప్రాణదానం చేసి మానవత్వం చాటుకున్నారు చెన్నైలోని ఓ హాస్పిటల్ వైద్యులు. అంతేకాదు ఈ ఆపరేషన్ చేసినందుకు వైద్యులు, హాస్పిటల్, ట్రస్ట్ ఆ యువతి నుంచి ఒక్క పైసా కూడా తీసుకోకపోవడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్ కి చెందిన 19 ఏళ్ల రశన్ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుంది. ఆమె పరిస్థితి విషమించడంతో గుండె మార్పిడి చేయకుంటే బతకడం కష్టమని తేల్చారు వైద్యులు. ఈ చికిత్సకు దాదాపు రూ.35 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని చెప్పడంతో రశన్ తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఈ క్రమంలోనే రశన్ ని ఆదుకునేందుకు ఒక స్వచ్చంద సంస్థ ముందుకు వచ్చింది.

పాకిస్థాన్ కి చెందిన రశన్ ని భారత్ లో శస్ర్త చికిత్స కోసం ఏర్పాటు చేసింది. చెన్నైలోని ఎమ్‌జీఎమ్ హెల్త్ కేర్ హాస్పిటల్ లో నిపుణుల బృందం సిద్దమయ్యారు. రశన్ కి భారతీయుడి గుండెను విజయవంతంగా అమర్చారు. ఇది ఓ గొప్ప సంఘటన.. ఎల్లలు దాటిన మానవత్వం. ఇందు కోసం యువతి నుంచి ఒక్క పైసా కూడా తీసుకోమని వైద్యులు, హాస్పిటల్ యాజమాన్యం తెలిపారు. రశన్ గుండె చికిత్స కోసం అన్ని ఏర్పాట్లు చేసిన సంస్థ కూడా ఒక్క పైసా తీసుకోలేదు. ప్రస్తుతం రశన్ ఆరోగ్య పరిస్థితి నిలకడా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. చనిపోతుందనుకున్న తమ కూతుర ప్రాణాలు నిలిపినందుకు రశన్ తల్లిదండ్రులు ట్రస్టు, ఆస్పత్రి యాజమాన్యం, వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వార్త తెలిసిన నెటిజన్లు సైతం ఈ ప్రపంచంలో మానవత్వం ఇంకా ఉందని ఈ ఘటనే సాక్ష్యం అంటూ వైద్య బృందాన్ని ప్రశంసిస్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి