iDreamPost

Rishabh Pant: IPL 2024లో చరిత్ర సృష్టించిన పంత్.. ఆ ఘనత సాధించిన తొలి ప్లేయర్ గా..

ఐపీఎల్ 2024 సీజన్ లో అదరగొడుతున్నాడు ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్. బ్యాటింగ్, కీపింగ్ లో రాణిస్తూ.. ఈ ఐపీఎల్ సీజన్ లో పలు రికార్డులను కొల్లగొడుతున్నాడు. తాజాగా తన ఖాతాలో అరుదైన ఘనతను చేర్చుకున్నాడు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

ఐపీఎల్ 2024 సీజన్ లో అదరగొడుతున్నాడు ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్. బ్యాటింగ్, కీపింగ్ లో రాణిస్తూ.. ఈ ఐపీఎల్ సీజన్ లో పలు రికార్డులను కొల్లగొడుతున్నాడు. తాజాగా తన ఖాతాలో అరుదైన ఘనతను చేర్చుకున్నాడు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

Rishabh Pant: IPL 2024లో చరిత్ర సృష్టించిన పంత్.. ఆ ఘనత సాధించిన తొలి ప్లేయర్ గా..

టీమిండియా స్టార్ వికెట్ కీపర్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కంబ్యాక్ లో దుమ్మురేపుతున్నాడు. అద్భుతమైన బ్యాటింగ్ తో పాటుగా అంతకంటే సూపర్ కీపింగ్ తో సత్తా చాటుతున్నాడు. దీంతో టీ20 వరల్డ్ కప్ లో కీపర్ గా తన ప్లేస్ కోసం ముందువరుసలో దూసుకెళ్తున్నాడు. ఇక తాజాగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో 43 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 88 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడికి తోడు అక్షర్ పటేల్(66) రన్స్ తో రాణించాడు. దీంతో 224 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇక ఈ మ్యాచ్ ద్వారా ఐపీఎల్ 2024 సీజన్ లో సరికొత్త చరిత్ర సృష్టించాడు రిషబ్ పంత్.

ఐపీఎల్ 2024 సీజన్ లో అదరగొడుతున్నాడు ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్. బ్యాటింగ్, కీపింగ్ లో రాణిస్తూ.. టీ20 ప్రపంచ కప్ రేసులో నేను కూడా ఉన్నానంటూ సెలక్టర్లకు సవాల్ విసురుతున్నాడు. ఇక తాజాగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో 88 పరుగులతో అజేయంగా నిలిచి, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో పాటుగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ ను అందుకున్నాడు.

pant creates history

ఇక ఈ అవార్డు అందుకోవడం ద్వారా ఈ ఐపీఎల్ సీజన్ లో రేర్ ఫీట్ ను నమోదు చేశాడు పంత్. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2024 సీజన్ లో రెండు సార్లు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ లు అందుకున్న తొలి వికెట్ కీపర్ గా, తొలి కెప్టెన్ గా అరుదైన ఘనత సాధించాడు. దీంతో పంత్ సరికొత్త చరిత్ర సృష్టించినట్లైంది. ఇక సూపర్ ఫామ్ లో ఉన్న పంత్ పొట్టి ప్రపంచ కప్ టీమ్ సెలెక్షన్లలోకి దూసుకొచ్చాడు. కారు ప్రమాదం నుంచి కోలుకుని, అద్భుతమైన కంబ్యాక్ ఇవ్వడమే కాకుండా.. రికార్డులు కొల్లగొడుతున్నాడు. మరి సాధించిన ఈ రేర్ ఫీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి