iPhone Copied Android Phones: ఆండ్రాయిడ్‌ని కాపీ కొడుతున్న యాపిల్.. మరీ ఇంత కాపీ క్యాట్ ఐతే ఎలా?

ఆండ్రాయిడ్‌ని కాపీ కొడుతున్న యాపిల్.. మరీ ఇంత కాపీ క్యాట్ ఐతే ఎలా?

iPhone Copied Android Phones: యాపిల్ కంపెనీ అంటే ఒక బ్రాండ్. దానికొక ప్రత్యేక శైలి ఉంది. యాపిల్ కంపెనీ నుంచి వచ్చిన ఐఫోన్ కి ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఫీచర్స్ విషయంలో దాన్ని మించిన ఫోన్ లేదు అనేలా ఉంటుంది. అలాంటి ఐఫోన్ ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్స్ ని కాపీ కొడుతుందంటే నమ్ముతారా?

iPhone Copied Android Phones: యాపిల్ కంపెనీ అంటే ఒక బ్రాండ్. దానికొక ప్రత్యేక శైలి ఉంది. యాపిల్ కంపెనీ నుంచి వచ్చిన ఐఫోన్ కి ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఫీచర్స్ విషయంలో దాన్ని మించిన ఫోన్ లేదు అనేలా ఉంటుంది. అలాంటి ఐఫోన్ ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్స్ ని కాపీ కొడుతుందంటే నమ్ముతారా?

వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫిరెన్స్ 2024లో యాపిల్ కంపెనీ కొత్త ఐఓఎస్ 18 ఫీచర్స్ ని ప్రకటించింది. అయితే ఈ ఫీచర్స్ ని యాపిల్ ఆండ్రాయిడ్ ఫోన్ల నుంచి కాపీ చేసిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పూర్తిగా ఆండ్రాయిడ్ గ మారిన ఐఫోన్ ని చూడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మెల్లగా యాపిల్ కంపెనీ కూడా ఐఫోన్ ని ఆండ్రాయిడ్ లా మార్చేస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. యాపిల్ తాజాగా ప్రకటించిన ఐఓఎస్ 18 ఫీచర్స్ లో చాలా వరకూ ఆండ్రాయిడ్ ఓఎస్ నుంచి కాపీ కొట్టినవే అని టెక్ నిపుణులు చెబుతున్నారు.    

హోమ్ స్క్రీన్ మీద ఐకాన్స్ ని ఐఫోన్ యూజర్లు ఇప్పుడు ఫ్రీగా మూవ్ చేసుకోవచ్చు. ఐఫోన్ లో వాల్ పేపర్ మాత్రమే కనబడేలా హోమ్ స్క్రీన్ పై ఉన్న ఐకాన్స్ ని పక్క గ్రిడ్స్ కి మార్చుకోవచ్చు. ఈ ఫీచర్ మనకి ఆండ్రాయిడ్ ఫోన్స్ లో కనబడుతుంది. ఇప్పుడు యాపిల్ ఆండ్రాయిడ్ ఫోన్ ఫీచర్ ని కాపీ కొట్టింది. నచ్చిన ఐకాన్ కలర్స్ ని సెట్ చేసుకునే ఫీచర్ ఇప్పుడు ఐఫోన్ లోకొచ్చింది. ఇది ఆండ్రాయిడ్ ఫోన్ లో ఎప్పటి నుంచో ఉంది. గేమ్ మోడ్ అనేది 2021లో ఆండ్రాయిడ్ 12 ఓఎస్ లో వచ్చింది. బ్యాక్ యాక్టివిటీని మినిమైజ్ చేసి.. బెటర్ గేమ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం కోసం పవర్ ప్రాసెసింగ్ మీద ఫోకస్ చేస్తుంది. ఇదే ఇప్పుడు ఐఓఎస్ డివైజెస్ లో ఉంది. 2014 నుంచి ఆండ్రాయిడ్ 5 ఓఎస్ లో ఆర్సీఎస్ (రిచ్ కమ్యూనికేషన్ సర్వీస్) అనేది అందుబాటులో ఉంది. ఎస్ఎంఎస్ పంపించుకోవడంతో పాటు ఫైల్ అండ్ మీడియా షేరింగ్ వంటి రిచ్ చాట్ ఫంక్షన్స్ అనేవి ఆండ్రాయిడ్ లో ఉన్నాయి. ఈ ఫీచర్ ఇప్పుడు ఐఓఎస్ 18 కలిగిన ఐఫోన్స్ లో ఇప్పుడు వస్తుంది.

ఆండ్రాయిడ్ ఫోన్స్ లో యాప్స్ ని ఎవరికీ కనబడకుండా దాచుకోవాలనుకుంటే హైడ్ అనే ఫీచర్ ఉంటుంది. ఈ ఫీచర్ వల్ల హోమ్ స్క్రీన్ లో హైడ్ చేసిన యాప్ అనేది ఎక్కడా కనబడదు. ఇప్పుడు ఈ ఫీచర్ ఐఓఎస్ 18లో కనబడుతుంది. ఐఫోన్ లో డీఫాల్ట్ గా లాక్ స్క్రీన్ మీద ఉండే షార్ట్ కట్స్ లో కుడి వైపు కెమెరా, ఎడమ వైపు ఫ్లాష్ లైట్ ఉంటాయి. ఇది మాకు తెలుసులేరా అని అనుకుంటున్నారా? ఇది కొత్త కాదు కానీ ఈ డీఫాల్ట్ షార్ట్ కట్స్ బదులు వేరే యాప్స్ ని షార్ట్ కట్స్ గా వాడుకోవచ్చు. ఇందుకోసం యాపిల్ థర్డ్ పార్టీ యాప్స్ ని లాంఛ్ చేసుకునే సదుపాయం కల్పిస్తుంది.

అయితే ఆండ్రాయిడ్ విషయానికొస్తే ఈ కస్టమ్ లాక్ స్క్రీన్ షార్ట్ కట్స్ అనేవి ఆండ్రాయిడ్ 14 నుంచి ఉన్నాయి. ఇవే కాకుండా ఫేస్ లాక్, పాస్వర్డ్ మేనేజర్, కంట్రోల్ సెంటర్ లో మోర్ కస్టమైజేషన్, యాపిల్ మెయిల్ కేటగిరీస్ క్యాలెండర్ రిమైండర్స్, ఏఐ ఫోటో ఎడిటింగ్ ఇలా చాలా ఫీచర్స్ ని ఆండ్రాయిడ్ నుంచి యాపిల్ కాపీ కొట్టిందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా శామ్ సంగ్ గెలాక్సీలో ఉన్న ఫీచర్స్ ని కాపీ కొట్టిందని అంటున్నారు. ఇదొక్కసారే కాదు ఐఓఎస్ 17, ఐఓస్ 16 ఇలా గతంలో వచ్చిన ఫీచర్స్ కూడా ఆండ్రాయిడ్ నుంచి కాపీ కొట్టినవే అని చెబుతున్నారు.

Show comments