iDreamPost

బాబు హయంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్లో అక్రమాలపై ఈడీ కొరడా

బాబు హయంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్లో అక్రమాలపై ఈడీ కొరడా

ఎపి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో 242 కోట్ల రూపాయల నిధులు అక్రమంగా దారి మల్లించిన కేసులో ఈడీ పలువురికి నోటీసులు జారీ చేసింది. ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో 2015 నుండి అక్రమాలు జరుగుతున్నట్టు , నకిలీ బిల్లులు, టాక్స్ ఇన్వాయిస్ లతో పెద్ద మొత్తంలో నిధులు దారి మళ్లుతున్నాయని తమ దృష్టికి వచ్చిందని, విచారించమని సెంట్రల్ జీఎస్టీ విభాగం 2018 లో ఏపీ ఏసీబి అధికారులకు సూచించింది. అయితే అప్పటి ప్రభుత్వ పెద్దలు, యువ నాయకుడి ఒత్తిడి మేరకు ఏసీబి ఈ కేసుని విచారించకుండా తాత్సరం చేసింది.

వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో గతంలో నకిలీ బిల్లులతో పెద్ద ఎత్తున నిధులు దారి మల్లించటమే కాక, పలు అక్రమాలు జరిగాయని ప్రస్తుత చైర్మన్ అజయ్ రెడ్డి పిర్యాదు మేరకు ఎపి సిఐడి పోరెన్సిక్ ఆడిట్ చేపట్టడంతో సీమెన్స్‌ సంస్థ ద్వారా యువత స్కిల్ డెవలప్మెంట్ కి శిక్షణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధుల్ని నకిలీ ఇన్వాయిస్ ల ద్వారా రెండు వందల నలభై రెండు కోట్లను దారి మళ్లించారని తేలింది. దీంతో గతంలో స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌‌ మాజీ ఛైర్మన్‌ గంటా సుబ్బారావుతో పాటు, డైరెక్టర్ మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణతో పాటు పలువురు ఉద్యోగులు, పలు షెల్ కంపెనీలపై విచారణ ప్రారంభించింది. సిఐడి కేసుల నమోదు తర్వాత అందులోని పలువురు నిందితులు ఏపీ హైకోర్టు నుండి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు.

ఈ నేపథ్యంలో గత రెండ్రోజుల నుండి టీడీపీ నేతలకు చెందిన ఎన్నారై ఆసుపత్రి అక్రమాల పై కొరడా జులిపించిన ఈడీ, తాజాగా ఈ వ్యవహారం పై దృష్టి సారించి స్కిల్ డెవలప్‌మెంట్ లో గతంలో జరిగిన అక్రమ లావాదేవీలపై 26మందికి నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న వారిలో మాజీ ఛైర్మన్ గంటా సుబ్బారావు, మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, మాజీ సీఈవో వెంకటకృష్ణ మరికొన్ని షెల్ కంపెనీల ప్రతినిధులకు కూడా సోమవారం ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి