iDreamPost
android-app
ios-app

ఏపీ అప్పులపై కేంద్రం ఇచ్చిన క్లారిటీ సరిపోదా? ఎందుకీ బురద రాతలు: బుగ్గన

ఏపీ అప్పులపై కేంద్రం ఇచ్చిన క్లారిటీ సరిపోదా? ఎందుకీ బురద రాతలు: బుగ్గన

ఏపీ ఆర్థిక వ్యవస్థపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. వైసీపీ ప్రభుత్వం వేల కోట్లు అప్పులు చేస్తుందంటూ టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అలానే రాష్ట్రం మరో శ్రీలంకలా మారిపోతుందటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరి విమర్శలకు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో చేసిన అప్పుల కంటే ఈ ప్రభుత్వం చాలా తక్కునే చేస్తుందంటూ వైసీపీ నేతలు అంటున్నారు.తాజాగా ఆర్థిక శాఖ మంత్రి..టీడీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచక పడ్డారు.

గురువారం ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సచివాలంయలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ ఆయన మాట్లాడుతూ.. ఏపీ ఆర్థిక పరిస్థితిపై కొందరు బురద చల్లుతున్నారంటూ మండిపడ్డారు. తమకు తామే ఆర్థిక నిపుణులుగా ప్రకటించుకుని ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. ఏపీ అప్పులపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్న వాళ్లు, గత ప్రభుత్వం ఇంతకంటే ఎక్కువ అప్పులు చేస్తే.. ఎందుకు మాట్లాడలేదని బుగ్గన ప్రశ్నించారు. ఇంక ఆయన మాట్లాడుతూ..” ఏపీ అభివృద్ధికి కేంద్రం సహకరించకూడదనేదే కొందరి కుట్ర. ఏపీకి మంచి జరగకూడదన్నదే వీరి ఆలోచన.

రాష్ట్రం మరో శ్రీలంకలా మారిపోతుందంటూ తప్పుడు ప్రచారం చేశారు. ఏపీ అప్పులపై మాట్లాడేవారు ఎవ్వరూ కూడా రాష్ట్రంలో  ఉండటం లేదు. కేవలం ప్రభుత్వంపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారు.  పార్లమెంట్ సాక్షిగా ఏపీ అప్పులపై వాస్తవాలు బయటపడ్డాయి.  ఆ వాస్తవాలు వెలుగులోకి వచ్చిన తరువాత వీరందరూ  బాధ పడిపోతున్నారు. వెయ్యి కోట్ల అప్పు అంటూ ఐదు సార్లు రాస్తే ఐదు వేల కోట్లు అవుతుందా?. ఏపీ అప్పులపై కేంద్రం ఇచ్చిన స్టేట్ మెంట్ ను ఎందుకు ప్రచురించరు?” అంటూ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. మరి..ఆర్థిక మంత్రి బుగ్గన చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి:  యూనివర్సిటీలు, ట్రిపుల్‌ ఐటీల్లో ఖాళీల భర్తీకి సీఎం గ్రీన్‌సిగ్నల్‌!