AP Govt-DWCRA Women: APలో డ్వాక్రా మహిళలకు మరో గుడ్‌ న్యూస్‌.. ఈసారి అంతకు మించి

APలో డ్వాక్రా మహిళలకు మరో గుడ్‌ న్యూస్‌.. ఈసారి అంతకు మించి

DWCRA Women: ఏపీలో డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గతంలో కన్నా.. ఈసారి ఎక్కువగా వారి ప్రయోజనాలు కల్పించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ఆ వివరాలు..

DWCRA Women: ఏపీలో డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గతంలో కన్నా.. ఈసారి ఎక్కువగా వారి ప్రయోజనాలు కల్పించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ఆ వివరాలు..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. రాష్ట్రంలోని అన్ని వర్గావల వారి సంక్షేమం కోసం రకరకాల పథకాలు అమలు చేస్తోన్న​ సంగతి తెలిసిందే. డ్వాక్రా మహిళల విషయంలో మరిన్ని చర్యలు తీసుకున్నారు. వారు తీసుకున్న రుణాలు మాఫీ చేశారు. అంతేకాక డ్వాక్రా మహిళల ఆర్థిక పరిస్థితి మెరుగయ్యేలా.. ప్రముఖ అంతర్జాతీయ వ్యాపార దిగ్గజాలతో ఒప్పందాలు చేసుకుంది ప్రభుత్వం. అమూల్‌తో పాటుగా ఐటీసీ, ప్రొక్టర్‌ అండ్‌ గ్యాంబల్, అల్లానా, అజియో రిలయన్స్, గ్రామీణ వికాస కేంద్రం, టేనేజర్, హిందూస్తాన్‌ లివర్ వంటి సంస్థలతో పాటుగా పాటు పలు బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుంది ప్రభుత్వం.

ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల నేడు ఏపీలో చాలా మంది డ్వాక్రా మహిళలు కిరాణా షాపులు ఆవులు, గేదెలు, మేకల పెంపకం, వస్త్ర వ్యాపారం వంటి వ్యాపారాలు ప్రారంభించారు. వీటితో పాటుగా డ్వాక్రా మహిళలకు తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తూ.. వారు తమ సొంత కాళ్లపై నిలబడేందుకు తగిన చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు శుభవార్త చెప్పింది. ఆ వివరాలు..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 5.27 లక్షల పొదుపు సంఘాలకు.. సుమారుగా రూ.32,190 కోట్ల రుణాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాక ఈ మధ్య కాలంలో కొత్తగా పొదుపు సంఘాల (డ్వాక్రా గ్రూపుల్లో)లో చేరిన లక్ష మంది మహిళలకు కూడా రుణాలు ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం సున్నా వడ్డీకి రుణాలను కూడా అందజేస్తున్న సంగతి తెలిసిందే.

మరోవైపు ఏపీ ప్రభుత్వం ఇటీవల వైఎస్సార్ ఆసరా కింద డ్వాక్రా మహిళల ఖాతాల్లో రూ.1843 కోట్లు జమ చేసిన సంగతి తెలిసిందే. వాణిజ్య, సహకార బ్యాంకులలో రుణం తీసుకుని 2019 ఏప్రిల్ 11 నాటికి అప్పు నిల్వ ఉన్న మహిళాస్వయం సహాయక సంఘాలు ఈ పథకానికి అర్హులు. రుణాల అప్పు మొత్తాన్ని నాలుగు విడతలుగా నేరుగా స్వయం సహాయక సంఘాలు పొదుపు ఖాతాలకు జమ చేస్తోంది ప్రభుత్వం. దీనిలో భాగంగా వైఎస్సార్ ఆసరా కింద 2020 సెప్టెంబర్ 11న మొదటి విడతలో రూ.6,318.76 కోట్లను 77,87,295మంది లబ్ధిదారుల ఖాతాలో జమ చేసింది ప్రభుత్వం.

ఆ తర్వాత 2021 అక్టోబర్ 7న రెండో విడతలో 78,75,539 లబ్ధిదారుల బ్యాంక్‌ అకౌంట్‌లో రూ.6,439.52 కోట్లు జమ చేశారు. 2023 మార్చి 25న మూడో విడత కింద.. 78,94,169 మందికి రూ.6,417.69 కోట్లు అందజేశారు. నాలుగో విడతలో 78,94,169మందికి రూ.6,394.83 కోట్లు అందజేశారు. వైఎస్సార్ ఆసరా ద్వారా మొత్తం నాలుగు విడతల్లో ఈ నిధుల్ని లబ్ధిదారులకు అందజేసినట్లు ప్రభుత్వం తెలిపింది. కొత్తగా చేరిన వారికి కూడా రుణాలు ఇవ్వడానికి ప్రభుత్వం ఆమోదం తెలపడంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Show comments