Anjali: ఆ కారణంతోనే బూ*తులు మాట్లాడాల్సి వచ్చింది: హీరోయిన్ అంజలి

Anjali: ఆ కారణంతోనే బూ*తులు మాట్లాడాల్సి వచ్చింది: హీరోయిన్ అంజలి

హీరోయిన్ అంజలి..'గీతాంజలి మళ్లీ వచ్చింది' అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. తాజాగా మరోసినిమాతో థియేటర్లో సందడి చేయనుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది.

హీరోయిన్ అంజలి..'గీతాంజలి మళ్లీ వచ్చింది' అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. తాజాగా మరోసినిమాతో థియేటర్లో సందడి చేయనుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది.

హీరోయిన్ అంజలి గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. విభిన్నమైన సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఫోటో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి అంజలి పరిచయమైంది. అనేక తెలుగు సినిమాల్లో ఆఫర్లు సంపాదించింది. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో అచ్చమైన పల్లెటూరు అమ్మాయిల పాత్రలో ఒదిగిపోయింది. ఇటీవలే ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’  సినిమాతో ప్రేక్షుకులను పలకరించింది ఈ అమ్మడు. తాజాగా విశ్వక్ సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలో ఈ బ్యూటీ ప్రత్యేక పాత్రలో నటిస్తుంది. ఈ సందర్భంగా రెండు రోజుల క్రితం జరిగిన ఫంక్షన్ లో అంజలి పలు విషయాలను షేర్ చేసుకుంది. ఫస్ట్ టైమ్ బూతులు మాట్లాడాల్సి వచ్చిందంటూ చెప్పుకొచ్చింది.

‘గామి’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన విశ్వక్ సేన్ మరోసారి థియేటర్లో సందడి చేయనున్నారు. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రం మే 31న థియేటర్లలోకి రానుంది. కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఇక ఈ చిత్రాన్నికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహించగా నేహా శెట్టి ఇందులో హీరోయిన్‌‍గా నటించింది. తెలుగమ్మాయి అంజలి.. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించింది. ఇక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది మేకర్స్ ప్రమోషన్లు నిర్వహిస్తున్నారు. తాజాగా ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అంజలి అనేక ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది.

‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాలో తాను రత్నమాల పాత్రలో నటించానని తెలిపింది. తాను అంతక ముందు చేసిన పాత్రలకు ఇది చాలా భిన్నంగా ఉంటుందని ఆమె తెలిపింది. తాను ఒక సినిమాలో బూతులు మాట్లాడటం ఇదే ఫస్ట్ టైమ్ అంటూ చెప్పుకొచ్చింది. ఇదే విషయాన్ని తన క్యారెక్టర్ కి డబ్బింగ్ చెప్పే సమయం కూడా తమ చిత్ర యూనిట్ కి చెప్పినట్లు అంజలి చెప్పుకొచ్చారు. తన నిజ జీవితంలో కూడా బూతులు వాడనని ఈ బ్యూటీ తెలిపింది. అలాంటి నన్ను రత్నమాల పాత్ర కోసం దర్శకుడు సంప్రదించడం చాలా ఆశ్చర్యంగా అనిపించిందంటూ సినిమాకు సంబంధించిన అనేక విషయాలను అంజలి షేర్ చేసుకుంది.

ఇక అంజలి గురించి డైరెక్ట్ర్ కృష్ణ చైతన్య  పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చారు. రత్నమాల లాంటి పాత్రలో అంజలిని తీసుకోవడానికి రీజన్ ఏంటని మీడియా అడిగిన ప్రశ్నకి కూడా బదులిచ్చాడు. అంజలి ఓ ప్రూవ్‌డ్ ఆర్టిస్టని, అలాంటి వాళ్లు ఎలాంటి పాత్రనైనా చేయగలరని అన్నారు. అందుకే అంజలిని తమ సినిమాకు ఎంపిక చేసుకున్నానంటూ కృష్ణ చైతన్య తెలిపాడు. మొత్తంగా అంజలి చెప్పిన ఇంట్రస్టింగ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments