ఎన్నికల ఫలితాలకు ముందే TDP ఎమ్మెల్యే అభ్యర్థికి షాక్!

ఎన్నికల ఫలితాలకు ముందే TDP ఎమ్మెల్యే అభ్యర్థికి షాక్!

దాదాపు నెల రోజుల పాటు ఏపీలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగింది. మే 13 ఏపీ శాసన సభ, పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ఫలితాలు రాకముందే...టీడీపీ అభ్యర్థికి ఎదురు దెబ్బ తగిలింది

దాదాపు నెల రోజుల పాటు ఏపీలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగింది. మే 13 ఏపీ శాసన సభ, పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ఫలితాలు రాకముందే...టీడీపీ అభ్యర్థికి ఎదురు దెబ్బ తగిలింది

ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజుల పాటు సమ్మర్ హీట్ కి పోటీగా రాజకీయ వేడిగా కొనసాగింది. మే 13న ఎన్నికలు పూర్తి కావడంతో ఈ పొలిటికల్ హీట్ కాస్త చల్లబడింది. అందురూ జూన్4వ తేదీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎవరికి వారు తమ పార్టీ గెలుస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు. ఎన్నికలు పోలింగ్ పూర్తైనప్పటికీ ఏపీలోని పార్టీల మధ్య పరస్పర ఆరోపణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.  ఇలాంటి నేపథ్యంలోనే టీడీపీ కూటమి అభ్యర్థికి గట్టి షాక్ తగిలింది. ఎన్నికల ఫలితాలు రాకముందే… టీడీపీ అభ్యర్థికి ఎదురు దెబ్బ తగిలింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

దాదాపు నెల రోజుల పాటు ఏపీలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగింది. మే 13 ఏపీ శాసన సభ, పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. దేశంలోనే అత్యధికంగా 81.86 పోలింగ్ శాతం నమోదైంది. ఇక భారీగా పోలింగ్ అయిన ఈ శాతం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎవరికి అనుకూలంగా వేశారు అనే చర్చలు అందరిలో మొదలయ్యాయి. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇక ఈ సంగతులు ఇలా ఉంచితే.. టీడీపీ అభ్యర్థి భార్యకు ఎన్నికల ఫలితాలకు ముందే షాక్ తగిలింది.

విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గం నుంచి పల్లా శ్రీనివాసరావు టీడీపీ కూటమి నుంచి పోటీ చేశారు. ఆయన భార్య లావణ్య ఆంధ్ర యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తుంది. పల్లా  శ్రీనివాసరావుకు మద్దతుగా ఆయన భార్య లావణ్య ఎన్నికల ప్రచారం చేశారు అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకుని అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం నుంచి ఆమెను సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఏయూ రిజిస్ట్రార్ ఉత్తర్వూలు జారీ చేశారు. ఈనెల 4వ తేదీన పల్లా లావణ్య తన భర్త, టీడీపీ అభ్యర్ధి అయిన శ్రీనివాసరావుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారు. అదే అంశం అన్న దాని మీదనే ఈ చర్యలు తీసుకున్నారు.

దీనికంటే ముందు లావణ్యకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు. ఆమె ఎన్నికల కోడ్ ని పూర్తిగా అతిక్రమించారు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఆ నోటీసులకు వివరణ ఇచ్చిన లావణ్య తాను ఎన్నికల ర్యాలీలో పాల్గొనలేదని అక్కడ ఒక మహిళను మాత్రమే కలిశాను అని చెప్పారు. ఆమె ఇచ్చిన సమాధానికి  ఈసీ ఎలా స్పందిస్తుంది అన్నది పక్కన పెడితే శాఖాపరమైన చర్యలకు ఏయూ ఉపక్రమించింది. దాంతో ఆమె ఉద్యోగానికే ముప్పు వచ్చింది. మరి.. ఈ అంశంపై టీడీపీ రియాక్షన్ కూడా చూడాలి.

Show comments