Udaya Bhanu: ఈ చిన్నారి స్టార్ యాంకర్ ను గుర్తుపట్టారా? ఒకప్పుడు బుల్లితెరపై ఆమెదే హవా..!

ఈ చిన్నారి స్టార్ యాంకర్ ను గుర్తుపట్టారా? ఒకప్పుడు బుల్లితెరపై ఆమెదే హవా..!

Udaya Bhanu: ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో సెలబ్రీటలకు సంబంధించిన త్రో బ్యాక్ ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. పలువురు స్టార్స్ చిన్ననాటి ఫోటోలు  సోషల్ మీడియాలో చక్కర్ల కొడుతున్నాయి.

Udaya Bhanu: ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో సెలబ్రీటలకు సంబంధించిన త్రో బ్యాక్ ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. పలువురు స్టార్స్ చిన్ననాటి ఫోటోలు  సోషల్ మీడియాలో చక్కర్ల కొడుతున్నాయి.

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో త్రో బ్యాక్ ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. టాలీవుడ్ పరిశ్రమతో పాటు ఇండియాలోని ఇతర సినీ పరిశ్రమలకు చెందిన పలువురు స్టార్స్ చిన్ననాటి ఫోటోలు  సోషల్ మీడియాలో చక్కర్ల కొడుతున్నాయి. ఇదే సమయంలో తమ అభిమాన హీరోహీరోయిన్లను, యాంకర్లను గుర్తుపట్టేందుకు సినీ ప్రియులు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ అందాల యాంకరమ్మ చిన్ననాటి పిక్ తెగ వైరలవుతుంది. పైన ఫోటోను చూశారు కదా..ఆ చిన్నారి ఒకప్పుడు బుల్లితెరపై తన హవా కొనసాగించింది. బుల్లితెరపై అల్లరి పిల్లగా, చురుకైన అమ్మాయి గుర్తింపు పొందింది. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా? మరి.. ఆమె ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

నేటికాలంలో సోషల్ మీడియా కారణంగా చిన్న పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ ఎంతలా ఫాలోవింగ్ పెరిగిపోయింది. ముఖ్యంగా అబ్బాయిల కంటే అమ్మాయిలకు ఎక్కడ లేని ఫాలోవర్స్ ఉంటున్నారు. ఏ చిన్న వీడియో తీసి పెట్టినా నిమిషాల్లో వేలల్లో లైక్స్ వస్తున్నాయి.  ఇదే సమయంలో సెలబ్రిటీలకు కూడా సోషల్ మీడియా లో భారీ స్థాయిలో అభిమానులు ఫాలో అవుతున్నారు. అందుకే సెలబ్రిటీలకు సంబంధించిన త్రో బ్యాక్ ఫోటోలు కానీ, ప్రస్తుతం ఫోటోలు కానీ నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంటాయి.

తాజాగా ఓ టాలీవుడ్ స్టార్ యాంకర్ కి సంబంధించిన చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. ఇందులో చారడేసి కళ్లు, చేతిలో చేయి వేసుకుని ఎంతో అమ్మాయకంగా కనిపిస్తున్న చిన్నారి ఓ స్టార్ యాంకర్. తన అందం, అభినయంతో బుల్లితెరపై ఒకప్పుడు తన హవా కొనసాగించింది. అప్పుడప్పుడు వెండితెరపై కూడా మెరుస్తూ అభిమానులను అలరించింది. మరి ఇంతకీ ఈ క్యూట్‌ బేబీ ఎవరో గుర్తుపట్టారా?  ఇంతలా అమాయకపు చూపులతో ఆకట్టుకుంటున్న ఆ చిన్నారి మరెవరో కాదు స్టార్‌ ఉదయభాను.

బుల్లితెర క్వీన్ ఉదయభాను గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన అందం, అభినయంతో టాలీవుడ్ ను ఓ ఊపు ఊపింది. అంతేకాక ఒకప్పుడు ఆమె లేని షోలేదంటే అతిశయోక్తి కాదు. ఇంకా చెప్పాలంటే.. ఈమెను బుల్లితెర శ్రీదేవి అని ముద్దుగా పిలుచుకుంటారు. ఉదయభానుకు ఓ హీరోయిన్ రేంజ్ లో ఫ్యాన్ ఫోలోయింగ్ ఉంది. బుల్లితెరతో పాటు వెండి తెరపై కూడా ఉదయభాను మెరిశారు. లీడర్ సినిమాలో ప్రత్యేక గీతంలో కూడా నటించారు. అలా బుల్లితెరపై చాలా కాలం పాటు  రారాణిగా ఓ వెలుగు వెలిగింది. పెళ్లి తర్వాత కెరీర్‏కు ఫుల్ స్టాప్ పెట్టింది ఉదయభాను. కెరీర్ మంచి పీక్స్ లో ఉన్నప్పుడే విజయ్ కుమార్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుని కొత్త లైఫ్ లోకి వెళ్లారు. వీరికి భూమి, ఆరాధ్య ఇద్దరు కవల పిల్లలు జన్మించారు. చాలా కాలం కెమెరాకు దూరంగా ఉన్న ఉదయభాను.. ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తుంది. మొత్తంగా ప్రస్తుతం ఉదయభాను చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Show comments