పిల్ల బచ్చాలు ఈ సినిమాకి రావద్దట.. హర్రర్ మూవీ వార్నింగ్!

పిల్ల బచ్చాలు ఈ సినిమాకి రావద్దట.. హర్రర్ మూవీ వార్నింగ్!

ప్రస్తుతం అనన్య నాగళ్ళ నటిస్తున్న చిత్రం "తంత్ర". అయితే ఇప్పటికే విడుదల ఈ చిత్రానికి సంబదించిన టీజర్ పై అంతటా ఆసక్తి నెలకొంది. అయితే, తాజాగా ఈ మూవీ కి సంబంధించిన మరో లేటెస్ట్ అప్ డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ప్రస్తుతం అనన్య నాగళ్ళ నటిస్తున్న చిత్రం "తంత్ర". అయితే ఇప్పటికే విడుదల ఈ చిత్రానికి సంబదించిన టీజర్ పై అంతటా ఆసక్తి నెలకొంది. అయితే, తాజాగా ఈ మూవీ కి సంబంధించిన మరో లేటెస్ట్ అప్ డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

మల్లేశం, మాస్ట్రో, శాకుంతలం, ఊర్వశివో రాక్షసివో లాంటి సినిమాలలో మెయిన్ లీడ్స్ లో నటించిన బ్యూటీ అనన్య నాగళ్ళ. మూవీస్ లో తనదైన నటనతో ప్రేక్షకుల నుంచి మంచి గుర్తింపును సంపాదించుకుంది. అలాగే, అటు సోషల్ మీడియాలోనూ నిత్యం తన ఫోటోలను షేర్ చేస్తూ.. యాక్టీవ్ గానే ఉంటుంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడికి ఉన్న ఫాలోయింగ్ కూడా కాస్త ఎక్కువే. ముఖ్యంగా తన అందంతో కుర్రకారు గుండెలను దోచుకుంది ఈ బ్యూటీ. అయితే, ఇప్పటివరకు సాఫ్ట్ క్యారెక్టర్స్ లో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు హర్రర్ చిత్రాల బాట పట్టింది. తాజాగా అనన్య నాగళ్ళ నటిస్తున్న చిత్రం “తంత్ర”. ఈ సినిమా టైటిల్ ను బట్టే చెప్పేయొచ్చు ఇదొక హర్రర్ ఫిల్మ్ అని. అయితే, తాజాగా ఈ సినిమా గురించి ఓ లేటెస్ట్ అప్ డేట్ సోషల్ మీడియాలో తెగ షికార్లు చేస్తుంది.

ఈ మధ్య కాలంలో హర్రర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ కు ఆదరణ బాగా పెరిగిపోతుంది. అయితే, ఈ క్రమంలో దాదాపు అందరు ఈ జోనర్ మూవీస్ ను చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మేకర్స్ కూడా ఈ సినిమాలను మరింత ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే అనన్య నాగళ్ల, ధనుష్ రఘుముద్రి లు జోడీగా నటిస్తున్న తాజా చిత్రం తంత్ర. అయితే, తాజాగా ఈ చిత్రానికి A సర్టిఫికెట్ రావడంతో .. ఈ మూవీ టీం దానిని సరికొత్త విధంగా.. పోస్ట్ చేసింది. “పిల్ల బచ్చాలు మా మూవీకి రావొద్దు ఎందుకంటే మాది A సినిమా” అంటూ .. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ను షేర్ చేసింది. దీనితో ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ తో ఈ సినిమాపై కాస్త ఇంట్రెస్ట్ కలిగిన వారికీ.. ఇక ఇప్పుడు మూవీ టీమ్ .. ఈ డిఫరెంట్ క్యాప్షన్ తో అందరిని మరింత ఆశ్చర్య పరిచింది. ఇక ఇప్పుడు ఈ పోస్టర్ ను చూసిన వారంతా రకరకాలుగా కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు.

అయితే, ఈ సినిమాను మార్చి 15న విడుదల చేసేందుకు డేట్ ఫిక్స్ చేశారు మూవీ టీమ్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ అండ్ టీజర్ తో ఈ సినిమాపై అందరికి ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. తాంత్రిక శాస్త్రంలో ఊహ‌కు అంద‌ని ఎన్నో ర‌హ‌స్యాలు ఉన్నాయని .. అలాగే ప‌ల్లెటూళ్ల‌లో క్షుద్ర‌పూజ‌లు, చేత‌బ‌డులు ఎలా ఉంటాయి అనే ధోరణిలో ఈ సినిమాను రూపొందించినట్లు తెలియాజేశారు. ఈ సినిమాకు డైరెక్టర్ గా శ్రీనివాస్ గోపిశెట్టి వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమా థియేటర్ లో విడుదలైన తర్వాత ఎటువంటి టాక్ ను సంపాదించుకుంటుందో వేచి చూడాలి. మరి, ఈ సినిమా అప్ డేట్ గురించి తాజాగా మేకర్స్ ప్రకటించిన తీరుపై .. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments