ఫైనల్లో ఓటమి.. కావ్య మారన్ ఎమోషనల్ అవ్వడంపై స్పందించిన బిగ్ బి! ఏమన్నాడంటే?

ఫైనల్లో ఓటమి.. కావ్య మారన్ ఎమోషనల్ అవ్వడంపై స్పందించిన బిగ్ బి! ఏమన్నాడంటే?

IPL 2024 ఫైనల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఓడిపోవడంతో.. ఆ టీమ్ ఓనర్ కావ్య మారన్ కన్నీరు కార్చుకున్న విషయం తెలిసిందే. ఇక ఆమె భావోద్వేగానికి గురి కావడంపై స్పందించాడు బాలీవుడ్ దిగ్గజ నటుడు బిగ్ బి. ఆ వివరాల్లోకి వెళితే..

IPL 2024 ఫైనల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఓడిపోవడంతో.. ఆ టీమ్ ఓనర్ కావ్య మారన్ కన్నీరు కార్చుకున్న విషయం తెలిసిందే. ఇక ఆమె భావోద్వేగానికి గురి కావడంపై స్పందించాడు బాలీవుడ్ దిగ్గజ నటుడు బిగ్ బి. ఆ వివరాల్లోకి వెళితే..

క్రికెట్ లవర్స్ ను ఉర్రూతలూగించిన ఐపీఎల్ 2024 మెగా టోర్నీ ముగిసిన విషయం తెలిసిందే. ఇక ఎంతో థ్రిల్లింగ్ గా సాగుతుంది అనుకున్న ఫైనల్ మ్యాచ్ చప్పగా సాగి అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఫైనల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఓడించి.. ముచ్చటగా మూడోసారి కప్ ను ఎగరేసుకుపోయింది కోల్ కత్తా నైట్ రైడర్స్. టైటిల్ పోరులో ఓడిపోవడంతో.. SRH ఓనర్ కావ్య మారన్ ఎమోషనల్ అయిన వీడియోస్, ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కావ్య ఎమోషనల్ అవ్వడంపై బాలీవుడ్ స్టార్, బిగ్ బి స్పందించాడు.

ఐపీఎల్ 2024 ఫైనల్లో కేకేఆర్ చేతిలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిపోవడంతో.. ఓనర్ కావ్య మారన్ తీవ్ర భావోద్వేగానికి లోనైయ్యింది. కన్నీరు కూడా కార్చింది. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింట వైరల్ కావడంతో.. సన్ రైజర్స్ ఫ్యాన్స్ బాధపడ్డారు. ఇంత అందమైన అమ్మాయి బాధపడుతుంటే చూడలేం అంటూ సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చారు.

ఈ క్రమంలోనే కావ్య మారన్ మ్యాచ్ అనంతరం ఎమోషనల్ అవ్వడంపై స్పందించాడు బాలీవుడ్ దిగ్గజం అబితాబ్ బచ్చన్. “ఐపీఎల్ ఫైనల్లో అత్యంత హార్ట్ టచ్చింగ్ సీన్ ఏదైనా ఉందంటే అది కావ్య మారన్ ఎమోషనల్ అవ్వడమే. అంత అందమైన అమ్మాయి కన్నీరు కార్చడం చూడలేకపోయాను. ఆమె తన బాధను కెమెరాలకు కనపడకుండా పక్కకు తిప్పుకోవడం బాధగా అనిపించింది. ఆమె ఇలా భావోద్వేగానికి గురికావడం నేను చూడలేకపోయాను” అంటూ చెప్పుకొచ్చాడు బిగ్ బి. కాగా.. కావ్య మారన్ బడా ప్రొడ్యూసర్ అయిన కళానిథి మారన్ కూతురు అన్న విషయం తెలిసిందే. దాంతో ఆమె తండ్రితో ఉన్న ఫ్రెండ్షిప్ వల్లనే కావ్య మారన్ భావోద్వేగానికి గురికావడం చూడలేకపోయాడు బిగ్ బి. మరి కావ్య కన్నీరు కార్చడం చూడలేకపోయాను అన్న బిగ్ బి కామెంట్స్ పై మీ అభిప్రాయాలను తెలియజేయండి.

Show comments