Kalki 2898 AD: కల్కి ప్రీ రిలీజ్ వేడుకకు ఊహించని గెస్ట్ లు.. ఫ్యాన్స్ కు పూనకాలే!

Kalki 2898 AD: కల్కి ప్రీ రిలీజ్ వేడుకకు ఊహించని గెస్ట్ లు.. ఫ్యాన్స్ కు పూనకాలే!

'కల్కి' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మూవీ మేకర్స్ ఊహించని గెస్ట్ లను తీసుకురాబోతున్నారని తెలుస్తోంది. ఆ ఇద్దరి స్టార్స్ ను ఒకే వేదికపై చూస్తే.. ఫ్యాన్స్ కు పూనకాలు రావడం పక్కా అంటున్నారు సినీ పండితులు. మరి ఆ ఇద్దరు స్టార్స్ ఎవరు? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

'కల్కి' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మూవీ మేకర్స్ ఊహించని గెస్ట్ లను తీసుకురాబోతున్నారని తెలుస్తోంది. ఆ ఇద్దరి స్టార్స్ ను ఒకే వేదికపై చూస్తే.. ఫ్యాన్స్ కు పూనకాలు రావడం పక్కా అంటున్నారు సినీ పండితులు. మరి ఆ ఇద్దరు స్టార్స్ ఎవరు? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. హాలీవుడ్ రేంజ్ లో విజువల్స్ ఉన్నాయని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు చూసినవారందరు. నాగ్ అశ్విన్ టేకింగ్ కు ఫిదా అయిపోతున్నారు. ఇక వరల్డ్ వైడ్ గా జూన్ 27న థియేటర్లపై దండయాత్ర చేయడానికి వస్తున్నాడు డార్లింగ్ ప్రభాస్. ఈ క్రమంలోనే మూవీ యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టింది. అందులో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీగా ప్లాన్ చేసింది. ఈ వేడుకకు ఇద్దరు బిగ్ స్టార్ రాబోతున్నట్లు తెలుస్తోంది. వారిద్దరిని ఒకే స్టేజ్ పై చేస్తే.. ఫ్యాన్స్ కు పూనకాలు రావడం పక్కా. ఇందులో ఏ మాత్రం డౌట్ లేదు.

రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్ది కల్కి టీమ్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచేసింది. విభిన్నంగా పబ్లిసిటీ చేస్తూ ప్రమోషన్స్ లో కొత్త ఒరవడిని సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు భారీ ఎత్తున నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. జూన్ 22 లేదా 23న ప్రి రిలీజ్ వేడుకను జరపాలని మూవీ మేకర్స్ భావిస్తున్నారు. అయితే ప్రీ రిలీజ్ ఎక్కడ నిర్వహించాలన్నదానిపై ఇంకా క్లారిటీ రాకపోవడంతో.. మూవీ టీమ్ ప్లేస్ ను ఫిక్స్ చేయనట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫంక్షన్ కు విశిష్ట అతిథులుగా బిగ్ బి అమితాబ్ బచ్చన్, సూపర్ స్టార్ రజినీకాంత్ లు వస్తారని సమాచారం. మూవీ టీమ్ కూడా ఈ ఇద్దరు దిగ్గజ నటులను వేడుకకు తీసుకురావాలని భావిస్తోంది.

ఇదే జరిగితే.. ఒకే స్టేజ్ పై బిగ్ బి, రజినీ కనిపిస్తే.. ఫ్యాన్స్ కు పూనకాలు రావడం పక్కా. చాలా అరుదైన సందర్భాల్లోనే రజినీ, బిగ్ బి ఫంక్షన్స్ కు హాజరవుతూ ఉంటారు. కల్కిలో ఎలాగో బిగ్ బి నటించాడు కాబట్టి ప్రీ రిలీజ్ కు వస్తాడన్న నమ్మకం ఉంది. ఇక బిగ్ బితో పాటుగా వైజయంతి మూవీస్ తో రజినీకి మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ కారణంగా సూపర్ స్టార్ ఈ ఫంక్షన్ కు హాజరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాంతో ఈ ఇద్దరు కలిసి వచ్చి ఒకే వేదికపై కనిపిస్తే.. అభిమానులకు కన్నుల పండుగ ఖాయం. ఈ సీన్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదీకాక బాలీవుడ్ లో సైతం ఓ వేడుకను జరిపేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి ఒకే వేదికపై బిగ్ బి-సూపర్ స్టార్ లను చూడాలని మీలో ఎంత మంది కోరుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments