T20 World Cup: పాక్‌పై దారుణమైన జోకులేసిన అమెరికా అధికారి! మరీ అలా అన్నాడేంటి?

T20 World Cup: పాక్‌పై దారుణమైన జోకులేసిన అమెరికా అధికారి! మరీ అలా అన్నాడేంటి?

Matthew Miller, Pakistan, PAK vs USA, T20 World Cup 2024: పాకిస్థాన్‌ క్రికెట్‌ టీమ్‌పై ఓ అమెరికన్‌ అధికారి.. దారుణమైన జోక్‌ వేసి పరువుతీశాడు. ఆ జోక్‌ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Matthew Miller, Pakistan, PAK vs USA, T20 World Cup 2024: పాకిస్థాన్‌ క్రికెట్‌ టీమ్‌పై ఓ అమెరికన్‌ అధికారి.. దారుణమైన జోక్‌ వేసి పరువుతీశాడు. ఆ జోక్‌ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో బాబర్‌ ఆజమ్‌ కెప్టెన్సీలోని పాకిస్థాన్‌ క్రికెట్‌ టీమ్‌ ఎలాంటి చెత్త ప్రదర్శన కనబరుస్తుందో క్రికెట్‌ అభిమానులు చూస్తూనే ఉన్నారు. ఇండియాపై ఓటమి పాలైన పాక్‌.. అంతకంటే ముందు పసికూన యూఎస్‌ఏపై కూడా ఓటమి పాలైన విషయం తెలిసిందే. చావుతప్పి కన్నులొట్టబోయినట్టు.. కెనడాపై గెలిచి.. ప్రస్తుతానికి సూపర్‌ 8 రేసులో ఉంది. యూఎస్‌ఏ జట్టు.. ఐర్లాండ్‌పై గెలిస్తే.. గ్రూప్‌ దశలోనే పాకిస్థాన్‌ ఇంటి బాటపడుతుంది. అయితే.. క్రికెట్‌లో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న అమెరికాపై కూడా పాకిస్థాన్‌ ఓడిపోవడంపై ఓ అమెరికన్‌ అధికారి.. పాకిస్థాన్‌పై జోకులు వేశారు. ప్రస్తుతం ఆయన చెప్పిన మాటలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. పాక్‌ను అంత మాట అనేశాడేంటి భయ్యా అంటూ భారత క్రికెట్‌ అభిమానులు కూడా నవ్వు కుంటున్నారు.

అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ ఓటమి పాలైన తర్వాత.. కొత్తగా క్రికెట్‌ ఆడుతున్న అమెరికా.. మాజీ ఛాంపియన్‌ను టీ20 వరల్డ్‌ కప్‌లో ఓడించింది కదా.. దీనిపై మీ స్పందన ఏంటి అని ఓ జర్నలిస్ట్‌ అమెరికా ప్రభుత్వ అధికార మాథ్యూ మిల్లర్‌ను పశ్నించాడు. దీనికి ఆయన బదులిస్తూ.. నాకు క్రికెట్‌ గురించి పెద్దగా తెలియదు.. బహుషా పాకిస్థాన్ కూడా అదే కోవకు చెందిన జట్టు అయి ఉంటుందని అంటూ ఒక్క మాటతో పాక్‌ పరువుతీశాడు. అంటే.. పాకిస్థాన్‌కు క్రికెట్‌ గురించి పెద్దగా తెలియదు, రాదు అనే అర్థంలో ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు.

అమెరికా, వెస్టిండీస్‌ సంయుక్త వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో గ‌త వారం యూఎస్‌ఏ.. పాకిస్థాన్‌కు ఊహించని షాక్ ఇచ్చింది. మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌ వరకు వెళ్లినా బాబర్‌ సేన గెలవలేకపోయింది. సూప‌ర్ ఓవ‌ర్‌లో అమెరికా అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. నేత్రావ‌ల్క‌ర్ సూపర్‌ బౌలింగ్‌తో అమెరికాను గెలిపించాడు. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 20 ఓవ‌ర్ల‌లో 159 ర‌న్స్ చేసింది. మ్యాచ్ టై కావ‌డంతో.. సూప‌ర్ ఓవ‌ర్‌కు వెళ్లింది. తొలుత సూప‌ర్ ఓవ‌ర్‌లో అమెరికా 18 ర‌న్స్ చేయ‌గా, పాక్‌ కేవ‌లం 13 ర‌న్స్ చేసి ఓటమి పాలైంది. మరి పాక్‌ ఓటమిపై అమెరికా అధికారి మిల్లర్‌ వేసిన జోక్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments