Ambati Rayudu Trolling RCB After Loosing: RCBపై రాయుడు వరుస ట్రోల్స్.. ఈ పగకు కారణం కోహ్లీనా?

RCBపై రాయుడు వరుస ట్రోల్స్.. ఈ పగకు కారణం కోహ్లీనా?

Ambati Rayudu Teasing RCB After Loosing: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మీద అంబటి రాయుడు ట్రోలింగ్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఏదో ఒక రకంగా ఆర్సీబీని కామెంట్ చేస్తూనే ఉన్నాడు. తాజాగా మరో వీడియోతో ఆర్సీబీని ట్రోల్ చేశాడు.

Ambati Rayudu Teasing RCB After Loosing: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మీద అంబటి రాయుడు ట్రోలింగ్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఏదో ఒక రకంగా ఆర్సీబీని కామెంట్ చేస్తూనే ఉన్నాడు. తాజాగా మరో వీడియోతో ఆర్సీబీని ట్రోల్ చేశాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోరాటం ముగిసింది. వరుస విజయాలు తర్వాత కీలక పోరులో ఆర్సీబీ జట్టు తడబడింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఆర్సీబీ మీద రాజస్థాన్ రాయల్ జట్టు ఏకంగా ఓవర్ మిగిలి ఉండగానే 4 వికెట్ల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. ఈ విజయంతో రాజస్థాన్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో రెండో క్వాలిఫయర్ మ్యాచ్ ఆడనుంది. ఓవరాల్ గా ఈ ఐపీఎల్ సీజన్ లో తాజాగా ఆర్సీబీ ప్రదర్శనపై అంబటి రాయుడు వరుసగా ట్రోల్స్, సెటైర్స్ వేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఆర్సీబీపై పరోక్షంగా రాయుడు జోకులు వేశాడు. అయితే ఈ కోపం దేనికి అనే ప్రశ్న బాగా వినిపిస్తోంది. ఇందుకు కారణం 2019 వరల్డ్ కప్ అంటున్నారు.

సాధారణంగా మనిషి అనే వాడు ఎవరూ కూడా రాగ ద్వేషాలకు, కోపతాపాలకు అతీతులు అనడానికి లేదు. ఎప్పుడో మీ విషయంలో జరిగిన ఒక సంఘటనను మనసులో పెట్టుకుని మీరు ఇంకో సందర్భంలో దానికి కారణం అయిన వారిపై ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో అక్కసు వెళ్లగక్కే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి ఒక ఫేజ్ లోనే ఇప్పుడు ఈ టీమిండియా మాజీ ఆటగాడు ఉన్నాడు అని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు రాయుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మీదు చూపిస్తున్న ఈ కోపం.. ఐపీఎల్ లో చెన్నైని ఓడించారని కాదు.. గతంలో రాయుడు విషయంలో కోహ్లీ చేసిన పనికి ఇలా ఆర్సీబీ మీద పగ తీర్చుకుంటున్నాడు అంటున్నారు.

అదేంటి? కోహ్లీ చేసిన పనికి ఎందుకు ఆర్సీబీని ట్రోల్ చేస్తున్నాడు అని కాస్త తికమక పడకండి. 2019 వరల్డ్ కప్ తుది జట్టులో అంబటి రాయుడికి చోటు దక్కలేదు. ఆ సమయంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అని అందరికీ తెలిసిందే. తనకు చోటు దక్కలేదని అంబటి రాయుడు ఆ సమయంలో చాలానే రచ్చ చేశాడు. వరుస ట్వీట్లతో తన అసహనాన్ని అందరికీ తెలిసేలా చేశాడు. అప్పట్లో అంబటి రాయుడు చేసిన త్రీడీ గ్లాసెస్ ట్వీట్ ఎంత దుమారం రేపిందో అందరికీ తెలిసు. అయితే అప్పటి పగను ఇంకా రాయుడు మనసులో ఉంచుకున్నాడు అంటున్నారు. అంబటి రాయుడుకి ఆ రోజు వరల్డ్ కప్ లో చోటు దక్కలేదు. ఆ సమయంలో కెప్టెన్ గా ఉన్న విరాట్ కోహ్లీ తన తరఫున నిలబడలేదని రాయుడు మనసులో పెట్టుకున్నాడు అని టాక్ ఉంది.

రాయుడు మనసులో ఆ విషయాలు ఉండబట్టే ఇప్పుడు ఆర్సీబీని ట్రోల్ చేస్తున్నట్లు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వరల్డ్ కప్ కి ఇప్పటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రదర్శనకు ఏంటి సంబంధం అని అనుకోకండి. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అయినా కూడా.. రాయల్ ఛాలెంజర్స్ ఫేస్ మాత్రం విరాట్ కోహ్లీ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ఇప్పుడు రాయుడు ఇలా ట్రోల్ చేస్తున్నాడంట. మొన్న చెన్నై లేదు కాబట్టే ఆర్సీబీ గెలుస్తుంది అన్నాడు. ఆర్సీబీ ఓడిన తర్వాత కప్పు కొట్టేది సౌత్ జట్టే.. కాకపోతే ఆర్సీబీ కాదు- హైదరాబాద్ అంటూ చెప్పుకొచ్చాడు. తాజాగా స్మాల్ రిమైండర్ అంటూ చెన్నై 5 సార్లు టైటిల్ కొట్టింది అని చిన్న వీడియో పోస్ట్ చేశాడు. ఇలా వరుస పోస్టులతో అంబటి రాయుడు తన అక్కసును బాగానే తీర్చుకుంటున్నాడు.

Show comments