ఓటీటీలో తగ్గని డంకీ జోరు

ఓటీటీలో తగ్గని డంకీ జోరు

ఫిబ్రవరి 15, 2024న నెట్ ఫ్లిక్స్ లో డంకీ విడుదలైంది. ఓటీటీ రిలీజ్ లో మాత్రం ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన తెచ్చుకుంటుంది. థియేటర్లలో దక్కని విజయం డిజిటల్ ప్లాట్ ఫారంలో అయినా దక్కినందుకు షారుఖ్ ఖాన్ అభిమానులు ఆనందిస్తున్నారు.

ఫిబ్రవరి 15, 2024న నెట్ ఫ్లిక్స్ లో డంకీ విడుదలైంది. ఓటీటీ రిలీజ్ లో మాత్రం ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన తెచ్చుకుంటుంది. థియేటర్లలో దక్కని విజయం డిజిటల్ ప్లాట్ ఫారంలో అయినా దక్కినందుకు షారుఖ్ ఖాన్ అభిమానులు ఆనందిస్తున్నారు.

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్, ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం ‘డంకీ’. ఈ చిత్రం డిసెంబర్ 21, 2023న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల అయింది. అయితే ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ వద్ద బిలో యావరేజ్ గా నిలిచింది. కానీ చిత్రంగా ఓటీటీ రిలీజ్ లో మాత్రం ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన తెచ్చుకుంటుంది. థియేటర్లలో దక్కని విజయం డిజిటల్ ప్లాట్ ఫారంలో అయినా దక్కినందుకు షారుఖ్ ఖాన్ అభిమానులు ఆనందిస్తున్నారు.

డంకీ సినిమాలో ప్రేయసి కోసం, స్నేహితుల కోసం అడ్డదారిలో అయినా సరే ఇంగ్లాండ్ వెళ్లేందుకు ప్రయత్నించే మాజీ మిలిటరీ అధికారి పాత్రలో షారుఖ్ ఖాన్ నటించారు. కాగా సినిమాలోని సెకండాఫ్ ప్రేక్షకులకు థియేటర్ లో నచ్చకపోయినా… ఓటీటీ ప్రేక్షకులు డంకీ రూట్ లో ఫారిన్ వెళ్ళే భారతీయుల కష్టాలకు కనెక్ట్ అయ్యారు. అలాగే ప్రీతమ్ అందించిన పాటల్లో ఎమోషనల్ సాంగ్స్ కూడా బాగా నచ్చాయి. అందుకే ఈ ఎమోషనల్ డ్రామా ఓటీటీ రిలీజ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఒక పక్క రణబీర్ కపూర్ – సందీప్ రెడ్డి వంగాల యానిమల్, ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన సలార్ వంటి సినిమాలతో పోటీ ఉన్నా కూడా షారుఖ్ ఖాన్ తన స్టామినా ఏమిటో డంకీ ఓటీటీ రిలీజ్ ద్వారా చూపించారు.

ఫిబ్రవరి 15, 2024న నెట్ ఫ్లిక్స్ లో డంకీ విడుదలైంది. షారుఖ్ సరసన తాప్సీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా వరుసగా రెండో వారం నెట్ ఫ్లిక్స్ గ్లోబల్ టాప్ 10 ఛార్టులో స్థానం నిలుపుకుని తన అద్భుతమైన ప్రదర్శనను కొనసాగిస్తోంది. 2024 ఫిబ్రవరి 19 నుంచి 25 వరకు నాన్ ఇంగ్లిష్ కేటగిరీలో 4.2 మిలియన్ వ్యూస్ సాధించి 5వ స్థానం నుంచి 3వ స్థానానికి చేరుకుంది. ఓటీటీ ఫీల్డులో ఈ చిత్రం సాధించిన అసాధారణ విజయానికి ఇదొక నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

Show comments