బన్నీ – త్రివిక్రమ్ ల నాలుగో మూవీ! అఫీషీయల్ అప్డేట్ వచ్చేసిందోచ్..

బన్నీ – త్రివిక్రమ్ ల నాలుగో మూవీ! అఫీషీయల్ అప్డేట్ వచ్చేసిందోచ్..

  • Author Soma Sekhar Published - 11:01 AM, Mon - 3 July 23
  • Author Soma Sekhar Published - 11:01 AM, Mon - 3 July 23
బన్నీ – త్రివిక్రమ్ ల నాలుగో మూవీ! అఫీషీయల్ అప్డేట్ వచ్చేసిందోచ్..

ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ కి ఉండే క్రేజ్ వేరు. అలాంటి క్రేజీ కాంబినేషన్స్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ముందుంటారు. ఇదివరకే వీరి కాంబోలో జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో సినిమాలు తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాలు సాధించాయి. దీంతో బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో మరో సినిమా వస్తే బాగుంటుందని అభిమానులు ఎదురు చూస్తుండగా.. ఫుల్ మీల్స్ లాంటి న్యూస్ చెప్పారు. అవును.. బన్నీ – త్రివిక్రమ్ కలిసి నాలుగో సినిమాతో అలరించేందుకు రెడీ అయిపోయారు. ఎంతో ఎగ్సైట్ మెంట్ తో వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి లేటెస్ట్ అప్డేట్ ఇచ్చేశారు.

అల్లు అర్జున్, త్రివిక్రమ్ మూవీ అనగానే అందరికి వారి హిట్ ట్రాక్ గుర్తొస్తుంది. దీంతో నాలుగో సినిమా కూడా ఆ కోవలోనే విజయం సాధించే అవకాశం ఉందని.. చెప్పకనే చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం బన్నీ తన పాన్ ఇండియా మూవీ పుష్ప 2 తో బిజీగా ఉండగా.. మరోవైపు దర్శకుడు త్రివిక్రమ్.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘గుంటూరు కారం’ మూవీ తెరకెక్కిస్తున్నాడు. ప్రెజెంట్ చేస్తున్న సినిమాలు రిలీజ్ కాకముందే వీరి కాంబినేషన్ లో నాలుగో మూవీ అనౌన్స్ మెంట్ వచ్చేసరికి ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఇక ఈసారి కొత్త సినిమాని ఇదివరకు చేసిన సినిమాలకంటే గ్రాండ్ గా, భారీ బడ్జెట్ తో చేయనున్నట్లు లేటెస్ట్ అప్డేట్ బట్టి తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. బన్నీ – త్రివిక్రమ్ ల కొత్త సినిమాకు సంబంధించి అప్ డేట్ అయితే వచ్చింది. కానీ.. హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్, ఇతర టెక్నీషియన్స్ ఎవరు అనే వివరాలు మాత్రం బయట పెట్టలేదు. అంతేగాక ఈసారి ఈ మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తో పాటు గీతా ఆర్ట్స్ కూడా సంయుక్తంగా నిర్మిస్తుండటం విశేషం. మరి త్రివిక్రమ్ సినిమా అంటేనే ముందుగా హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ గురించి చర్చలు మొదలైపోతాయి. అలాగే ఈ కొత్త సినిమా విషయంలో కూడా కొన్ని పేర్లు గట్టిగానే వినిపిస్తున్నాయి. చూడాలి మరి బన్నీ సరసన ఏ హీరోయిన్ ఆడిపాడనుందో! మరి బన్నీ – త్రివిక్రమ్ ల కొత్త సినిమా అప్ డేట్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

Show comments