ఒకప్పుడు సోలో హీరోగా కామెడీ సినిమాలతో అల్లరి నరేష్ కు తనకంటూ ఒక ప్రత్యేక మార్కెట్ ఉండేది. సుడిగాడు టైంలో రెండు మూడు వారాల పాటు థియేటర్ల వద్ద హౌస్ ఫుల్ బోర్డులు పెట్టించేంతగా వసూళ్లు వచ్చేవి. హాయిగా నవ్వుకోవడానికి తన చిత్రాలే బెస్ట్ ఆప్షన్ గా నిలిచేవి. అయితే అదంతా గతం. మూసలో పడిపోయి ఒకేరకమైన కథలకు అలవాటు పడిన అల్లరి నరేష్ ను వరస పరాజయాలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. అందుకే గత ఏడాది మహేష్ బాబు మహర్షిలో సపోర్టింగ్ రోల్ ఒప్పుకుని మరీ మెప్పించాల్సి వచ్చింది. అలా అని తనతో సింగల్ గా నిర్మాతలు సినిమాలు తీయడం లేదని కాదు.
తన రియల్ పొటెన్షియల్ ని చూపించడానికి ప్రస్తుతం నాంది చేస్తున్న సంగతి తెలిసిందే. కొంత భాగం మాత్రమే షూటింగ్ బ్యాలన్స్ ఉన్న నాందిలో ఓ సన్నివేశం కోసం నగ్నంగా నటించేందుకు కూడా వెనుకాడలేదు నరేష్. ఇది కాకుండా బంగారు బుల్లోడు కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. టీజర్ రిలీజ్ చేసి చాలా రోజులయ్యింది. థియేటర్లో వదులుతారా లేక జై ఓటిటి అంటారా ఇంకా తెలియాల్సి ఉంది. తాజాగా అల్లరి నరేష్ ని బోయపాటి శీను బాలకృష్ణ కాంబోలో రూపొందుతున్న మూవీ కోసం అడిగారట. అయితే తను ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. అల్లరి నరేష్ ఫ్యాన్స్ ఇక్కడ కొంచెం టెన్షన్ పడొచ్చు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ తో బోయపాటి శీను హీరో వేణుతో బావ క్యారెక్టర్ వేయించాడు.
అది కథ ప్రకారం చనిపోతుంది కూడా. అయితే అది వేణుకు ఎంత మాత్రం ఉపయోగపడలేదు సరికదా ఆయన మళ్ళీ తెరమీద కనిపించనేలేదు.అల్లరి నరేష్ కూ అలా అవుతుందేమోనని వాళ్ళ భయం. నిజానికి ఈ పాత్రను నవీన్ చంద్రను అనుకున్నట్టుగా గతంలోనే టాక్ వచ్చింది. ఎందుకో ఆ తర్వాత మళ్ళీ ఎలాంటి అప్ డేట్ లేదు. ఇప్పుడు అల్లరి నరేష్ నిజంగా ఇందులో ఉంటాడో లేదో అధికారిక ప్రకటన వస్తే కానీ చెప్పలేం. లాక్ డౌన్ వల్ల షూటింగ్ ఆగిపోయిన ఈ సినిమాను వచ్చే నెల నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. చిన్న టీజర్ తోనే అభిమానుల్లో భారీ అంచనాలు రేకెత్తించిన ఈ మూవీకి టైటిల్ డిసైడ్ చేయలేదు. మోనార్క్, డేంజర్ అని ఏవేవో పేర్లు ప్రచారంలో ఉన్నాయి కాని త్వరలో ప్రకటిస్తారు
ప్రముఖ నటి అనసూయ గురించి అందరికీ తెలిసిందే. యాంకర్‌గా కెరీర్‌ను ఆరంభించిన ఆమె గ్లామర్ క్వీన్‌గా పేరు సంపాదించారు. బుల్లితెరపై హుషారైన యాంకరింగ్, అదిరిపోయే అందంతో క్రేజ్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత సినిమా అవకాశాలు రావడంతో వెండితెర దిశగా తన ప్రయాణాన్ని మార్చుకున్నారు. ఈ క్రమంలో నటించిన ‘రంగస్థలం’, ‘పుష్ప’తో టాలీవుడ్లో అనసూయ తన ప్లేస్‌ను ఫిక్స్ చేసుకున్నారు. ముఖ్యంగా ‘రంగస్థలం’లో రంగమ్మ పాత్రలో ఆమె ఒదిగిపోయిన విధానం, పలికించిన హావభావాలకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. వరుసగా […]