పాండ్య బౌలింగ్ లో 3 సిక్స్ లు కొట్టిన తర్వాత ధోని చూడండి ఏం చేశాడో?

పాండ్య బౌలింగ్ లో 3 సిక్స్ లు కొట్టిన తర్వాత ధోని చూడండి ఏం చేశాడో?

MS Dhoni, CSK vs MI, IPL 2024: హార్దిక్‌ పాండ్యా ఓవర్‌లో వరుసగా మూడు సిక్సులు కొట్టిన తర్వాత.. ధోని చేసిన ఒక పని ప్రస్తుతం క్రికెట్‌ అభిమానుల మనుసు దోచుకుంది. మరి అదేంటో ఇప్పుడు చూద్దాం..

MS Dhoni, CSK vs MI, IPL 2024: హార్దిక్‌ పాండ్యా ఓవర్‌లో వరుసగా మూడు సిక్సులు కొట్టిన తర్వాత.. ధోని చేసిన ఒక పని ప్రస్తుతం క్రికెట్‌ అభిమానుల మనుసు దోచుకుంది. మరి అదేంటో ఇప్పుడు చూద్దాం..

ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఘన విజయం సాధించింది. ఆదివారం ముంబైలోని వాంఖడే క్రికెట్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే సూపర్‌ బ్యాటింగ్‌, బౌలింగ్‌తో 20 పరుగుల తేడాతో ముంబైని మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని.. చివర్లో విధ్వంసం సృష్టించాడు. తన బ్యాటింగ్‌ కోసం ఎదరుచూస్తున్న క్రికెట్‌ అభిమానులకు అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చాడు ఎంఎస్‌డీ. సీఎస్‌కే ఇన్నింగ్స్‌లో కేవలం నాలుగు బంతులు మిగిలి ఉన్న సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోని.. చివరి నాలుగు బంతుల్లో వరుసగా మూడు సిక్సులు, ఒక డబుల్‌తో 4 బంతుల్లోనే 20 పరుగులు సాధించాడు. ఇదే సీఎస్‌కే, ముంబైకి తేడాగా నిలిచింది.

ముంబై ఇండియన్స్‌ కూడా 20 పరుగుల తేడాతోనే ఓడిపోయింది. చివర్లో ధోని అలాంటి మెరుపు ఇన్నింగ్స్‌ ఆడకపోయి ఉంటే.. ఫలితం మరోలో ఉండేదని క్రికెట్‌ పండితులు సైతం అభిప్రాయపడుతున్నారు. అయితే.. ఈ మ్యాచ్‌లో మూడు వరుస సిక్సుల తర్వాత ధోని చేసిన ఓ పనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాను కొట్టిన మూడు సిక్సుల బాల్‌ను ధోని ఓ యువ అభిమానికి గిఫ్ట్‌గా ఇచ్చాడు. తాను బ్యాటింగ్‌కి వస్తున్న సమయంలో తనను ఎంకరేజ్‌ చేసిన ఆ లిటిల్‌ ఫ్యాన్‌కు ఇన్నింగ్స్‌ ముగిసిన తర్వాత.. ధోని బాల్‌ను గిఫ్ట్‌గా ఇచ్చి.. ఆ చిన్నారి ఫ్యాన్‌ను సంతోషపరిచాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ 40 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సులతో 69 రన్స్‌తో అదరగొట్టాడు. శివమ్‌ దూబే 38 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సులతో 68 రన్స్‌, ధోని 4 బంతుల్లో 3 సిక్సులతో 20 పరుగులు చేసి రాణించారు. ముంబై బౌలర్లలో కెప్టెన్‌ పాండ్యా 2 వికెట్లతో రాణించాడు. ఇక 207 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ముంబై.. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 186 పరుగులు మాత్రమే చేసి 20 రన్స్‌ తేడాతో ఓటమి పాలైంది. రోహిత్‌ శర్మ సెంచరీ చేసిన ముంబైని గెలిపించలేకపోయాడు. 63 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సులతో 105 పరుగులు చేశాడు. సీఎస్‌కే బౌలర్లలో మతీష పతిరాణా 4 వికెట్లతో అదరగొట్టాడు. మరి ఈ మ్యాచ్‌లో ధోని 3 సిక్సులతో పాటు లిటిల్‌ ఫ్యాన్‌కు బాల్‌ గిఫ్ట్‌ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments