Afghanistan Team Success Ajay Jadeja Help: ఆఫ్ఘాన్​కు అజయ్ జడేజా సాయం.. ఆ పనేంటో తెలిస్తే మెచ్చుకోకుండా ఉండలేరు!

ఆఫ్ఘాన్​కు అజయ్ జడేజా సాయం.. ఆ పనేంటో తెలిస్తే మెచ్చుకోకుండా ఉండలేరు!

టీ20 ప్రపంచ కప్-2024లో ఆఫ్ఘానిస్థాన్ జట్టు అద్భుతంగా ఆడుతోంది. బ్యాక్ టు బ్యాక్ విక్టరీస్​తో సూపర్-8కు క్వాలిఫై అయింది. ఇదే జోరులో నాకౌట్​కు చేరుకోవాలని చూస్తోంది.

టీ20 ప్రపంచ కప్-2024లో ఆఫ్ఘానిస్థాన్ జట్టు అద్భుతంగా ఆడుతోంది. బ్యాక్ టు బ్యాక్ విక్టరీస్​తో సూపర్-8కు క్వాలిఫై అయింది. ఇదే జోరులో నాకౌట్​కు చేరుకోవాలని చూస్తోంది.

ఆఫ్ఘానిస్థాన్.. కొన్నాళ్ల కింద వరకు ఆ జట్టును అంతా పసికూనగానే చూసేవారు. అడపాదడపా ఐసీసీ టోర్నీల్లో మెరవడం తప్పితే ఆ టీమ్ పెద్దగా విజయాలు సాధించేది కాదు. చిన్న జట్టు కావడంతో ఆఫ్ఘాన్​తో బడా టీమ్స్ మ్యాచ్​లు కూడా ఆడేవి కాదు. పెద్ద టోర్నీల్లో ఆ టీమ్ ఎదురొస్తే లైట్ తీసుకునేవారు. కానీ పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఆఫ్ఘాన్ డేంజరస్ టీమ్​గా తయారైంది. రషీద్ ఖాన్ లాంటి స్టార్ ప్లేయర్లతో నిండిన ఈ ఆసియా టీమ్​తో పెట్టుకోవాలంటే పెద్ద జట్లు కూడా భయపడుతున్నాయి. నిరుడు భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్​లో ఇంగ్లండ్, పాకిస్థాన్, శ్రీలంక లాంటి హేమాహేమీల్ని మట్టికరిపించింది. ఫేవరెట్ ఆస్ట్రేలియాను కూడా ఓడించినంత పని చేసింది. ఆ టీమ్ మీద గెలిస్తే ఎంచక్కా సెమీస్​కు చేరుకునేది. కానీ ఓటమితో నిష్క్రమించింది.

వన్డే వరల్డ్ కప్​ ఆటనే టీ20 ప్రపంచ కప్-2024లోనూ కొనసాగిస్తోంది ఆఫ్ఘానిస్థాన్. మెగా టోర్నీలో రషీద్ సేన అద్భుతంగా ఆడుతోంది. బ్యాక్ టు బ్యాక్ విక్టరీస్​తో సూపర్-8కు క్వాలిఫై అయింది. న్యూజిలాండ్ లాంటి పటిష్టమైన జట్టును చిత్తు చేసిన ఆఫ్ఘాన్.. ఇదే జోరులో మిగతా బడా టీమ్స్​కు కూడా షాకిచ్చి నాకౌట్​కు చేరుకోవాలని చూస్తోంది. అయితే ఆ జట్టు విజయంలో కోచ్ జొనాథన్ ట్రాట్​తో పాటు ఇంకొందరి సహకారం కూడా ఉంది. ఓడీఐ ప్రపంచ కప్​లో ఆ జట్టు సక్సెస్​లో భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజా పాత్ర ఎంతో కీలకం. మెంటార్​గా ఉంటూ ఆ టీమ్ బ్యాటర్ల టెక్నిక్​ను మెరుగుపర్చాడు జడేజా. భారత గడ్డపై ఎలా ఆడాలో నేర్పించాడు. బడా టీమ్స్​ను ఓడించే కిటుకు ఏంటో చెప్పాడు. దాన్నే ఫాలో అవుతూ ఇప్పుడు పొట్టి కప్పులోనూ ఆఫ్ఘాన్ జోరు చూపిస్తోంది.

ఆఫ్ఘాన్ సక్సెస్​లో అజయ్ జడేజా చేసిన హెల్ప్ ఎంతో ముఖ్యమనే చెప్పాలి. అయితే వన్డే వరల్డ్ కప్ టైమ్​లో మెంటార్​గా ఉన్నందుకు అతడికి భారీ మొత్తాన్ని ముట్టజెప్పారని వార్తలు వచ్చాయి. కానీ తాజాగా అసలు విషయం బయటపడింది. ఆఫ్ఘాన్ కోసం జడేజా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పని చేశాడట. ఈ విషయాన్ని స్వయంగా ఆఫ్ఘాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) తెలిపింది. వన్డే ప్రపంచ కప్-2023లో తమ టీమ్​తో ట్రావెల్ అయినందుకు డబ్బులు ఇస్తామని చెప్పినా.. జడేజా తిరస్కరించాడని ఏసీబీ పేర్కొంది. జట్టు బాగా ఆడి విజయాలు సాధిస్తే అదే సంతోషమని, దాని కంటే పెద్ద రివార్డు ఇంకొకటి లేదని అజయ్ జడేజా తమతో చెప్పాడని ఆఫ్ఘాన్ బోర్డు వివరించింది. దీంతో అందరూ జడేజాను మెచ్చుకుంటున్నారు. విదేశీ జట్టు కోసం రూపాయి కూడా తీసుకోకుండా సేవలు అందించాడంటే, క్రికెట్​ మీద అతడికి ఉన్న మమకారం ఎలాంటిదో తెలుస్తోందని అంటున్నారు. మరి.. అజయ్ జడేజా చేసిన పనిపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments