Hyd Company In Adani Hand: హైదరాబాద్‌పై అదానీ ఫోకస్.. 10 వేల కోట్లతో ఆ కంపెనీ కొనుగోలు!

హైదరాబాద్‌పై అదానీ ఫోకస్.. 10 వేల కోట్లతో ఆ కంపెనీ కొనుగోలు!

Hyd Company In Adani Hand: ప్రముఖ బిజినెస్ మేన్, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ కన్ను ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీపై పడింది. తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకునేందుకు హైదరాబాద్ కి చెందిన ప్రముఖ కంపెనీని కొనేందుకు సిద్ధమయ్యారు.

Hyd Company In Adani Hand: ప్రముఖ బిజినెస్ మేన్, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ కన్ను ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీపై పడింది. తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకునేందుకు హైదరాబాద్ కి చెందిన ప్రముఖ కంపెనీని కొనేందుకు సిద్ధమయ్యారు.

ప్రముఖ వ్యాపారవేత్త, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ హైదరాబాద్ లో ఉన్న ప్రముఖ కంపెనీని కొనుగోలు చేశారు. తన సిమెంట్ వ్యాపారాన్ని విస్తరించేందుకు హైదరాబాద్ కి చెందిన కంపెనీని కొనుగోలు చేశారు. హైదరాబాద్ లో కార్యకలాపాలు సాగిస్తున్న పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ ని అదానీ గ్రూప్ కి చెందిన అంబుజా సిమెంట్స్ 10,422 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసింది. పెన్నా సిమెంట్ ఇండస్ట్రీలో వంద శాతం వాటా కొనేందుకు ఆ సంస్థ ప్రమోటర్ పి. ప్రతాప్ రెడ్డి మరియు అతని కుటుంబ సభ్యులతో ఒప్పందం కుదుర్చుకున్నామని అదానీ గ్రూప్ కి చెందిన అంబుజా సిమెంట్స్ వెల్లడించింది. పెన్నా సిమెంట్ ని పూర్తిగా సొంత నిధులతోనే కొనుగోలు చేస్తున్నట్లు అంబుజా సిమెంట్స్ సీఈఓ అజయ్ కపూర్ తెలిపారు. ఈ కీలక మార్పుతో దేశంలో అన్ని ప్రాంతాల మార్కెట్లలో అంబుజా సిమెంట్స్ ఉన్నట్లు అవుతుందని అన్నారు. ఈ కొనుగోలుతో అంబుజా సిమెంట్స్ ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి 14 మిలియన్ టన్నులు దక్కుతుంది.

దీంతో అదానీ గ్రూప్ సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యం 89 మిలియన్ టన్నులకు చేరుకుంటుంది. దీంతో అదానీ గ్రూప్ దేశంలోనే రెండో అతిపెద్ద సిమెంట్ తయారీ సంస్థగా ఎదగనుంది అంబుజా సిమెంట్స్ కంపెనీ. సౌత్ ఇండియాలోనే కాక శ్రీలంకలో కూడా కూడా అదానీ గ్రూప్ తన మార్కెట్ వాటాను పెంచుకునే అవకాశం దక్కింది. ఎందుకంటే పెన్నా సిమెంట్ కి శ్రీలంకలో ఒక అనుబంధ కంపెనీ ఉంది. పెన్నా సిమెంట్ కి చెందిన సున్నపురాయి గనులు కూడా అంబుజా సిమెంట్స్ కంపెనీకే దక్కనున్నాయి. 2028 నాటికి అదానీ గ్రూప్ సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 140 మిలియన్ టన్నులకు పెంచాలన్న లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు.

దేశీయ సిమెంట్ మార్కెట్లో అదానీ గ్రూప్ కి చెందిన అంబుజా సిమెంట్స్ కంపెనీ మార్కెట్ వాటాను 20 శాతానికి పెంచాలన్న లక్ష్యంతో అదానీ గ్రూప్ ఉంది. దీని కోసం సొంతంగా కొత్త యూనిట్లను నిర్మిస్తుంది. వీటితో పాటు ఇతర సిమెంట్ కంపెనీలను కూడా అదానీ గ్రూప్ కొనుగోలు చేస్తుంది. 2023 డిసెంబర్ లో గుజరాత్ కి చెందిన సంఘీ ఇండస్ట్రీస్ ని అదానీ గ్రూప్ 5,185 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఇప్పటికే అదానీ గ్రూప్ కింద ఏసీసీ లిమిటెడ్, అంబుజా సిమెంట్స్, సంఘీ ఇండస్ట్రీస్ ఉండగా.. తాజాగా పెన్నా సిమెంట్ కూడా తోడవుతుంది. ప్రస్తుతం మన దేశంలో అల్ట్రాటెక్ సిమెంట్.. ఏడాదికి 152 మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి చేస్తూ అతిపెద్ద కంపెనీగా ఉంది. ఆ తర్వాత అదానీ గ్రూప్ 89 మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యంతో దేశంలో రెండవ స్థానానికి చేరుకోనుంది.     

Show comments