సీనియర్‌ భామ బోల్డ్‌ కామెంట్స్‌.. రొమాన్స్‌కి వయసుతో పని లేదట!

సీనియర్‌ భామ బోల్డ్‌ కామెంట్స్‌.. రొమాన్స్‌కి వయసుతో పని లేదట!

ఓ సీనియర్ హీరోయిన్ రొమాన్స్ కు వయసుతో సంబంధం లేదు అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది. మరి ఆ సీనియర్ హీరోయిన్ ఎవరు? ఆ వివరాలు చూద్దాం.

ఓ సీనియర్ హీరోయిన్ రొమాన్స్ కు వయసుతో సంబంధం లేదు అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది. మరి ఆ సీనియర్ హీరోయిన్ ఎవరు? ఆ వివరాలు చూద్దాం.

ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో పద్ధతిగా కనిపించిన హీరోయిన్లు.. యూ టర్న్ తీసుకొని గ్లామర్ ప్రాత్రలకు కూడా సై అంటున్నారు. ఇటీవలే టాలీవుడ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ గ్లామర్ గేట్లు ఎత్తేసిన విషయం తెలిసిందే. టిల్లు స్క్వేర్ మూవీలో అనుపమ ఏ రేంజ్ లో చెలరేగిపోయిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇక తాజాగా ఓ సీనియర్ హీరోయిన్ రొమాన్స్ కు వయసుతో సంబంధం లేదు అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది. మరి ఆ సీనియర్ హీరోయిన్ ఎవరు? ఆ వివరాలు చూద్దాం.

ప్రేమకు వయసుతో సంబంధం లేదు.. అనే మాట మనం తరచుగా వింటూనే ఉంటాం. అయితే ఓ సీనియర్ బ్యూటీ మాత్రం శృంగారానికి ఏజ్ తో సంబంధం లేదంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. టబు. విక్టరీ వెంకటేష్ నటించిన కూలీ నెం.1 చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది టబు. ఆ తర్వాత వరుసగా ఆఫర్లు కొట్టేసి.. బడా హీరోల సరసన నటించింది. నాగార్జునతో నటించిన ‘నిన్నే పెళ్లాడతా’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో ఛాన్స్ లు క్యూ కట్టాయి. చిరంజీవి, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోలతో నటించింది.

ఆ తర్వాత బాలీవుడ్ తో పాటుగా ఇతర ఇండస్ట్రీల్లో సినిమాలు చేస్తూ.. బిజీ బిజీగా కెరీర్ ను లీడ్ చేస్తోంది టబు.  ఇటీవలే హిందీలో ‘క్రూ’ అనే చిత్రంలో బోల్డ్ గా నటించి ఆకట్టుకుంది. ఇక అక్కడ అజయ్ దేవ్ గన్ తో కలిసి చాలా సినిమాల్లో నటించింది. ఇదిలా ఉండగా.. తాజాగా టబు చేసిన బోల్డ్ కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. 50 ఏళ్ల వయసులో కూడా రోమాంటిక్ సీన్స్ చేయడానికి వెనకాడటం లేదు ఈ బ్యూటీ. ప్రస్తుతం అరోన్ మే క్యా దమ్ థా అనే సినిమాలో నటిస్తోంది. ఈ క్రమంలోనే కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. “శృంగారం కేవలం వయసుకు యువకులకు సంబంధించిందే కాదు. నా కొత్త మూవీలో ఎక్కువగా ప్రేమ, శృంగారం కంటే రిలేషన్ షిప్ గురించే ఉంటుంది. ప్రేమ, శృంగారం అనేవి మానవ సంబంధాల్లో భాగం” అని బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చింది టబు. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Show comments