Rashmika Mandanna: రష్మిక బంగారం సార్.. మగాళ్ల గురించి ఎంత బాగా చెప్పిందో చూడండి!

రష్మిక బంగారం సార్.. మగాళ్ల గురించి ఎంత బాగా చెప్పిందో చూడండి!

Rashmika Mandanna: కొందరు నెటినజ్లను సెలబ్రిటీలను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతుంటారు. కొందరు సెలబ్రిటీలు మాత్రం తమదైన స్టైల్ లో రిప్లయ్ ఇస్తుంటారు. తాజాగా అలానే నేషనల్, కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా కూడా అదిరిపోయే రిప్లయ్ ఇచ్చింది

Rashmika Mandanna: కొందరు నెటినజ్లను సెలబ్రిటీలను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతుంటారు. కొందరు సెలబ్రిటీలు మాత్రం తమదైన స్టైల్ లో రిప్లయ్ ఇస్తుంటారు. తాజాగా అలానే నేషనల్, కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా కూడా అదిరిపోయే రిప్లయ్ ఇచ్చింది

సినిమాలకు సంబంధించిన న్యూస్ ను చూసేందుకు జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. సెలబ్రిటీలకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు, ఇతర ఈవెంట్స్ గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు నెటినజ్లను సెలబ్రిటీలను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతుంటారు. అలా పెట్టే పోస్టులను చాలా మంది సెలబ్రిటీలు  లైట్ తీసుకుంటారు. కొందరు మాత్రం తమదైన స్టైల్ లో రిప్లయ్ ఇస్తుంటారు. తాజాగా అలానే నేషనల్, కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా కూడా అదిరిపోయే రిప్లయ్ ఇచ్చింది. మరి..అసలు విషయం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

రష్మిక మందన్నా.. ఈ పేరు తెలియని టాలీవుడ్ ప్రేక్షకుడు ఉండటు. నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ కన్నడ బ్యూటీ ప్రస్తుతం పుష్ప-2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది. ఈ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాస్టార్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా ద్వారా ఈ  బ్యూటీ పాన్ ఇండియా స్టార్ అయింది. ఈ  సినిమాల్లో శ్రీవల్లి పాత్రలో అదరగొట్టడమే కాకుండా ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పొందింది. పుష్పా 2 ద్వారా మరోసారి ఈ అమ్మడు ప్రేక్షకుల ముందుకు రానుంది. మొత్తంగా బన్నీ ఫ్యాన్, రష్మిక అభిమానులు పుష్ప 2 సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ సంగతులు ఇలా ఉంటే.. గతేడాది రణ్‌బీర్‌ కపూర్‌తో కలిసి యానిమల్‌లో రష్మిక నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రచ్చ రచ్చ చేసింది. వసూల సునామీ సృష్టించింది. దీంతో యనిమాల్ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది ఈబ్యూటీ. సందీప్‌ రెడ్డి వంగా డైరెక్షన్‌లో యానిమల్ మూవీని తెరకెక్కించారు. తండ్రిపై ఉండే ప్రేమను బేస్ చేసుకుని సందీప్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు. మొత్తంగా బాలీవుడ్ లో తెలుగువాడి సత్తా ఏమిటో సందీప్ రెడ్డి చూపించాడు. తాజాగా యానిమల్ సినిమాలోని ఓ వీడియో క్లిప్‌ను నెటిజన్‌ షేర్ చేస్తూ ఓ కామెంట్ ను పోస్టు చేశారు.

ఒక మగవాడిని నమ్మడం అనే దానికంటే భయంకరమైంది ఇంకోటి లేదంటూ యానిమల్‌లోని రష్మిక, రణ్‌బీర్‌ కపూర్‌, త్రిప్తి ఉన్న వీడియోను షేర్ చేశారు. అయితే నెటిజన్ చేసిన ఆ పోస్టు రష్మిక సైతం రిప్లై ఇ చ్చింది. ఆమె కూడా రిటర్న్ పోస్టు పెట్టింది. మీరు చేసిన దాంట్లో ఓ చిన్న కరెక్షన్‌ ఉందంటూ ఈ అమ్మడు రిప్లయ్ ఇచ్చింది. ఓ పిచ్చి వ్యక్తిని మీరు నమ్మడమనేది భయం.. అలాగే ఇక్కడ చాలా మంది మంచి మగవాళ్లు కూడా ఉన్నారని, అలాంటి వారిని నమ్మితే అదొక ప్రత్యేకమంటూ స్పెషల్ రష్మిక రాసుకొచ్చింది. ప్రస్తుతం రష్మిక చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. రష్మిక బంగారం సార్.. మగాళ్ల గురించి ఎంత బాగా చెప్పిందో చూడండ అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఈ కన్నడ బ్యూటి పెట్టిన పోస్టుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments