Actress Ramya : నాకు అలాంటి చెడు మెసేజ్ లు వచ్చేవి.. కానీ నేను ఇలా చేయలేదు : రమ్య

Actress Ramya :నాకు అలాంటి చెడు మెసేజ్ లు వచ్చేవి.. కానీ నేను ఇలా చేయలేదు : రమ్య

ప్రస్తుతం మీడియా సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసిన వినిపిస్తున్న పేరు కన్నడ నటుడు దర్శన్ గురించే. తాజాగా దర్శన ఓ హత్య కేసులో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు మరో నటి ఈ విషయంపై స్పందించింది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రస్తుతం మీడియా సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసిన వినిపిస్తున్న పేరు కన్నడ నటుడు దర్శన్ గురించే. తాజాగా దర్శన ఓ హత్య కేసులో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు మరో నటి ఈ విషయంపై స్పందించింది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఇండస్ట్రీలో మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు కన్నడ నటుడు దర్శన్. ఇండస్ట్రీ పరంగా ఎలా ఉన్నా కానీ బయట మాత్రం ఈ హీరో చాలానే వివాదాల్లో చిక్కుకున్నాడు. అలాగే చాలా మంది హీరోయిన్స్ తో ఈ హీరోకు ఎఫైర్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెట్టేస్తే.. ఇప్పుడు దర్శన్ ఓ లేడీ కోసం హత్య కూడా చేయించాడు. ప్రస్తుతం దర్శన్ తో రిలేషన్ లో ఉన్న యువతికి.. అసభ్యకరమైన మెసేజ్ లు పంపిస్తున్నందుకు.. రేణుక స్వామి అనే ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేయించాడు దర్శన్. ఈ విషయం కాస్త పోలీసుల వరకు చేరింది.. దింతో ప్రస్తుతం దర్శన్ పోలీసుల అదుపులో ఉన్నాడు. ఇప్పుడు హోల్ ఇండస్ట్రీ మీడియా సోషల్ మీడియాలో ఇదే చర్చ కొనసాగుతుంది. ఈ క్రమంలో మరో నటి ఈ విషయంపై స్పందించింది. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

ఇండస్ట్రీలో ఇప్పుడు ఎవరిని కదిపినా కానీ.. దర్శన్ గురించే మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా కన్నడ ఇండస్ట్రీలో ఈ విషయంపై చాలానే చర్చలు జరుగుతూన్నాయి. ఏకంగా దర్శన్ ను ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలని కొంతమంది డిమాండ్ కూడా చేస్తున్నారు. కాగా తానూ కూడా ఈ విషయంపై నటి రమ్య కూడా స్పందించింది. తానూ కూడా అలాంటి మెసేజ్ ల వలన ఇబ్బంది పడ్డాను అంటూ చెప్పుకొచ్చింది రమ్య. ఈ నటి తెలుగువారికి కూడా సుపరిచితురాలే.. తెలుగులో కళ్యాణ్ రామ్ హీరోగా.. నటించిన అభిమన్యు చిత్రంలోనూ.. తమిళ్ లో సూర్య నటించిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమాలోనూ ఈ అమ్మడు నటించింది. అయితే తాజాగా రమ్య దర్శన్ విషయంలో స్పందించి అతను చేసిన దారుణాన్ని ఖండించింది. తానూ కూడా ఇలాంటి ఆసభ్యకరమైన మెసేజ్ ల వలన ఇబ్బందులకు గురి అయ్యానని.. ఇలా ఎవరైనా చేస్తే బ్లాక్ చేసే అవకాశం ఉందని.. మాట్లాడుతూ.. “ట్రోల్ల్స్ ఎక్కువైతే మీరు కంప్లైంట్ చేయొచ్చు.. నన్ను కూడా చెడు పదాలతో ట్రోల్ చేశారు. నేనే కాదు చాలా మంది ట్రోల్ల్స్ కు గురయ్యారు. ఇతరుల భార్య , పిల్లలను ట్రోల్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మనం చెడు సమాజంలో జీవిస్తున్నాం.

చట్టాన్ని గౌరవించే ప్రతి పౌరుడిలాగే నేను కూడా కంప్లైంట్ చేశాను. అలాంటి వారిని పోలీసులు హెచ్చరించడంతో పాపం కేసు వెనక్కి తీసుకున్నాను. ట్రోల్స్ చేసే వారికి కూడా భవిష్యత్తు ఉంది. కొన్ని ఫేక్ అకౌంట్స్ ద్వారా ట్రోల్ చేస్తూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు” అంటూ రమ్య తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ షేర్ చేశారు. అలాగే చట్టానికి ఎవరూ అతీతులు కాదంటూ.. “చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దు. మీరు వెళ్లి మనుషులను కొట్టి చంపకండి. ఒక సాధారణ కంప్లైంట్ సరిపోతుంది. పోలీసుల పై నాకు నమ్మకం ఉంది. రాజకీయ పార్టీల ఒత్తిళ్లకు లొంగరని, చట్టంపై ప్రజల ఆశలు నిలుపుకుంటారని నమ్ముతున్నాను” అంటూ చెప్పుకొచ్చారు రమ్య. ఏదేమైనా ఆమె చెప్పినవన్నీ వాస్తవాలే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో రమ్య స్పందించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments