Actress Childhood Photo: ఈ చిన్నారి పెద్దయ్యాక ఓ తరాన్ని మొత్తం ఊపేసింది.. ఎవరో గుర్తు పట్టారా?

ఈ చిన్నారి పెద్దయ్యాక ఓ తరాన్ని మొత్తం ఊపేసింది.. ఎవరో గుర్తు పట్టారా?

Actress Childhood Photo: సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన వారు పెద్దయ్యాక హీరో, హీరోయిన్లు, క్యారెక్టర్ పాత్రల్లో నటించారు. కొంతమంది సక్సెస్ అయితే.. కొంతమంది కనిపించకుండా పోయారు.

Actress Childhood Photo: సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన వారు పెద్దయ్యాక హీరో, హీరోయిన్లు, క్యారెక్టర్ పాత్రల్లో నటించారు. కొంతమంది సక్సెస్ అయితే.. కొంతమంది కనిపించకుండా పోయారు.

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతోమంది స్టార్ హీరో, హీరోయిన్లు ఒకప్పుడు బాల నటులుగా ఎంట్రీ ఇచ్చిన వారే. మహేష్ బాబు, ఎన్టీఆర్ నుంచి మొదలు నిన్న మొన్న హనుమాన్ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసి తేజ సజ్జా వరకు చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి స్టార్ డమ్ తెచ్చుకున్నారు. ఇక శ్రీదేవి, మీనా, కీర్తి సురేష్, నిత్యా మీనన్ ఇలా ఎంతోమంది నటీమణులు చైల్డ్ ఆర్టిస్టులుగా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగారు. బాల నటిగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. తర్వాత స్టార్ హీరోయిన్ మారి ఓ తరాన్ని మొత్తం ఊపేసింది.ఆ తర్వాత బుల్లితెపై కూడా తన సత్తా చాటింది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా.. పూర్తి వివరాల్లోకి వెళితే..

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన అమ్మాయిలు తర్వాత హీరోయిన్లుగా ఎదిగారు. బాలనటిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఓ తరం హీరోలతో నటించి సెన్సేషన్ క్రియేట్ చేసిన నటి రాశీ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. రాశీ చెన్నైలో జన్మించింది. ఆమె తల్లిది భీమవరం.. తండ్రిది చెన్నై. రాశికి ఒక సోదరుడు ఉన్నాడు. రాశి ఫ్యామిలీ మొదటి నుంచి ఇండస్ట్రీ బ్యాగ్ గ్రౌండ్. ఆమె తండ్రి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి తర్వాత డ్యాన్సర్ గా మారారు. తాతయ్య పద్మాలయ, విజయవాహిని స్టూడికోలకు జూనియర్ ఆర్టిస్టులను సప్లై చేసేవాడు. అలా రాశీ బాల నటిగా చాన్సులు దక్కించుకొని మంచి పేరు సంపాదించింది. టెన్త్ వరకు చదివిన ఈ అమ్మడు తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.హీరోయిన్ గా కొనసాగుతూనే ఇంగ్లీష్ లిటరేచర్ లో డిగ్రీ పూర్తి చేసింది.

హీరోయిన్ గా మారిన తర్వాత పవన్ కళ్యాన్ నటించిన గోకులంలో సీత, జగపతి బాబు నటించిన శుభాకాంక్షలు చిత్రంతో మంచి పేరు తెచ్చుకుంది. తర్వాత వరుస ఛార్సులు దక్కించుకుంటూ స్టార్ హీరోయిన్ గా మారింది. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది. ఓ వైపు హీరోయిన్ గా నటిస్తూనే శ్రీను, సముద్రం, వెంకి చిత్రాల్లో ఐటమ్ సాంగ్ లో నటించింది. వెండి తెరపై చాన్సులు తగ్గడంతో బుల్లితెరపై అడుగు పెట్టింది. గిరిజా కళ్యాణం, జానకి కలగనలేదు సీరియల్స్ లో నటించింది. ఇటీవల సినీ ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. తాజాగా రాశీకి సంబంధించిన ఓ చైల్డ్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Show comments